ఢిల్లీ: ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పండింది. ఈ క్రమంలో ఆమెకు దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు అండగా నిలిచారు. ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ వినేశ్ అనర్హత అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని పట్టుపట్టాయి. తాజాగా వినేశ్ ఫోగట్ అనర్హత మాజీ హర్యానా సీఎం భూపేందర్ సింగ్ హూడా స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజ్యసభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం ఉంటే వినేశ్ పేరును ప్రతిపాదించేవాడిని. ఆమె మనందిరికీ చాలా గర్వకారణం’’ అని అన్నారు. మరోవైపు.. భూపేంద్ర సింగ్ హూడా తనయుడు ప్రస్తుత కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ దీపేందర్ హూడా సైతం స్పందిస్తూ.. రాజ్యసభలో ఒక సీట్ ఖాళీ కాబోతోందని, దానికి ఫోగట్‌ను నామినేట్ చేస్తామని అన్నారు. ఆమె ఓడిపోలేదని, మన అందిరి మనసులు గెలిచిందన్నారు.
అయితే కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై వినేశ్ ఫోగట్ పెద్దనాన్న మహవీర్ ఫోగట్ స్పందించారు. వారి మాటలు ఒక పోలిటికల్ స్టంట్ అని అన్నారు. భూపేందర్ సింగ్ హూడా హర్యానా సీఎంగా ఉన్న సమయంలో తన కూతురు గీతా ఫోగట్ సైతం పలు పతకాలు సాధించిందని, కానీ ఆమెను రాజ్యసభకు పంపలేదని అన్నారు. మెజార్టీ ఉంటే వినేశ్‌ను రాజ్యసభకు పంపేవాడినని భూపీందర్ హుడా ఇప్పుడు అంటున్నారు. మరీ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు గీతా ఫోగట్‌ను ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు మాటాలు పొలిటికల్ స్టంట్ మాత్రమేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment