haryana cm
-
ఓంప్రకాశ్ చౌతాలా కన్నుమూత
-
కాంగ్రెస్‌కు మరో షాక్!.. అమిత్ షాను కలిసిన సీనియర్ నేత
హరియాణా కాంగ్రెస్ సీనియర్ నేత కుల్దీప్ బిష్ణోయ్ హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆదివారం కలవడం చర్చనీయాంశమైంది.ఇప్పటికే కుల్దీప్ కమలం పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో నడ్డాతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు కుల్దీప్ బిష్ణోయ్‌ను పార్టీలోని అన్ని పదవుల నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించింది. ఆయన బీజేపీ మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మకు ఓటు వేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మాజీ సీఎం దీపిందర్ సింగ్ హుడా అనుచరుడిని హరియాణా కాంగ్రెస్ చీఫ్‌గా నియమించడంపై బిష్ణోయ్ అధిష్ఠానం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అజయ్ మాకెన్‌కు ఓటు వేయలేదు. తన మనస్సాక్షి చెప్పిన వ్యక్తికే ఓటు వేశానని ఎన్నికల అనంతరం ప్రకటించారు. అంతేకాదు పార్టీ తన ఒక్కడిపైనే చర్యలు తీసుకోవడాన్ని తప్పుబట్టారు. 2016లో కూడా ఇలా జరిగిందని, కానీ పార్టీ అప్పుడు ఇంత వేగంగా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రమే చర్యలకు ఉపక్రమిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు బిష్ణోయ్ తమ పార్టీలో చేరాలనుకుంటే కచ్చితంగా ఆహ్వానిస్తామని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. చదవండి: ఉద్ధవ్‌కు దెబ్బ మీద దెబ్బ .. ప్రశ్నార్థకంగా మారిన శివసేన పార్టీ మనుగడ -
హర్యానా ముఖ్యమంత్రితో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ
Updates: ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం నుంచి తాడేపల్లికి తిరుగు పయనమయ్యారు. ► హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. భేటీ అనంతరం సీఎం వైఎస్ జగన్ వెల్నెస్ రిచాట్స్ నుంచి వైజాగ్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. ► విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తున్నారు. రుషికొండ పెమ వెల్నెస్ రిసార్ట్‌లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం జగన్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ►విశాఖకు సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖ నగర మేయర్ గొలగానీ హరి వెంకట కుమారి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, అదీప్ రాజ్, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, కలెక్టర్ స్వాగతం పలికారు. ►విశాఖ పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎం భేటికానున్నారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 10.25 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11.05 గంటలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.50 గంటలకు రుషికొండ పెమ వెల్నెస్ రిసార్ట్‌కు వెళతారు. అక్కడ హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటల 25 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11గంటల 05 నిమిషాలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడినుంచి 11గంటల 50 నిమిషాలకు రుషికొండ పెమ వెల్నెస్ రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడ హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2:30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. చదవండి: (శ్రీశారదా పీఠాన్ని సందర్శించిన హరియాణా సీఎం) -
శ్రీశారదా పీఠాన్ని సందర్శించిన హరియాణా సీఎం
సాక్షి, విశాఖపట్నం(పెందుర్తి): విశాఖ శ్రీశారదా పీఠాన్ని హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం సందర్శించి రాజశ్యామల అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందారు. స్వామీజీ చేతుల మీదుగా శంకరాచార్య విగ్రహాన్ని అందుకున్నారు. ధర్మ పరిరక్షణ కోసం పీఠం చేస్తోన్న కృషిని సీఎంకు స్వరూపానందేంద్ర వివరించారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే హరియాణాలో కూడా శ్రీశారదాపీఠం ఆశ్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖట్టర్ మాట్లాడుతూ..రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం హరియాణా ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. అంతకుముందు సీఎంకు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వాగతం పలికారు. కాగా, ఆదివారం సాయంత్రం సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని ఖట్టర్ సందర్శించారు. చదవండి: (AP: వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ల వేతనాలు పెంపు) -
డేరా అల్లర్లపై హర్యానా సీఎం ఏమన్నారంటే...
సాక్షి, చండీగర్: డేరా సచ్చా సౌథా చీఫ్ గుర్మీత్ సింగ్ కు శిక్ష ఖరారు సందర్భంగా ఆయన అనుచరులు రెచ్చిపోయి హింసకు దిగిన క్రమంలో హర్యానా సర్కార్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే తాము సకాలంలో స్పందించకుంటే పరిస్థితి మరింత దిగజారేదని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అంటున్నారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, తాము అప్రమత్తం కాకుంటే అల్లర్లు మరింతగా పెచ్చరిల్లేవని అన్నారు. రేప్ కేసులకు సంబంధించి డేరా బాబాను దోషిగా నిర్ధారించడంతో హర్యానా, పంజాబ్‌లో చెలరేగిన అల్లర్లలో 35 మంది మరణించిన విషయం విదితమే. డేరా బాబా అనుచరులు పెద్దసంఖ్యలో గుమికూడటం పట్ల హర్యానా సర్కార్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. కోర్టు ఉత్తర్వులపై ముందే సమాచారం ఉన్నా సరిగ్గా వ్యవహరించలేదనే వ్యాఖ్యలూ వినిపించాయి.అయితే అల్లర్ల నేపథ్యంలో తమ ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించి పరిస్థితి చక్కదిద్దిందని ఖట్టర్ సమర్ధించుకున్నారు. -
హరియాణా సీఎంపై కేసు నమోదు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: హరియాణా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై సీబీఐ కేసు నమోదు చేసింది. హరియాణా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (హుడా) చైర్మన్ గా ఉన్న సమయంలో పాంచ్ కులాలో అక్రమాలకు పాల్పడినట్టు ఆయనపై కేసు నమోదైంది. విజిలెన్ప్ బ్యూరో నుంచి కేసును సీబీఐ స్వీకరించింది. సీఎం, ముగ్గురు మాజీ ఉన్నతాధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ చేపట్టనున్నట్టు సీబీఐ పేర్కొంది. సీబీఐ ఇప్పటి వరకు 16 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. దరఖాస్తు చివరి తేదీ ముగిసిన తర్వాత 14 మందికి పారిశ్రామిక వాడలో నిబంధనలకు విరుద్ధంగా స్థలాలను కేటాయించారని ఎఫ్ఐఆర్ లో అభియోగాలు నమోదు చేసింది. అయితే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసును నమోదు చేశారని, రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని హుడా ఆరోపించారు. అధికారంలోకొచ్చి రెండేళ్లవుతున్నా ఒక్క హామీని నెరవేర్చని కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. -
'జాట్లు పెద్ద వ్యూహమే పన్నారు'
ఝాజర్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాట్ల ఉద్యమం పేరుకే రిజర్వేషన్ల డిమాండ్ ఉద్యమం అని దాని వెనుక భారీ వ్యూహం ఉందని తెలుస్తోంది. తమ జాతికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించాలనేది వారి తదుపరి డిమాండ్ అని, దానికి ముందస్తు కసరత్తుగానే ఈ ఉద్యమం చేస్తున్నారని తెలిసింది. ఝాజర్ టౌన్లో ఆందోళనలు చేస్తున్న జాట్లు 'రావ్ తులా రామ్' విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఆ గొడవ కాస్త జాట్ వర్సెస్ జాట్ లేతరుల మధ్యకు మళ్లింది. ఎందుకంటే రామ్ తులా రామ్ యాదవులకు చెందిన శక్తిమంతమైన తిరుగులేని నేత. పైగా యాదవులను అక్కడ ఓబీసీలుగా గుర్తించారు. ఇలా చేయడం జాట్ లకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ముందు రిజర్వేషన్ల పేరుతో ఉద్యమాన్ని లేవదీసి.. తర్వాత ముఖ్యమంత్రి స్థానం కోసం మరోసారి రోడ్లెక్కాలన్నది వారి అసలైన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే అంశాన్ని కొందరు యాదవులు స్వయంగా చర్చించుకుంటున్నారు. జాట్ ల వ్యూహాన్ని వారు పసిగట్టారు. ఒక వేళ నిజంగా అదే అంశం తెరపైకి వస్తే ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో ఎదురుచూడాల్సిందే. -
చెప్పేందుకే నీతులు...కొనేది లగ్జరీ కార్లు
చండీగఢ్: గత జూలై నెలలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో నగరంలో పర్యటించి పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కడమే కాకుండా ‘నిరాడంబరుడు’గాప్రజల నుంచి నీరాజనాలు అందుకున్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పేటందుకే నీతులని నిరూపించుకున్నారు. తాను నిరాడంబర జీవితాన్నే కోరుకుంటున్నానని, ప్రజలందరు కూడా అలా ఉండేందుకే ప్రయత్నించాలని ఉద్బోధించిన ఆయన నేడు తన మంత్రివర్గ సహచరుల కోసం ఖరీదైన లగ్జరీ కార్లను కొన్నారు. దాదాపు రెండు కోట్ల రూపాయలను వెచ్చించి నాలుగు టయోట ఫార్చున్ కార్లను, నాలుగు హోండా సీవీఆర్ కార్లను కొనుగోలు చేశారు. 24 లక్షల రూపాయల చొప్పున ఫార్చునర్ కార్లను, 23.7 లక్షల చొప్పున హోండా సీవీర్ కార్లను కొనుగోలు చేశారు. మిగతా మంత్రులందరికి కూడా త్వరలో లగ్జరీ కార్లను కొంటానని కూడా ప్రకటించారు. ఆయన మంత్రి వర్గంలో మొత్తం 17 మంది ఉన్నారు. ఎనిమిది కార్లను కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి ఖట్టర్ బుధవారం నాడు స్వయంగా ధ్రువీకరించారు. పాతపడిన కార్ల స్థానంలోనే కొత్త కార్లను కొన్నామని కూడా సమర్థించుకున్నారు. 2012లోనే మంత్రుల కోసం అప్పటి భూపేందర్ సింగ్ హూడా 3.2 కోట్ల రూపాయలను వెచ్చించి హోండా సీఆర్వీ కార్లను కొన్నారు. ఆ కార్లు మూడేళ్లకే ఎలా పాతపడతాయని ప్రతిపక్ష కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. అధికారులు ఎక్కడ అలుగుతారనుకున్నారేమో వారికి హోండా సిటీ కార్లను కొనేందుకు వీలుగా నిధులు మంజూరు చేశారు. ఇది ఖట్టర్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం కాదా? -
హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
చండీగఢ్: ఇప్పటికే రగిలిపోతోన్న గోమాంసం వివాదానికి మరింత ఆజ్యంపోస్తూ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 21తో ఏడాది పాలనను పూర్తిచేసుకోనున్న సందర్భంగా గురువారం ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖట్టార్.. గోమాంసం, దాద్రి ఘటన సహా పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. 'భారత్ లోనే ముస్లింలు జీవనాన్ని కొనసాగించవచ్చు. కానీ ఇక్కడుండాలంటే వారు కచ్చితంగా గోమాంస భక్షణ వదులుకోవాల్సిందే. ఎందుకంటే గోవులు అత్యంత పవిత్రమైనవి. గోమాత, భగవద్గీత, సరస్వతీదేవీలను హిందువులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆవు మాంసం తింటూ ముస్లింలు హిందువుల పవిత్రభావజాలాన్ని అవమానిస్తున్నారు' అంటూ గోమాంస భక్షకులపై ఖట్టార్ విరుచుకుపడ్డారు. ఇంకా.. 'మనది ప్రజాస్వామ్యదేశం. ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. కానీ దానికీ ఓ హద్దు ఉంటుంది. ఇతరుల భావాలను భంగం కల్గించనంతవరకే స్వేచ్ఛకు పరిమితి ఉంటుంది' అని అన్నారు. దాద్రి ఘటన అపర్థాల వల్లే సంభవిందని, ఇరు పక్షాలూ పొరపాటు చేశాయని ఖట్టార్ పేర్కొన్నారు. 'నిజానికి ఆ ఘటన జరగకుండా ఉండాల్సింది. అయితే ఈ ఘటనలో బాధిత వ్యక్తి(ఇఖ్లాక్) గోమాతను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అతని మాటలు వైరిపక్షాన్ని మరింత రెచ్చగొట్టాయి. అందుకే బీభత్సకాండ చోటుచేసుకుంది. అయినాసరే, ఒక వ్యక్తిని కొట్టి చంపడం ముమ్మాటికీ తప్పే' అని ఖట్టార్ వివరించారు. కాగా, ఖట్టార్ వ్యాఖ్యలపై పలు పార్టీల్లోని ముస్లిం నాయకులు సహా లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి నేతలూ భగ్గుమన్నారు. ఏడాది కాలంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు తరచూ వినిపిస్తున్నాయని, అలాంటి వారిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని లాలూ డిమాండ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టార్ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని ఓఎస్డీ జవహర్ యాదవ్ వివరణ ఇచ్చారు. 'ఒకరినొకరు గౌరవించుకోవాలి' అనే ఖట్టార్ మాటలను సదరు దినపత్రిక ఉద్దేశపూర్వకంగా వక్రీకరించిందని ఆయన ఆరోపించారు. హిందూత్వ సంస్థ ఆర్ఎస్ఎస్ లో కీలక నేత అయిన మనోహర్ ఖట్టార్.. గత ఏడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసి ఆ పార్టీకి విజయంసాధించిపెట్టడంతోపాటు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అధికారం చేపట్టగానే 'ది హర్యానా గోవంశ్ సంరక్షణ', 'గావ్ సంవిధా' తదితర చట్టాలను రూపొందించి హర్యానాలో గోవధను నిషేధించారు. ఆ చట్టాల ప్రకారం ఆవును చంపిన వారికి 10ఏళ్లు, ఆవు మాంసం తిన్నవారికి 5ఏళ్లు శిక్షపడే వీలుంటుంది. -
హరియాణా సీఎం కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి
చండీగఢ్: హరియాణా సీఎం మనోహర్ ఖట్టర్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఖట్టర్ చండీగఢ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం తరౌరి వద్ద రోడ్డు దాటుతున్న ఓ పాదచారిని ఢీకొంది. వెంటనే ఖట్టర్ బాధితుడిని కాన్వాయ్‌లోని మరో వాహనంలో ఆసుపత్రికి తరలించినప్పటికీ అతడు మృతి చెందాడు. అయితే ఇదే సమయంలో కాన్వాయ్‌తోనే ఉన్న అంబులెన్స్, డాక్టర్ సేవలను బాధితుడి కోసం వినియోగించకపోవడం గమనార్హం. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులూ గాయపడ్డారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. -
హర్యానా ముఖ్యమంత్రిగా ఖట్టర్ ప్రమాణ స్వీకారం
చంఢీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్ ఖట్టర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానాలోని పంచ్కులలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఖట్టర్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, అద్వానీతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్ నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 1966లో హర్యానా రాష్ట్రం ఏర్పాటైంది. ఆ తర్వాత మనోహర్‌లాల్ ఖట్టర్ ఆ రాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హర్యానా అసెంబ్లీకి మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 15న ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 47 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. దీంతో ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ఎంపిక చేసింది. -
మోదీ.. హర్యానా సీఎం కావాలనుకుంటున్నారా?
హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. కేవలం 90 అసెంబ్లీ స్ధానాలున్న చిన్న రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి స్థాయి వచ్చి ప్రచారం చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఇంత చిన్న రాష్ట్రంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా 11 ర్యాలీలు నిర్వహించారని, ఆయనేమైనా హర్యానాకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా అని హూదా అడిగారు. ఇలాంటి చిన్న రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రధానమంత్రీ వచ్చిప్రచారం చేయడం తాను చూడలేదన్నారు. ఒకవైపు తన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే.. హూడా మాత్రం తాపీగా ఉదయం బ్యాడ్మింటన్ ఆడుకుని, ఆ తర్వాత టీ తాగుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.