చండీగఢ్: హరియాణా సీఎం మనోహర్ ఖట్టర్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఖట్టర్ చండీగఢ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం తరౌరి వద్ద రోడ్డు దాటుతున్న ఓ పాదచారిని ఢీకొంది. వెంటనే ఖట్టర్ బాధితుడిని కాన్వాయ్‌లోని మరో వాహనంలో ఆసుపత్రికి తరలించినప్పటికీ అతడు మృతి చెందాడు. అయితే ఇదే సమయంలో కాన్వాయ్‌తోనే ఉన్న అంబులెన్స్, డాక్టర్ సేవలను బాధితుడి కోసం వినియోగించకపోవడం గమనార్హం. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులూ గాయపడ్డారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.
హరియాణా సీఎం కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి
Published Wed, Mar 4 2015 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM
Advertisement
Advertisement