Bhupinder Singh Hooda
-
హర్యానాలో కాంగ్రెస్ హవా.. వారిద్దరిలో సీఎం ఎవరు?
ఢిల్లీ: హర్యానా, జమ్ము కశ్మీర్‌కు సంబంధించి ఎగ్జిట్‌పోల్స్ నేడు విడుదలయ్యాయి. ఈ క్రమంలో పలు సర్వే సంస్థలు హర్యానాలో కాంగ్రెస్‌కు అధికారం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. హర్యానాలో 90 నియోజకవర్గాలకు గానూ 55కి పైగా స్థానాల్లో హస్తం పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్పాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం ఎవరు అనే చర్చ మొదలైంది.హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి స్థానం ఎవరిది? అనే చర్చ రాజకీయంగా చర్చనీయాశంగా మారింది. ప్రధానంగా పార్టీలో సీనియర్ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ సీఎం ఎవరు అనే అంశం పార్టీ హైకమాండ్ నిర్ణయింస్తుందని తెలిపారు. కుమారి సెల్జాకు సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశముందా? అని ప్రశ్నించగా.. మనది ప్రజాస్వామ్యం. సీఎం పదవి కోసం ఎవరైనా ఆసక్తి చూపవచ్చు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో..హర్యానాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని భావిస్తున్నాం. ప్రస్తుత బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. అవినీతి పెరిగిపోయింది. అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రజలందరూ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. #ElectionsWithNDTV #HaryanaElections #BhupinderHooda pic.twitter.com/wF7Z7WMnqn— NDTV (@ndtv) October 5, 2024 -
హరియాణా బీజేపీ సర్కారుకు కౌంట్‌డౌన్
న్యూఢిల్లీ/చండీగఢ్/కురుక్షేత్ర: హరియాణాలోని బీజేపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని మాజీ సీఎం భూపీందర్ హుడా వ్యాఖ్యానించారు. అవినీతి, చేతగాని ప్రభుత్వం గద్దెదిగడం ఖాయ మని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం కుంభకోణాలు, తప్పుడు హామీలతో పదేళ్లుగా ప్రజలను దోచుకుందని, అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించనుందని ఆయన ఆరోపించారు. నామినేషన్ వేసిన ప్రముఖులు: కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా కుమారుడు ఆదిత్య సూర్జే వాలా, మాజీ సీఎం బన్సీలాల్ మునిమనవరాలు, బీజేపీకి చెందిన శ్రుతి చౌదరి, కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రీ జిందాల్ గురువారం నామినేషన్లు వేసిన ప్రముఖుల్లో ఉన్నారు. -
దేశం వారిని క్షమించదు: బ్రిజ్ భూషణ్
ఢిల్లీ: హుడా కుటుంబాన్ని హర్యానా అక్కా చెల్లెళ్లు అస్సలు క్షమించరని రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషన్ అన్నారు. హుడా కుటుంబాన్ని పాండవులతో పేల్చుతూ విమర్శలు గుప్పించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘‘మహాభారతం సమయంలో ద్రౌపది పణంగా పెట్టి జూదం ఆడి పాండవులు ఓడిపోయారు. దీనికి పాండవులను దేశం ప్రజలు ఇప్పటికీ క్షమించలేదు. అలాగే హర్యానా అక్కాచెల్లెళ్లు, మహిళల పరువుకు భంగం కలిగించి హుడా కుటుంబాన్ని కూడా భవిష్యత్తులో క్షమించరు. ఈ విషయంలో వారిని ఎప్పుడూ దోషులుగానే చూస్తారు’’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియాలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే.. రెజ్లర్లు తనపై ఆందోళన చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర బయటపడిందని శనివారం అన్నారు. రెజ్లర్ల ఆందోళన వెనకాల హర్యానా మాజీ సీఎం భూపేందర్ హుడా, ఆయన కుమారుడు దీపేందర్ హుడా ఉన్నారని మండిపడ్డారు. అదేవిధంగా వినేశ్ ఫోగట్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకే పతకం చేజారిందని అన్నారు.#WATCH | Gonda, UP: Former WFI President and BJP leader Brij Bhushan Sharan Singh says, "...During the Mahabharata, the Pandavas had put Draupadi on stake and lost. The country has not forgiven the Pandavas for this till date. Similarly, the Hooda family will not be forgiven for… pic.twitter.com/Pp7G6oT7ek— ANI (@ANI) September 8, 2024మరోవైపు.. బ్రిజ్ భూషన్ చేసిన వ్యాఖ్యలపై వినేశ్ ఫోగట్ స్పందించారు. ఆమె ఆదివారం జులనా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వినేశ్ మాట్లాడుతూ.. “నేను రెజ్లింగ్‌లో ఏది గెలిచినా అది ప్రజల వల్లనే గెలిచాను. రాజకీయాల్లోనూ విజయం సాధిస్తానని ఆశిస్తున్నా. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన గురించి తర్వాత మాట్లాడుతా. బ్రిజ్ భూషణ్ ఏం దేశం కాదు.. ప్రజలు నాతో ఉన్నారు. వారు నా స్వంతం. ప్రజలే నన్ను ఆదరించారు. అన్ని పోటీల్లో విజయం సాధిస్తా. పతకం రాలేదన్న బాధ భారత్‌లోని ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత తగ్గింది. ఎన్ని సవాళ్లు అయినా ఎదుర్కొంటున్నా’ అని అన్నారు. -
రాజ్యసభకు వినేశ్ ఫోగట్?
ఢిల్లీ: ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పండింది. ఈ క్రమంలో ఆమెకు దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు అండగా నిలిచారు. ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ వినేశ్ అనర్హత అంశంపై పార్లమెంట్లో చర్చ జరపాలని పట్టుపట్టాయి. తాజాగా వినేశ్ ఫోగట్ అనర్హత మాజీ హర్యానా సీఎం భూపేందర్ సింగ్ హూడా స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజ్యసభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం ఉంటే వినేశ్ పేరును ప్రతిపాదించేవాడిని. ఆమె మనందిరికీ చాలా గర్వకారణం’’ అని అన్నారు. మరోవైపు.. భూపేంద్ర సింగ్ హూడా తనయుడు ప్రస్తుత కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ దీపేందర్ హూడా సైతం స్పందిస్తూ.. రాజ్యసభలో ఒక సీట్ ఖాళీ కాబోతోందని, దానికి ఫోగట్‌ను నామినేట్ చేస్తామని అన్నారు. ఆమె ఓడిపోలేదని, మన అందిరి మనసులు గెలిచిందన్నారు.అయితే కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై వినేశ్ ఫోగట్ పెద్దనాన్న మహవీర్ ఫోగట్ స్పందించారు. వారి మాటలు ఒక పోలిటికల్ స్టంట్ అని అన్నారు. భూపేందర్ సింగ్ హూడా హర్యానా సీఎంగా ఉన్న సమయంలో తన కూతురు గీతా ఫోగట్ సైతం పలు పతకాలు సాధించిందని, కానీ ఆమెను రాజ్యసభకు పంపలేదని అన్నారు. మెజార్టీ ఉంటే వినేశ్‌ను రాజ్యసభకు పంపేవాడినని భూపీందర్ హుడా ఇప్పుడు అంటున్నారు. మరీ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు గీతా ఫోగట్‌ను ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు మాటాలు పొలిటికల్ స్టంట్ మాత్రమేనని అన్నారు. -
కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రాహుల్ చెంతకు రెబల్స్!
సాక్షి, న్యూఢిల్లీ: వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. తిరిగి జవసత్వాలు నింపే ప్రయత్నాలు మరో మలుపు తీసుకుంటున్నాయి. బుధవారం పద్దెనిమిది మంది రెబల్స్ నేతలు సమావేశమై ‘కలుపుగోలుగా ముందుకు వెళ్లే నాయకత్వం’ అంశంపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో జీ-23గా పిల్చుకునే నేతలు కొందరితోపాటు, యువ నేతలు సైతం పాల్గొన్నారు. ఈ తరుణంలో.. రెబల్ గ్రూప్ నుంచి నేతలు ‘గాంధీ’ కుటుంబ సభ్యుల దగ్గరికి క్యూ కట్టడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ పట్ల తమ విధేయతను ప్రస్తావిస్తూనే.. తమ అసంతృప్తిని వెల్లగక్కుతూ, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టుకుంటున్నారు. గురువారం ఉదయం హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హూడా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. హర్యానా కాంగ్రెస్ ఛీఫ్ పదవిని తనకి, తన తనయుడు దీపిందర్ హూడాకు ఇవ్వకుండా షెల్జా కుమారీకి ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్నారు హుడా. షెల్జా, సోనియాగాంధీకి దగ్గర అయినందునే ఆమెకు పదవి కట్టబెట్టారని, అందుకే హర్యానా కాంగ్రెస్‌లో కుమ్ములాట కొనసాగుతోందని ఆయన రాహుల్‌కి వివరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..భూపిందర్ హూడా బాటలోనే మరికొందరు రెబల్స్.. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. గత రెండేళ్లుగా నాయకత్వ మార్పుపైన జీ-23 నేతలు గట్టిగా గళం వినిపిస్తున్నారు. అయితే ఆ గ్రూప్‌ను రెబల్స్‌గా పరిగణిస్తూ.. దూరం పెడుతోంది అధిష్టానం. మరోవైపు ఐదు రాష్ట్రాల ఓటమి తర్వాత జరిగిన జీ-23 సమావేశంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పోస్ట్ మార్టం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఓడిన ఐదు రాష్ట్రాల చీఫ్‌లను రాజీనామా సమర్పించమని కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ కోరారు. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో మార్పుల కోసం ఐదుగురు నేతల పేర్లను సైతం ఆమె ప్రతిపాదించారు. అయితే ఆ నేతల వల్లే పార్టీ పతన స్థితికి చేరుకుందనేది రెబల్స్ ఆరోపణ. తమపై ఎలాంటి నిందలు వేసినా.. ఎలాంటి చర్యలు తీసుకున్నా పార్టీ కోసం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ సీనియర్లు చెప్తున్నారు. ఇందుకోసం అధిష్టానంతో ఎన్నిసార్లు చర్చించేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు. -
టార్గెట్ హరియాణా : సోనియాతో భూపీందర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ మేజిక్ ఫిగర్‌కు 6 సీట్ల దూరంలో ఉండటంతో బీజేపీయేతర పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సన్నాహాలు ముమ్మరం చేసింది. 90 మంది సభ్యులు కలిగిన హరియాణా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది సభ్యులు అవసరం కాగా బీజేపీ 40 స్ధానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ మెరుగైన సామర్ధ్యం కనబరిచి 31 స్ధానాల్లో గెలుపొందింది. ఇక పది స్ధానాలు గెలుచుకున్న దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ కింగ్‌మేకర్‌గా మారింది. మరో ఏడు స్ధానాల్లో గెలుపొందిన స్వతంత్రులు సైతం కీలకంగా మారారు. వీరి మద్దతు కూడగట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయి. హరియాణా వ్యవహారాలపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించేందుకు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా ఢిల్లీ చేరుకున్నారు. రోహ్తక్ జిల్లా గర్హి సంప్లా-కిలోల్ నియోజకవర్గం నుంచి హుడా గెలుపొందారు. ఇండిపెండెట్లతో పాటు జేజేపీ మద్దతు కూడగట్టేందుకు హుడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. -
ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన కాంగ్రెస్ నేత
చండీగఢ్ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి సంబంధించి తాను ప్రధాని నరేంద్ర మోదీని సమర్థిస్తానని సీనియర్ కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా వ్యాఖ్యానించారు. దేశభక్తి, ఆత్మగౌరవం విషయాల్లో తాను రాజీపడబోనని స్పష్టం చేశారు. భూపీందర్ హుడా ఆదివారం రోహ్తక్లో జరిగిన పరివర్తన్ మహా ర్యాలీలో మాట్లాడుతూ ప్రభుత్వం ఏమైనా మంచి పనులు చేపడితే తాను వాటిని సమర్ధిస్తానని చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ తన మునుపటి ప్రాభవం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. హర్యానాలో బీజేపీ నేతృత్వంలోని మనోహర్‌లాల్ ఖటర్ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని, ఆర్టికల్ 370 రద్దు ఘనత మాటున దాక్కోరాదని హితవుపలికారు. మరోవైపు హర్యానాలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ తరహాలో స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించాలనే చట్టం తీసుకువస్తామని స్పష్టం చేశారు. కాగా త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భూపీందర్ కాంగ్రెస్‌ను వీడి సొంత రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. -
హర్యానా మాజీ సీఎం నివాసంలో సీబీఐ దాడులు
రోహ్తక్ : భూ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించి హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా నివాసంపై సీబీఐ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలోని దాదాపు 30కి పైగా ప్రదేశాల్లో సీబీఐ దాడులు చేపట్టింది. 2005లో హర్యానాలోని పంచ్కులలో ఏజేఎల్‌కు ప్లాట్‌ను రీ అలాట్ చేయడంపై గత ఏడాది డిసెంబర్లో హుడాపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. హుడా హర్యానా సీఎంగా పనిచేసిన సమయంలో పంచ్కులలో 14 పారిశ్రామిక ప్లాట్లను నామమాత్రపు ధరకు కట్టబెట్టారని ఆయనపై దర్యాప్తు ఏజెన్సీ ఆరోపిస్తోంది. ఇండస్ర్టియల్ ప్లాట్ల కేటాయింపునకు చివరి తేదీ 2012 జనవరి 6 కాగా, జనవరి 24న దరఖాస్తు చేసుకున్న 14 మందికి భూమిని కేటాయించారని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. ప్రత్యేక న్యాయస్ధానంలో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ పంచ్కులలో సీ-17 ప్లాట్‌ను రీ అలాట్ చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ 67 లక్షల నష్టం వాటిల్లందని ఆరోపించింది. -
వాద్రా, హుడాపై ఎఫ్ఐఆర్
చండీగఢ్: గుర్గావ్లో అక్రమ భూ ఒప్పందాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బావ రాబర్ట్ వాద్రా, హరియాణా మాజీ సీఎం భూపిందర్‌సింగ్ హుడాలపై శనివారం పోలీసులు కేసు నమోదుచేశారు. సురేందర్ శర్మ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు వాద్రా, హుడాతో పాటు డీఎల్ఎఫ్, ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు మనేసర్ డీసీపీ రాజేశ్ చెప్పారు. గుర్గావ్లోని 4 గ్రామాల్లో హౌసింగ్ కాలనీలు, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి హుడా సీఎంగా ఉన్న సమయంలో ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. వీటిపై విచారణకు ఖట్టర్ ప్రభుత్వం 2015లో జస్టిస్ ధింగ్రా కమిటీ వేసింది. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ 2008లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి 3.5 ఎకరాల భూమిని రూ.7.50 కోట్లకు కొనుగోలుచేసి, హుడా పలుకుబడితో వాణిజ్య అనుమతులు పొంది ఆ భూమిని డీఎల్ఎఫ్కు రూ.58 కోట్లకు విక్రయించిందని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. -
మాజీ సీఎంపై సీబీఐ దర్యాప్తుకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని హరియాణా మాజీ ముఖ్యమంత్రిపై సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. భూపేందర్ సింగ్ హుడా హరియాణా ముఖ్యమంత్రిగా ఉన్న (2004-07) సమయంలో 912 ఎకరాల్లో భూ కుంభకోణం జరిగిందని జస్టిస్ ఎకే గోయల్, ఉదమ్ లలిత్‌తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. హూడా సీఎంగా ఉన్న సమయంలో డీఎల్ఎఫ్ హౌసింగ్ కార్సోరేషన్‌కు ఇండస్టీయల్ టౌన్షిప్ కొరకు కేటాయించిన భూముల్లో భారీ ముడుపులు తీసుకున్నారని, వాటిని వెంటనే రికవరీ చేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. కేసును వెంటనే దర్యాప్తు చేసి భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని సుప్రీం ఆదేశించింది. ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రజా ప్రతినిదులే భారీ కుంభకోణలకు పాల్పడితే ప్రజలకు రక్షణ ఎక్కడినుంచి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి పై తీవ్ర అసహానం వ్యక్తం చేసింది. ఉధ్దేశ పూర్వకంగానే ఈ అవకతవకలకు పాల్పడ్డారని ప్రజలనుంచి తీసుకున్న భూములన్నింటిని స్వాధీనం చేసుకోవాలని సీబీఐని ఆదేశించింది. (కాగా రైతులు దగ్గర నుంచి తీసుకున్న 912 ఎకరాల్లో.. ఎకరానికి కేవలం రూ. 25 లక్షల చొప్పున రైతులకు చెల్లించి, రూ.80 లక్షలు చెల్లించామని ప్రభుత్వనికి లెక్కల్లో చూపారు. కాగా డీఎల్ఎఫ్ సంస్థకు మాత్రం ఎకరం 4.5 కోట్ల చొప్పున 912 ఎకరాలను కేటాయించారు.) -
మాజీ సీఎంపై సీబీఐ ఛార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ: మానేసర్ భూ కుంభకోణం కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై శుక్రవారం సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ మాజీ సీఎంతో పాటు దీంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో మరో 34 మంది అధికారుల పేర్లను ఛార్జిషీట్లో చేర్చారు. భూపిందర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేసిన మురారి లాల్ తయాల్, యూపీఎస్సీ మాజీ సభ్యుడు చాటర్ సింగ్ సహా తదితర అధికారులపై వేల పేజీలతో కూడిన ఛార్జిషీట్‌ను సీబీఐ అధికారులు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. ఈ 24లోగా పూర్తి ఆధారాలు సమర్పించేందుకు సీబీఐని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. అసలు ఏం జరిగిందంటే.. భూపిందర్ సీఎంగా ఉన్న 2005-15 కాలంలో మానేసర్‌లో ఇండస్ట్రియల్ మోడల్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకుగానూ 900 ఏకరాలకు పైగా భూమి సేకరించాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో తక్కువ ధరలకే బిల్డర్స్ రైతులు, స్థానికులను బెదిరించి భూములు కొనుగోలు చేశారు. అయితే హుడా ప్రభుత్వమే బలవంతంగా మార్కెట్ ధర కంటే తక్కువ ధరలకే భూములు సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఉద్దేశపూర్వకంగానే భూములు కొనుగోలు చేసిన తర్వాత హుడా ప్రభుత్వం అక్కడ ఎలాంటి టౌన్షిప్ నిర్మించకపోవడం గమనార్హం. తాజాగా సీబీఐ దీనిపై ఛార్జిషీటు దాఖలు చేసి కేసు విచారణను వేగవంతం చేయాలని చూస్తోంది. -
హర్యానా మాజీ సీఎం హూడాకు చిక్కులు
-
రాహుల్గాంధీలాగే ఆయన కూడా....
న్యూఢిల్లీ: హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాదిరే హూడా కూడా అజ్నానంతో మాట్లాడుతున్నాడంటూ స్వామి విరుచుకుపడ్డారు. ‘అధికారం, పరిజ్నానం రెండూ లేకపోవటం మూలంగానే హూడా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రపతి పాలన విధించటం అంటే ఆషామాషీ కాదు. రాహుల్ గాంధీలాగానే హూడా కూడా అజ్నానంతో మాట్లాడుతున్నారు. బాంబే తీర్పును ఓసారి పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది’ అంటూ స్వామి మాజీ సీఎంకు చురకలంటించారు. హరియాణాలో గుర్మీత్ దోషిగా తీర్పు, ఆపై డేరా అనుచరుల హింస దృష్ట్యా ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలంటూ శనివారం భూపిందర్ సింగ్ కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఇలా స్పందించారు. మరోవైపు రాష్ట్రం రావణ కాష్టంలా తగలబడుతుంటే సహకరించాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారంటూ హూడాపై హరియాణా బీజేపీ నేత ఎస్ ప్రకాశ్ మండిపడ్డారు. డేరా సచ్చా సౌదా భూపిందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఒకరకంగా ఈ హింసాకాండకు మీరు(హూడా) కూడా బాధ్యులేనని ప్రకాశ్ ధ్వజమెత్తారు. -
మాజీ సీఎం సలహాదారుపై దేశద్రోహం కేసు
న్యూఢిల్లీ: హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా సలహాదారు ప్రొఫెషర్ వీరేంద్ర సింగ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. జాట్ల ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని, హింస పెరిగేలా రెచ్చగొట్టాలంటూ ఇటీవల జాట్ ఉద్యమ నాయకుడితో వీరేంద్ర సింగ్ మాట్లాడిన ఫోన్ సంభాషణలు వెలుగు చూశాయి. అయితే ఫోన్ సంభాషణల్లో ఉన్నది తన గొంతేనని, తన మాటలను కత్తిరించి వేరే అర్థం వచ్చేలా రికార్డ్ చేశారని వీరేంద్ర సింగ్ చెప్పారు. ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం జాట్లు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హింస వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరేంద్ర సింగ్ ఫోన్ సంభాషణలు బయటికి రావడం కలకలం రేపింది. హరియాణా పోలీసులు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించాల్సి వుంది. ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ రాజేంద్ర సింగ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
హర్యానా మాజీ సీఎంకు కష్టాలు
-
ఓటమిని ఒప్పుకుంటున్నా: హుడా
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా అంగీకరించారు. ప్రజాతీర్పును ఒప్పుకుంటున్నానని ఆదివారం విలేకరులతో అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్నారు. గతంలో తాము విజయం సాధిస్తే, ఇప్పుడు బీజేపీ గెలిచిందన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలన లో చేసిన అభివృద్ధిని కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీజేపీ విజయానికి నరేంద్ర మోడీ ప్రభంజనం కారణమన్న వాదనతో ఆయన విభేదించారు. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో బీజేపీ పూర్తి ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. -
హర్యానా సీఎం హుడా విజయం
చంఢీఘర్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, సీఎం భూపిందర్ సింగ్ హుడా విజయం సాధించారు. రోహతక్ జిల్లాలోని గార్హి కిలోయి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హుడా స్వల్ప మెజారిటీ గట్టెక్కారు. తొలుత వెనుకబడ్డ హుడా 3,500 ఆధిక్యంతో గెలిచారు. అయితే హర్యానాలో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. హర్యానా అసెంబ్లీలో 90 సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ నలభై ఆరు స్థానాలను బీజేపీకి కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తొలిసారి రాష్ట్రంలో పీఠాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీకి దాదాపు మార్గం సుగుమం అయ్యింది. -
మోదీ.. హర్యానా సీఎం కావాలనుకుంటున్నారా?
హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. కేవలం 90 అసెంబ్లీ స్ధానాలున్న చిన్న రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి స్థాయి వచ్చి ప్రచారం చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఇంత చిన్న రాష్ట్రంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా 11 ర్యాలీలు నిర్వహించారని, ఆయనేమైనా హర్యానాకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా అని హూదా అడిగారు. ఇలాంటి చిన్న రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రధానమంత్రీ వచ్చిప్రచారం చేయడం తాను చూడలేదన్నారు. ఒకవైపు తన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే.. హూడా మాత్రం తాపీగా ఉదయం బ్యాడ్మింటన్ ఆడుకుని, ఆ తర్వాత టీ తాగుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. -
మూడవసారి అధికారంలోకి రావాలని...
చండీగఢ్: హర్యానాలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని తపిస్తున్న అధికార కాంగ్రెస్ ఈ నెల 15న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బుధవారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఇందులో రైతులతోపాటు పలు వర్గాలు ప్రజలకు తాయిలాలు ప్రకటించింది. రాష్ట్రాన్ని అభివద్ధి పథంలో పరుగులు తీయిస్తామని హామీ ఇచ్చింది. పంచకులలో సీఎం భూపీందర్ సింగ్ హూడా, కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యుడు షకీల్ అహ్మద్ తదితరులు దీన్ని సంయుక్తంగా విడుదల చేశారు. స్వల్పకాలిక రుణాలను క్రమం తప్పకుండా చెల్లించిన రైతుల వడ్డీని పూర్తిగా, దీర్ఘకాలిక రుణాలను చెల్లించిన రైతుల వడ్డీని సగం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రుణ పరిమితిలో పారిశ్రామికవేత్తల విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని పాటిస్తామని పేర్కొన్నారు. భూసేకరణ విధానాన్ని హేతుబద్ధీకరించి, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. బంగాళాదుంపలు, ఉల్లి తదితర పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీని స్థాపిస్తామన్నారు. హర్యానాకు ప్రత్యేక హైకోర్టు సాధన కోసం ఇకముందూ ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని యువతలో కనీసం సగం మందికి ప్రైవేటు ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మహిళలకు ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ** -
‘మోడీ కార్యక్రమాలకు వెళ్లొద్దు’
