హర్యానా ఎన్నికల ఫలితాలతో ఢీలా పడిన కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. హస్తం పార్టీ ఓటమిపై ప్రతిపక్ష బీజేపీతోపాటు మిత్రపక్షాల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన శివసేన(ఉద్ధవ్), ఆప్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.
కాంగ్రెస్ అతి విశ్వాసం, అహంకారమే ఎన్నికల ఫలితాల్లో ఓటమికి కారణమని మండిపడితున్నాయి. రాష్ట్రంలో ఇండియా కూటమి పోటీ చేయలేదని, కాంగ్రెస్ నేతలు అతివిశ్వాసంతో వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ, లేక ఆప్‌తో కలిసివెళ్లి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్న అఖిలేష్ యాదవ్‌కి చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కాంగ్రెస్‌కి భారీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది చివర్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో 10లో 5 ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా.. ఈ అభ్యర్థనను ఎస్పీ తిరస్కరించింది. అయితే, ఏప్రిల్-జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శనను ప్రస్తావిస్తూ.. ఆ ప్రపోజల్‌ను ఎస్పీ తిరస్కరించింది.
తాజాగా ఉప ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఆరింటికి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. కర్హల్ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను, సిసాము నుంచి నసీమ్ సోలంకి, ఫుల్‌పూర్ (ప్రయాగ్‌రాజ్) నుంచి ముస్తఫా సిద్దిఖీ, మిల్కిపూర్ (అయోధ్య) నుంచి అజిత్ ప్రసాద్‌కు, కతేహరి నుంచి శోభావాయ్ వర్మ, మజ్వాన్ స్థానం నుంచి జ్యోతి బింద్‌లకు పార్టీ టిక్కెట్లు ఇచ్చినట్లు పేర్కొంది. అయితే వీటి పోలింగ్‌కు ఇంకా ఎన్నికల కమిషన్ అధికారికంగా ఎన్నికల తేదీని ప్రకటించలేదు
Comments
Please login to add a commentAdd a comment