
చండీగఢ్ : హరియాణాలో కాంగ్రెస్ పార్టీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కుమారి సెల్జా చెప్పారు. హరియాణా ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారని, బీజేపీ వైఫల్యాలను వారు ఇక ఎంతమాత్రం సహించబోరనే సంకేతాలు పంపారని సెల్జా గురువారం ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకత్వంలో హరియాణా తిరిగి నూతన జవసత్వాలు అందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హరియాణాలో 90 అసెంబ్లీ స్ధానాలకు గాను బీజేపీ 37 స్ధానాల్లో, కాంగ్రెస్ 32 స్ధానాల్లో, ఇతరులు 21 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 స్ధానాలకు బీజేపీ చాలా దూరంలో నిలవడంతో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ కింగ్ మేకర్‌గా నిలిచింది. ఆ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment