న్యూఢిల్లీ: నలుగురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ వారిపై తగు చర్యలు తీసుకోవాలంటూ హర్యానాలోని దళిత మహిళలు కదం తొక్కారు. మార్చి 23 వ తేదీన అతి పాశవికంగా బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన భాగానా గ్రామంలో కలకలం రేపింది. దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో దళిత మహిళలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆ దారుణానికి పాల్పడిన గ్రామ పెద్దను, అతని కుమారుడుని వెంటనే అరెస్టు చేయాలంటూ ఢిల్లీలోని హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా ఇంటి ముందు ధర్నాకు దిగారు. స్కూళుకు వెళుతున్న నలుగురు దళిత యువతులను అపహరించి ఆపై అత్యాచారం చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా అక్కడ నివాసం ఉంటున్న 400 కుటుంబాలు గ్రామ పెద్దలు అన్యాయంగా ఖాళీ చేయించారంటూ దళిత మహిళలు ఆరోపించారు. ఈ ఘటనలకు సంబంధించి ఒక మెమోరాండంను హుడాకు సమర్పించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆయనకు విజ్క్షప్తి చేశారు.