
మోదీ.. హర్యానా సీఎం కావాలనుకుంటున్నారా?
హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. కేవలం 90 అసెంబ్లీ స్ధానాలున్న చిన్న రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి స్థాయి వచ్చి ప్రచారం చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఇంత చిన్న రాష్ట్రంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా 11 ర్యాలీలు నిర్వహించారని, ఆయనేమైనా హర్యానాకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా అని హూదా అడిగారు.
ఇలాంటి చిన్న రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రధానమంత్రీ వచ్చిప్రచారం చేయడం తాను చూడలేదన్నారు. ఒకవైపు తన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే.. హూడా మాత్రం తాపీగా ఉదయం బ్యాడ్మింటన్ ఆడుకుని, ఆ తర్వాత టీ తాగుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.