హర్యానా ప్రభుత్వంలో సంక్షోభం
ఛండీగఢ్: హర్యానా ప్రభుత్వంలో సంక్షోభం ముదిరింది. ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాపై విద్యుత్ శాఖ మంత్రి అజయ్‌సింగ్ యాదవ్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపినట్టు అజయ్‌సింగ్ తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం రెవారీకి ప్రాతనిథ్యం వహిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెల్చామని, ఓటమి పాఠం నేర్చుకోలేదని పరోక్షంగా భూపేందర్ సింగ్ పై మండిపడ్డారు. కొంతమంది పిల్లి మెడలో గంట కట్టాలని ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తన పదవికి రాజీనామా చేశానని తెలిపారు.