న్యూఢిల్లీ: హర్యానా సీఎం భూపీందర్ సింగ్ హుడాకు మంగళవారం ఎదురైన అనుభవంపై కాంగ్రెస్ తనదైన శైలిలో స్పందించింది. బీజేపీయేతర(విపక్ష) సీఎంలు ఇక నుంచి ప్రధాని మోడీ సభల్లో పాల్గొనరాదంటూ హితబోధ చేసింది. ఆత్మాభిమానం లేని విపక్ష సీఎంలే ప్రధాని రాజకీయ సభల్లో పాల్గొంటారంటూ చురకలు సైతం అంటించింది. ప్రోటోకాల్ మేరకు ఆయా రాష్ట్రాల్లో మోడీ పాల్గొనే సభలకు హాజరై ‘మమ’ అనిపిస్తే సరిపోతుందని పేర్కొంది. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఏర్పాటవుతున్న ప్రధాని కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరం గా ఉండాలని బీజేపీయేతర సీఎంలకు కాంగ్రెస్ సూచించింది. ఈ కారణంగా నేడు నాగ్‌పూర్‌లో ప్రధాని మోడీ రానున్న కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ హాజరుకావడం లేదు. -
హర్యానా ప్రభుత్వంలో సంక్షోభం
ఛండీగఢ్: హర్యానా ప్రభుత్వంలో సంక్షోభం ముదిరింది. ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాపై విద్యుత్ శాఖ మంత్రి అజయ్‌సింగ్ యాదవ్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపినట్టు అజయ్‌సింగ్ తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం రెవారీకి ప్రాతనిథ్యం వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెల్చామని, ఓటమి పాఠం నేర్చుకోలేదని పరోక్షంగా భూపేందర్ సింగ్ పై మండిపడ్డారు. కొంతమంది పిల్లి మెడలో గంట కట్టాలని ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తన పదవికి రాజీనామా చేశానని తెలిపారు. -
ధరల పెరుగుదలకు కేంద్రానిదే బాధ్యత
గుర్గావ్: ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్ హూడా ఆరోపించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ హామీ ఇచ్చిన విధంగా మంచి రోజులొచ్చాయో లేదో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. ‘రైలు ప్రయాణం భారమయింది. చక్కెర, డీజిల్ ధరలు పెరిగాయి. వీటిని మంచి రోజులు అంటారా?’ అని ఆయన ప్రశ్నించారు. గుర్గావ్లోని కమాన్ సరాయిలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. పేదల సంక్షేమంపై బీజేపీకి ఒక్క విధానమూ లేదని, వంటగ్యాస్ ధరను ప్రతి నెలా రూ.10 చొప్పున పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత ఎల్పీజీ ధరలు పెంచుతారని స్పష్టం చేశారు. మెట్రోరైలు మార్గాన్ని మనేసర్ వరకు పొడగిస్తున్నామని, ఇందుకోసం సవివర ప్రాజెక్టు నివేదికను తయారు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన విలేకరులతో అన్నారు. 108 కిలోమీటర్ల పొడవైన గుర్గావ్-మనేసర్-బవాల్ రోడ్డు ప్రాజెక్టును జపనీస్ కంపెనీ, ఢిల్లీ-ముంబై పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, హర్యానా మాస్ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సహకారంతో రాబోయే నాలుగేళ్లలో పూర్తి చేస్తామని హూడా ఈ సందర్భంగా ప్రకటించారు. దీనికి రూ.27 వేల కోట్ల వ్యయమవుతుందని, జపాన్ సంస్థ రుణం రూపంలో కొంత మొత్తం ఇస్తుందని తెలిపారు. హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు తమవైపు రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపైనా హూడా స్పందించారు. బీజేపీ నాయకులవన్నీ వ్యర్థ ప్రేలాపనలని ముఖ్యమంత్రి విమర్శించారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోనే ఉంటారని స్పష్టీకరించారు. -
సోనియా ఆశీస్సులున్నంత వరకూ నేనే సీఎం
ఫరీదాబాద్/న్యూఢిల్లీ: హర్యానా ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించాలని కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భూపిందర్ సింగ్ హూడా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ ఎమ్మెల్యేల మద్దతు, ప్రజల విశ్వాసం ఉన్నంత వరకు హర్యానా ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ అధినేత్రిని శనివారం కలుసుకోవడంపై విలేకరులు ప్రశ్నించగా... రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపై మాట్లాడేందుకే కలిసినట్లు వివరించారు. రాష్ట్రంలో సీఎల్పీ, పార్టీ నాయకత్వాలను మార్చే ఉద్దేశం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ శనివారం స్పష్టం చేసిన నేపథ్యంలో హూడా కూడా ఇదే తీరులో స్పందించడం గమనార్హం. ఈ ఏడాది చివర్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. గొగోయ్‌కు పదవీ గండం! అస్సాం సీఎంగా తరుణ్ గొగోయ్‌ను తప్పించాలన్న బలమైన డిమాండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ ఏదో ఒకటి తేల్చనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో గొగోయ్‌ను తప్పించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి హిమంతబిశ్వ శర్మ పార్టీపై ఒత్తిడి పెంచారు. కాంగ్రెస్‌కు సభలో 78 మంది సభ్యుల బలం ఉండగా, అందులో 45 మంది మద్దతు తమకు ఉందని హిమంత వర్గం చెబుతోంది. దీంతో పార్టీ చీలిపోకుండా కాపాడుకునేందుకు కాంగ్రెస్ గొగోయ్‌ను తప్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే గౌహతి పర్యటన తర్వాత ఈ విషయమై స్పష్టత రావచ్చని తెలుస్తోంది. -
మెట్రో రైలు మార్గం మరింత పొడిగింపు
ఢిల్లీ నుంచి ఫరీదాబాద్ వరకు రూ. 2500 కోట్లతో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు మార్గాన్ని వల్లభ్‌గఢ్ వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా తెలిపారు. ఇందుకోసం త్వరలోనే మరో రూ. 468 కోట్లు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ శివార్లలో ఉన్న వల్లభ్‌గఢ్‌లో పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హూడా ఈ విషయం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ఫలాలు సామాన్యులకు అందేందుకు వీలుగా రెండు లక్షల మంది సుశిక్షితులైన కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ ఓ సైన్యాన్ని తయారుచేస్తుందని హూడా చెప్పారు. ప్రతి జిల్లాలోను కార్యకర్తల నమోదు కార్యక్రమం జరుగుతోందని, బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. హర్యానాలో అక్టోబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. -
ముఖ్యమంత్రి హుడా ఇంటి ముందు దళిత మహిళల ఆందోళన
న్యూఢిల్లీ: నలుగురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ వారిపై తగు చర్యలు తీసుకోవాలంటూ హర్యానాలోని దళిత మహిళలు కదం తొక్కారు. మార్చి 23 వ తేదీన అతి పాశవికంగా బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన భాగానా గ్రామంలో కలకలం రేపింది. దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో దళిత మహిళలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆ దారుణానికి పాల్పడిన గ్రామ పెద్దను, అతని కుమారుడుని వెంటనే అరెస్టు చేయాలంటూ ఢిల్లీలోని హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా ఇంటి ముందు ధర్నాకు దిగారు. స్కూళుకు వెళుతున్న నలుగురు దళిత యువతులను అపహరించి ఆపై అత్యాచారం చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా అక్కడ నివాసం ఉంటున్న 400 కుటుంబాలు గ్రామ పెద్దలు అన్యాయంగా ఖాళీ చేయించారంటూ దళిత మహిళలు ఆరోపించారు. ఈ ఘటనలకు సంబంధించి ఒక మెమోరాండంను హుడాకు సమర్పించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆయనకు విజ్క్షప్తి చేశారు. -
మారిన రాజకీయ సమీకరణాలు
న్యూఢిల్లీ: ఆకాశహర్మ్యాలతో కూడిన పట్టణ ప్రాం తాలతోపాటు పాడుబడిన పెంకుటిళ్లు, గుడిసెలు కలిగిన గ్రామీణ ప్రాంతాలున్న గుర్గావ్ నియోజకవర్గంలో ఈసారి లోక్‌సభ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇందుకు కారణం ఇక్కడ నుంచి పోటీపడుతున్న అభ్యర్థులే. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నుంచి యోగేంద్ర యాదవ్‌ను ఎన్నికల బరిలోకి దింపింది. ఆప్ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన ఎన్నికల బరిలో దిగడంతో గుర్గావ్ లోక్‌సభ ఎన్నిక దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. రావ్ ఇంద్రజీత్ సింగ్‌ను తమ పార్టీ అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపింది. ఆయన గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడాతో విభేదాల వల్ల ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. రావ్ ఇంద్రజీత్ సింగ్ పార్టీ మారడం వల్ల గుర్గావ్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ ఇక్కడ నుంచి రావ్ ధర్మపాల్‌ను నిలబెట్టింది. ఐఎన్ఎల్డీ అభ్యర్థిగా పోటీచేస్తున్న జాకీర్ హుస్సేన్ కూడా పార్టీ మారారు. ఆయన బీఎస్పీని వీడి ఐఎన్ఎల్డీలో చేరారు. గత లోక్‌సభ ఎన్నికలలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. రివాడీ రాజకుటుంబానికి చెందిన రావ్ ఇంద్రజీత్ సింగ్ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఆయనకు మహేంద్ర గఢ్, రివాడీ, గుర్గావ్, జజ్జర్, మేవాత్ ప్రాంతాలపై గట్టి పట్టు ఉండేది. సాధారణంగా కాంగ్రెస్‌కే ఓటు వేస్తూ వస్తోన్న ఈ ప్రాంతాల ఓటర్లు ఆయన పార్టీ మారడంతో అయోమయంలో పడ్డారు. సింగ్ కాం గ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో ఇక ముస్లిం ఓట్లపై ఆయన ఆశలు వదులుకోవాల్సిందేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య కూడా ఫలితాలను శాసించే స్థాయిలో ఉండడంతో గెలుపుకోసం సింగ్ చెమటోడ్చక తప్పదని చెబుతున్నారు. దీనిని అవకాశంగా మలచుకునేందుకు యోగేంద్ర యాదవ్ వేగంగా పావులు కదుపుతున్నారు. ముస్లిం ఓటర్లను ఆయన ఆకట్టుకోవడం చాలా తేలికైన అంశమని రాజకీయ పండితులు చెబుతున్నారు. యాదవ్‌ల ఓట్లు కూడా బాగా నే ఉన్నందున వారి ఓట్లను కూడా కొల్లగొట్టడం లో యోగేంద్ర యాదవ్ సఫలీకృతుడవుతాడని జోస్యం చెబుతున్నారు. ఇదే జరిగితే ఆప్ పార్టీ విజయం ఇక్కడ నల్లేరు మీద నడకే. బీజేపీకి ఓటు వేయడానికి వెనుకాడే ముస్లిం ఓటర్లను ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి యోగేంద్ర యాదవ్ ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానిక సర్వేలు చెబుతున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నిజాయితీపరుడైన, చిత్తశుద్ధి కలిగిన నేత అన్న పేరు ఆయనకు ప్లస్ పాయింట్ కానుంది. గుర్గావ్ వంటి అంతర్జాతీయ హంగులున్న ప్రాంతాలతో పాటు నూహ్ వంటి గ్రామీణ ప్రాంతాలున్న ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో కూడా హస్తిమశకాంతరం కనబడుతుంది. గుర్గావ్లోని పట్టణ ప్రాంతాలను పక్కనబెడితే గ్రామీణ ప్రాంతా ప్రజలు కులమత సమీకరణాల ఆధారంగానే ఓట్లు వేస్తారు. ఇక్కడి ఓటర్లలో దళితులు, జాట్లు, వైశ్యులు, గుజ్జర్లు, రాజపుత్రులు, పంజాబీలు, బ్రాహ్మణులు తమ తమ సామాజికవర్గానికి చెందిన నేతలకే ఓట్లు వేసే అవకాశముంది. ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 17, 80,000. -
హర్యానా సీఎంపై షూ విసిరిన అగంతకుడు
చండీఘర్: హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై ఓ వ్యక్తి షూ విసిరిన ఘటన ఆదివారం దబ్వాలీలో చోటుచేసుకుంది. షూ విసిరిన వ్యక్తిని సిర్సా జిల్లాలోని నాథూసరి గ్రామానికి చెందిన రాజారాం అని గుర్తించారు. ఓ వ్యక్తి విసిరిన షూ గురి తప్పి హుడాకు దగ్గర్లో పడినట్టు సమాచారం. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వేదిక దూరంగా తీసుకెళ్లారు. షూ విసిరిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు. ఫిబ్రవరి 2 తేదిన ఓపెన్ టాప్ జీప్ లో ఓ ర్యాలీలో పాల్గొన్న సీఎం హుడాపై కమల్ ముఖిజా అనే ఓ నిరుద్యోగి దాడికి పాల్పడిన మరవకముందే ఈ ఘటన జరగడం సంచలనం రేపింది. అదుపులోకి తీసుకున్న నిరుద్యోగిని డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుసుకుని ఆతర్వాత వదిలివేశారు. -
హర్యానా ముఖ్యమంత్రి హుడాకు చెంపదెబ్బ
-
హర్యానా సీఎం చెంప ఛెళ్లు
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం పానిపట్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీలో భాగంగా నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న ఆయనను ఓ యువకుడు చెంప పగలగొట్టాడు. రోడ్‌షోలో భాగంగా ఓపెన్ టాప్ జిప్సీ ఎస్‌యూవీలో హుడా ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ఒక్క ఉదుటన ఈ వాహనంలోకి ఎక్కిన యువకుడు హుడా చెంపపై చరిచాడు. ఈ పరిణామంతో నిర్ఘాంత పోయిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ‘ఆప్’ ఎమ్మెల్యేకు కూడా ఢిల్లీలోని సంగమ్‌విహార్ నియోజకవర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహనియాకు ఆదివారం ఒక మహిళ చెంప పగలగొట్టింది. నియోజకవర్గంలోని నీటి ఎద్దడి సమస్యను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. అయితే, జరిగిన సంఘటనను నీటి మాఫియా కుట్రగా ఎమ్మెల్యే మోహనియా అభివర్ణించారు. -
హర్యానా ముఖ్యమంత్రి హుడాకు చెంపదెబ్బ
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాకు అనూహ్య, చేదు అనుభవం ఎదురైంది. జెడ్ కేటగిరి భద్రత.. చుట్టూ సాయుధ బలగాలు.. వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు ఇంతమంది ఉన్నా ఓ యువకుడు హుడాపై దాడి చేసి చెంప దెబ్బ కొట్టాడు. రాష్ట్ర పారిశ్రామిక నగరం పానిపట్‌లో ఆదివారం హుడా ఓ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. పానిపట్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో ఏర్పాటు చేశారు. ఓపెన్ టాప్ జీపులో ముందు బాగాన నిల్చున్న హుడా ర్యాలీ వేదిక వద్దకు బయల్దేరుతుండగా దాడి జరిగింది. హర్యానా పోలీసులు వెంటనే హుడా చుట్టూ రక్షణగా నిలిచి అగంతకుడిని దూరంగా లాక్కెల్లారు. కోపోద్రిక్తుడైన ముఖ్యమంత్రి అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. కాగా దాడిని చేసిన వ్యక్తి ఎవరన్నది గుర్తించాల్సివుంది. భారీ భద్రత వలయాన్ని దాటుకుని అగంతకుడు ముఖ్యమంత్రి దాడికి పాల్పడటం భద్రత చర్యల్లోని లోపాల్ని బయటపెట్టాయి. -
టికెటిస్తాం.. హుడాపై పోటీ చేయండి
న్యూఢిల్లీ: రాబర్ట్ వాద్రాపై ఆరోపణలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాకు అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బాసటగా నిలిచింది. ఆయన అద్భుతమైన తెగువ చూపారని ప్రశంసించింది. ‘‘ఇలాంటి పనికిమాలిన రాజకీయ నాయకులకు ఎంతకాలమని సేవ చేస్తారు? పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరండి. మా పార్టీ తరఫున హర్యానా సీఎం భూపీందర్ సింగ్ హుడాపై పోటీ చేయండి’’ అని ఖేమ్కాకు విజ్ఞప్తి చేసింది.