
మాజీ సీఎం భూపీందర్ హుడా
న్యూఢిల్లీ/చండీగఢ్/కురుక్షేత్ర: హరియాణాలోని బీజేపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని మాజీ సీఎం భూపీందర్ హుడా వ్యాఖ్యానించారు. అవినీతి, చేతగాని ప్రభుత్వం గద్దెదిగడం ఖాయ మని స్పష్టం చేశారు.
బీజేపీ ప్రభుత్వం కుంభకోణాలు, తప్పుడు హామీలతో పదేళ్లుగా ప్రజలను దోచుకుందని, అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించనుందని ఆయన ఆరోపించారు. నామినేషన్ వేసిన ప్రముఖులు: కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా కుమారుడు ఆదిత్య సూర్జే వాలా, మాజీ సీఎం బన్సీలాల్ మునిమనవరాలు, బీజేపీకి చెందిన శ్రుతి చౌదరి, కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రీ జిందాల్ గురువారం నామినేషన్లు వేసిన ప్రముఖుల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment