సీఎం రేసుపై సెల్జా
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తే హరియాణా సీఎం రేసులో తాను కూడా ఉంటానని సీనియర్ నాయకురాలు, ఎంపీ కుమారి సెల్జా స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా, సామాజికవర్గంగా ప్రజలకు ఆకాంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు ఒకటో తేదీన జరగనున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో సిర్సా నుంచి లోక్‌సభకు ఎన్నికైన దళిత నాయకురాలు సెల్జా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు.
రాష్ట్రంలో పనిచేయాలనేది తన అభిమతమని, ఈ విషయంలో పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. హరియాణా కాంగ్రెస్ భూపిందర్ సింగ్ హుడా, సెల్జా వర్గాలుగా చీలిపోయింది. ఇది కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతిస్తోందనే వాదనను సెల్జా కొట్టిపారేశారు. ఎన్నికలు వచి్చనపుడు అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ శిబిరంగా బరిలోకి దిగుతామని చెప్పారు. “్ఙనేను చాలా వాస్తవిక దృక్పథంతో ఉంటాను. ముక్కుసూటిగా సమాధానాలు చెబుతాను. ఏ సంస్థలో తీసుకొన్నా ఆధిపత్య పోరాటం ఉంటుంది.
ఆకాంక్షలు, పార్టీ కోసం శ్రమించడం, స్థానాన్ని పదిలపర్చుకునే ప్రయత్నం.. అన్నీ ఉంటాయి. అయితే పార్టీ అభ్యర్థులను ప్రకటించే వరకే ఇవన్నీ. తర్వాత అందరూ ఒక్కటై క్షేత్రస్థాయిలోకి వెళ్లడమే’ అని సెల్జా చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత ఇతర పారీ్టలతో కూటమి కట్టే అవకాశాలపై మాట్లాడుతూ.. హరియాణాలో హంగ్ రానేదాదని, కాంగ్రెస్ అద్భుత మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవుతున్నామని, ప్రజలంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. అధికారంలో లేనపుడు సీఎం అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు వెళ్లే సంప్రదాయం కాంగ్రెస్ పారీ్టలో లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment