
Updates:
► ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం నుంచి తాడేపల్లికి తిరుగు పయనమయ్యారు.
► హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. భేటీ అనంతరం సీఎం వైఎస్ జగన్ వెల్‌నెస్ రిచాట్స్ నుంచి వైజాగ్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు.
► విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. రుషికొండ పెమ వెల్‌నెస్ రిసార్ట్‌లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం జగన్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
►విశాఖకు సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖ నగర మేయర్ గొలగానీ హరి వెంకట కుమారి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, అదీప్ రాజ్, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, కలెక‍్టర్ స్వాగతం పలికారు.
►విశాఖ పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయలుదేరారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎం భేటికానున్నారు.
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 10.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 11.05 గంటలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.50 గంటలకు రుషికొండ పెమ వెల్‌నెస్ రిసార్ట్‌కు వెళతారు. అక్కడ హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.