హర్యానా ప్రభుత్వంలో సంక్షోభం | Haryana power minister resigns | Sakshi
Sakshi News home page

హర్యానా ప్రభుత్వంలో సంక్షోభం

Published Tue, Jul 29 2014 3:29 PM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

Haryana power minister resigns

ఛండీగఢ్: హర్యానా ప్రభుత్వంలో సంక్షోభం ముదిరింది. ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాపై విద్యుత్ శాఖ మంత్రి అజయ్‌సింగ్ యాదవ్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపినట్టు అజయ్సింగ్ తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం రెవారీకి ప్రాతనిథ్యం వహిస్తున్నారు.

లోక్సభ ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెల్చామని, ఓటమి పాఠం నేర్చుకోలేదని పరోక్షంగా భూపేందర్ సింగ్ పై మండిపడ్డారు. కొంతమంది పిల్లి మెడలో గంట కట్టాలని ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తన పదవికి రాజీనామా చేశానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement