
న్యూఢిల్లీ/చండీగఢ్: హరియాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల, రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే హామీలను నెరవేరుస్తామని, ఎప్పుడు చేస్తామన్న విషయాన్ని వివరించే టైమ్‌లైన్ కూడా విడుదల చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తవుతోందని, త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. తన్వార్ రాజీనామా గురించి మాట్లాడుతూ.. పార్టీ ఆయన్ను స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటిస్తే ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారన్నారు. తమకు వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత హరియాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు.
మనం భారత్‌మాతా కీ జై అంటే వారు...
కాంగ్రెస్ పార్టీ నేతలకు దేశం కంటే అధిష్టానమే ముఖ్యమని, అందుకే వారు సోనియా మాతాకీ జై అంటారని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. గూర్గాన్‌కు చెందిన కాంగ్రెస్ నామినీ సోనియా గాంధీకీ జై అంటూ నినాదాలు చేసిన వీడియో బయటకు రావడంతో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీకి దేశం ప్రాధాన్యమని అందుకే తాము భారత్ మాతాకీ జై అంటామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రస్తుతం ప్రపంచ నేతగా ఎదిగారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment