ఢిల్లీ నుంచి ఫరీదాబాద్ వరకు రూ. 2500 కోట్లతో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు మార్గాన్ని వల్లభ్గఢ్ వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా తెలిపారు. ఇందుకోసం త్వరలోనే మరో రూ. 468 కోట్లు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ శివార్లలో ఉన్న వల్లభ్గఢ్లో పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హూడా ఈ విషయం తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ఫలాలు సామాన్యులకు అందేందుకు వీలుగా రెండు లక్షల మంది సుశిక్షితులైన కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ ఓ సైన్యాన్ని తయారుచేస్తుందని హూడా చెప్పారు. ప్రతి జిల్లాలోను కార్యకర్తల నమోదు కార్యక్రమం జరుగుతోందని, బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. హర్యానాలో అక్టోబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
మెట్రో రైలు మార్గం మరింత పొడిగింపు
Published Thu, Jun 19 2014 9:51 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement