హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటూ మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. మొత్తం 90 నియోజకవర్గాలకు గానూ 55కి పైగా స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఇక రేపు(అక్టోబర్ 8) అధికారిక ఫలితాలు వెలువడనున్న ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు ఎవరు చేపడతారన్న దానిపై చర్చ మొదలైంది.
ప్రధానంగా సీఎం పదవికి ముందంజలో ఉన్న పార్టీ సీనియర్ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలా పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఎంపీ కుమారి సెల్జా స్పందించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అయితే ఆ పదవికి కావాల్సిన అర్హతలు, అనుభవం తనకు ఉందని పేర్కొన్నారు.
@నేనేమీ చెప్పలేను. నేనే కాదు. ఎవరూ ఏం చెప్పలేరు.. సీఎం ఎవరనే విషయం హైకమాండ్ ప్రకటన తర్వాతే తెలుస్తుంది.. హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ అంగీకరిస్తారు.. నేను ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో మాట్లాడాను.. ఈ విషయం హైకమాండ్‌కు తెలుసు. అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది.’ అని కుమారి సెల్జా సోమవారం తెలిపారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర’ ఆయనపై. పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మార్చేసిందని పేర్కొన్నారు. ‘రాహుల్ యాత్రతో మొత్తం మారిపోయింది. ఆయనపై ప్రజల్లో ఉన్న అవగాహన, కాంగ్రెస్‌పై ఉన్న అభిప్రాయం, బీజేపీపై ఉన్న అభిప్రాయం మారిపోయింది. అందుకే లోక్‌సభలో బీజేపీ సీట్లు ఎలా తగ్గాయో చూశాం. హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment