హర్యానా ఫలితాలు: ‘ఈవీఎం హ్యాకింగ్‌పై ఫిర్యాదు చేశాం’ | haryana poll results: EC letter congress chief mallikarjun kharge Updates | Sakshi
Sakshi News home page

హర్యానా ఫలితాలు: ‘ఈవీఎం హ్యాకింగ్‌పై ఫిర్యాదు చేశాం’

Published Wed, Oct 9 2024 5:51 PM | Last Updated on Wed, Oct 9 2024 7:50 PM

haryana poll results: EC letter congress chief mallikarjun kharge Updates

ఢిల్లీ: హర్యానాలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ భావించారని మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ నేత భూపిందర్ సింగ్ హుడా అన్నారు.  అయితే.. హర్యానా ఫలితాలు తమకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని తెలిపారు. హర్యానా ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ బృదం భేటీ అయింది. 

ఈసీతో భేటీ అనంతరం భూపిందర్ సింగ్ హుడా మీడియాతో మాట్లాడారు. ‘‘పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైనప్పుడు కాంగ్రెస్ అన్ని చోట్లా ఆధిక్యంలో ఉంది. అయితే ఈవీఎంల లెక్కింపులో మాత్రం చాలా వెనకంజలోకి వెళ్లిపోయింది. మాకు చాలా ఫిర్యాదులు అందాయి. పలు చోట్ల ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. ఈ విషయంలో ఎన్నికల సంఘం మాకు హామీ ఇచ్చింది. మేము ఇచ్చిన అన్ని ఫిర్యాదులను అధికారులు పరిశీలిస్తున్నారు’’ అని తెలిపారు.

 

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తర్వాత కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా మీడియాతో మాట్లాడారు.‘‘ మేము ఎన్నికల సంఘం అధికారులను కలిశాం. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పత్రాలను సమర్పించాం. మా ఫిర్యాదులకు సానుకూలంగా స్పందించారు. ఎన్నికల సంఘం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరాం. మరో 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఫిర్యాదులను సైతం ఈసీకి సమర్పిస్తాం. మా అభ్యర్థులు ఈవీఎం బ్యాటరీలకు సంబంధించిన ఫిర్యాదులు లేవనెత్తారని తెలియజేశాం. పరిశీలన పూర్తయ్యే వరకు అన్ని ఈవీఏం యంత్రాలను సీలు చేసి భద్రపరచాలని మేము అధికారులను అభ్యర్థించాం. కర్నాల్, దబ్వాలి, రేవారీ, పానిపట్ సిటీ, హోడల్, కల్కా , నార్నాల్‌లలో  ఈవీఎం హ్యాకింగ్‌కు సంబంధించిన ఆధారాలను సమర్పించాం. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఈసీని కోరాం’ అని అన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement