డేరా అల్లర్లపై హర్యానా సీఎం ఏమన్నారంటే...
Published Sun, Sep 3 2017 8:21 PM | Last Updated on Tue, Sep 12 2017 1:46 AM
సాక్షి, చండీగర్: డేరా సచ్చా సౌథా చీఫ్ గుర్మీత్ సింగ్ కు శిక్ష ఖరారు సందర్భంగా ఆయన అనుచరులు రెచ్చిపోయి హింసకు దిగిన క్రమంలో హర్యానా సర్కార్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే తాము సకాలంలో స్పందించకుంటే పరిస్థితి మరింత దిగజారేదని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అంటున్నారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, తాము అప్రమత్తం కాకుంటే అల్లర్లు మరింతగా పెచ్చరిల్లేవని అన్నారు. రేప్ కేసులకు సంబంధించి డేరా బాబాను దోషిగా నిర్ధారించడంతో హర్యానా, పంజాబ్‌లో చెలరేగిన అల్లర్లలో 35 మంది మరణించిన విషయం విదితమే.
డేరా బాబా అనుచరులు పెద్దసంఖ్యలో గుమికూడటం పట్ల హర్యానా సర్కార్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. కోర్టు ఉత్తర్వులపై ముందే సమాచారం ఉన్నా సరిగ్గా వ్యవహరించలేదనే వ్యాఖ్యలూ వినిపించాయి.అయితే అల్లర్ల నేపథ్యంలో తమ ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించి పరిస్థితి చక్కదిద్దిందని ఖట్టర్ సమర్ధించుకున్నారు.
Advertisement