
రోహ్తక్ : భూ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించి హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా నివాసంపై సీబీఐ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలోని దాదాపు 30కి పైగా ప్రదేశాల్లో సీబీఐ దాడులు చేపట్టింది. 2005లో హర్యానాలోని పంచ్‌కులలో ఏజేఎల్‌కు ప్లాట్‌ను రీ అలాట్ చేయడంపై గత ఏడాది డిసెంబర్‌లో హుడాపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
హుడా హర్యానా సీఎంగా పనిచేసిన సమయంలో పంచ్‌కులలో 14 పారిశ్రామిక ప్లాట్‌లను నామమాత్రపు ధరకు కట్టబెట్టారని ఆయనపై దర్యాప్తు ఏజెన్సీ ఆరోపిస్తోంది. ఇండస్ర్టియల్ ప్లాట్‌ల కేటాయింపునకు చివరి తేదీ 2012 జనవరి 6 కాగా, జనవరి 24న దరఖాస్తు చేసుకున్న 14 మందికి భూమిని కేటాయించారని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. ప్రత్యేక న్యాయస్ధానంలో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ పంచ్‌కులలో సీ-17 ప్లాట్‌ను రీ అలాట్ చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ 67 లక్షల నష్టం వాటిల్లందని ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment