హర్యానా సీఎంపై షూ విసిరిన అగంతకుడు
Published Sun, Feb 16 2014 9:02 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
చండీఘర్: హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై ఓ వ్యక్తి షూ విసిరిన ఘటన ఆదివారం దబ్వాలీలో చోటుచేసుకుంది. షూ విసిరిన వ్యక్తిని సిర్సా జిల్లాలోని నాథూసరి గ్రామానికి చెందిన రాజారాం అని గుర్తించారు. ఓ వ్యక్తి విసిరిన షూ గురి తప్పి హుడాకు దగ్గర్లో పడినట్టు సమాచారం. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వేదిక దూరంగా తీసుకెళ్లారు. షూ విసిరిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు.
ఫిబ్రవరి 2 తేదిన ఓపెన్ టాప్ జీప్ లో ఓ ర్యాలీలో పాల్గొన్న సీఎం హుడాపై కమల్ ముఖిజా అనే ఓ నిరుద్యోగి దాడికి పాల్పడిన మరవకముందే ఈ ఘటన జరగడం సంచలనం రేపింది. అదుపులోకి తీసుకున్న నిరుద్యోగిని డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుసుకుని ఆతర్వాత వదిలివేశారు.
Advertisement
Advertisement