extention
-
‘జగనన్నే మా భవిష్యత్తు’ పొడిగింపు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఓ యజ్ఞంలా కొనసాగుతున్న ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని.. పొడిగించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకుంది. ప్రజల నుంచి దక్కుతున్న విశేష స్పందనతో కార్యక్రమానికి ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఈనెల 20తోనే ముగించాలనుకుంది. అయితే.. ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. దీంతో.. షెడ్యూల్‌ను మరో తొమ్మిది రోజులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం మొదలైంది. అప్పటి నుంచి ప్రజలు భాగస్వామ్యం అవుతున్న తీరు సర్వత్రా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు 84 లక్షల కుటుంబాల సర్వే పూర్తి అయ్యింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మద్దతుగా 63 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఇదీ చదవండి: ‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’ -
AP: ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రీఎంబర్స్మెంట్ గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకం గడువును 2022 ఆగస్టు 1వ తేదీ నుంచి 2023 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి ఎంటి క్రిష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పలు ఉద్యోగ సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తుల్ని పరిశీలించిన అనంతరం మరికొంత కాలం పాటు దీన్ని పొడిగిస్తున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్ఎస్)తో పాటు మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీంను కూడా వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఇహెచ్ఎస్ పథకాన్ని సులభతరం చేసేందుకు అనువైన విధానాల్ని అందుబాటులోకి తేవాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఒకు సూచించారు. ఇందుకు సంబంధించి ఆరోగ్య శ్రీ సీఈవో అవసరమైన చర్యల్ని తీసుకోవడంతో పాటు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎటువంటి సమస్యలకు గురికాకుండా ఉండేందుకు గాను తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఆర్థిక శాఖ సమ్మతి మేరకే ఈ ఉత్తర్వుల్ని జారీ చేశామని కృష్ణ బాబు స్పష్టం చేశారు. చదవండి: AP: ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రీఎంబర్స్మెంట్ గడువు పొడిగింపు -
అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు
-
తెలంగాణ సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగింపు
-
పన్ను చెల్లింపు దారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఆదాయ పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు మరో ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ గడువును పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైలింగుల గడువును ఈ ఏడాది నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ శనివారం ప్రకటించింది. ప్రస్తుత కష్టసమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐటీ శాఖ ట్వీట్ చేసింది. ఇది పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు సహాయపడుతుందని పేర్కొంది. Understanding & keeping in mind the times that we are in, we have further extended deadlines. Now, filing of ITR for FY 2019-20 is extended to 30th Nov, 2020. We do hope this helps you plan things better.#ITDateExtension#FacilitationDuringCovid#WeCare #IndiaFightsCorona pic.twitter.com/ZoGBpok3V7 — Income Tax India (@IncomeTaxIndia) July 4, 2020 -
ఎంసెట్ 15 రోజులు వాయిదా
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్ తదితర సెట్లను 15 రోజుల పాటు వాయిదా వేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈసెట్‌ను మే 2న నిర్వహించాల్సి ఉంది. అలాగే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 4, 5, 7, 9, 11 తేదీల్లో ఎంసెట్ నిర్వహించాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్‌ను ముందుగా ఈనెల 14వ తేదీ వరకు ప్రకటించిన నేపథ్యంలో అన్ని ప్రవేశ పరీక్షల (సెట్స్) దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 20వ తేదీ వరకు ఉన్నత విద్యామండలి పొడిగించింది. అయితే శనివారం లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తామని పాపిరెడ్డి తెలిపారు. దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడతాయని పేర్కొన్నారు. అయితే ఈ వాయిదా ప్రభావం విద్యా సంవత్సరంపై లేకుండా అన్ని చర్యలు చేపడతామని, ఇబ్బందేమీ ఉండదని వెల్లడించారు. వివిధ సెట్లలో ముందుగా నిర్వహించాల్సిన ఈసెట్, ఎంసెట్ వాయిదా పడనుండగా, ఆ తర్వాత మే 13 నుంచి నిర్వహించాల్సిన పీఈసెట్, 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన ఐసెట్, 23న నిర్వహించాల్సిన ఎడ్‌సెట్, 27న నిర్వహించాల్సిన లాసెట్, 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించాల్సిన పీజీఈసెట్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. -
లాక్డౌన్ కొనసాగింపు?
న్యూఢిల్లీ: ఏప్రిల్ 14 తరువాత కూడా కొంతకాలం లాక్‌డౌన్‌ను కొనసాగించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కరోనాను పూర్తిగా కట్టడి చేసేందుకు అదొక్కటే మార్గమని తెలంగాణ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో.. కేంద్రం ఆ దిశగా సమాలోచనలు చేస్తోందని తెలిపాయి. అయితే, లాక్డౌన్ కొనసాగింపునకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మంగళవారం స్పష్టం చేశారు. ఈ విషయంలో ఊహాగానాలు చేయొద్దని సూచించారు. మరోవైపు, అన్ని విద్యాసంస్థల మూసివేతతో పాటు, ప్రార్థన స్థలాల్లో ప్రజలు సామూహికంగా పాల్గొనే మత కార్యక్రమాలపై విధించిన ఆంక్షలు మే 15 వరకు కొనసాగాలని దేశవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) మంగళవారం సిఫారసు చేసింది. ఏప్రిల్ 14 తరువాత లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా లేక కొనసాగించినా ఈ నిర్ణయాలను అమలు చేయాలని సూచించింది. ప్రస్తుత లాక్డౌన్ గడువు ముగిసే ఏప్రిల్ 14 తరువాత నెలకొనే పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ఆ జీఓఎం చర్చించింది. హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పియూష్ గోయల్, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితర మంత్రులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, మతపరమైన కేంద్రాల్లో ఏప్రిల్ 14 తరువాత కనీసం నెల రోజుల పాటు సాధారణ కార్యకలాపాలను ఎట్లిపరిస్థితుల్లో అనుమతించకూడదని జీఓఎం సిఫారసు చేసింది. మత ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ తదితర బహిరంగ ప్రదేశాలపై డ్రోన్లతో సునిశిత పర్యవేక్షణ పెట్టాలని సూచించింది. ఎలాగూ వేసవి సెలవులు ఉంటాయి కనుక జూన్ చివరి వరకు విద్యా సంస్థలను మూసేయడమే సరైన నిర్ణయమని ప్రభుత్వం భావిస్తోంది. కరోనాపై తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్రాలు ఇచ్చే సమాచారమే కీలకమని జీఓఎం పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. నిత్యావసర వస్తువుల సరఫరాపై కూడా భేటీలో చర్చించారని, దేశంలో ఎక్కడా వాటి రవాణాకు అడ్డంకులు ఏర్పడలేదని సంబంధిత మంత్రి వివరించారని అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితిపై లోతైన చర్చ జరిపామని జీఓఎం భేటీ అనంతరం రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. 40 కోట్ల మంది మరింత పేదరికంలోకి.. కరోనా వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో మార్చ్ 25 నుంచి లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా సంక్షోభం కారణంగా భారత్‌లో 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు మరింత పేదరికంలోకి వెళ్లే ప్రమాదముం దని అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది. మరోవైపు, ఆల్కహాల్ ఉత్పత్తులను అమ్మేందుకు అనుమతించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) తెలంగాణ, కర్నాటక, రాజస్తాన్, హరియాణా, మహారాష్ట్ర, యూపీ సహా 10 రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. -
చప్పట్లు కొట్టారు.. దీపాలు వెలిగించారు.. లాక్డౌన్ మరిచారు
సాక్షి, హైదరాబాద్: రెండు వారాల క్రితం జనతాకర్ఫ్యూ, రెండు రోజుల క్రితం ఐక్యతకు నిదర్శనంగా దీపాలు వెలిగించాలన్న ప్రధాని పిలుపునకు ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. చప్పట్లు చరచడం, దీపాలు వెలిగించడంలో చొరవ చూపిన జనం లాక్‌డౌన్‌ను అమలు చేసే విషయంలో మాత్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 75 శాతం ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పాలు, కూరలు లాంటి అత్యవసరాలు కొనేందుకు రోడ్డెక్కి ఆ తర్వాత ఇళ్లకే పరిమితమవుతున్నారు. కానీ మరో 25 శాతం మంది లాక్‌డౌన్‌ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అవసరం ఉన్నా లేకున్నా అదేపనిగా రోడ్డెక్కుతున్నారు. కనిపించిన పరిచయస్తులతో కబుర్లు చెబుతూ అకారణంగా జనసమూహాలకు కారణమవుతున్నారు. లాక్‌డౌన్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మర్కజ్ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత ఒక్కసారిగా వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో పరిస్థితి చేయిదాటకుండా లాక్‌డౌన్‌ను అత్యంత పకడ్బందీగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఏప్రిల్ 14తో లాక్డౌన్ గడువు పూర్తవుతున్నందున, దాన్ని మరికొన్ని వారాలు కొనసాగించాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీని కోరారు. అభివృద్ధి చెందుతున్న స్థితిలో ఉన్న మనదేశానికి కరోనాను నియంత్రించాలంటే లాక్డౌన్ తప్ప మరో గత్యంతరం లేదని సీఎం స్పష్టంగా చెబుతోన్న సమయంలో, బాధ్యత లేని కొంతమంది లాక్‌డౌన్‌ను బేఖాతరు చేస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల నిర్లక్ష్యం వల్ల పెను విపత్తుకు అవకాశం కలిగే ప్రమాదం ఉంటుందన్న హెచ్చరికలను వీరే మాత్రం పట్టించుకోవటం లేదు. లాక్డౌన్ విధించిన తొలిరోజు జనం ఇలాగే రోడ్లపైకి వచ్చారు. దేశవ్యాప్తంగా ఇలాంటి దృశ్యాలే కనిపించడంతో అప్పట్లో ప్రధాని మోదీ తీవ్రంగా పరిగణించి అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. వెంటనే మన పోలీసు శాఖ స్పందించి కట్టడి చేసింది. దీంతో కొన్ని రోజుల పాటు పరిస్థితి అదుపులో ఉంది. కానీ మళ్లీ కొన్ని ప్రాంతాల్లో అదుపు తప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో క్రమంగా పరిస్థితి మెరుగవుతోన్న తరుణంలో హైదరాబాద్‌లోని యావత్తు పాతనగరం సహా యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, చింతల్ బస్తీ, ముషీరాబాద్, జమిస్తాన్పూర్, మెహిదీపట్నం, నార్సింగి... ఇలా పలు ప్రాంతాల్లో జనం విచ్చలవిడిగా లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ విషయంలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల సూచనలు.. ♦ కూరగాయలు అమ్మేవారిపై ఆంక్షలు లేవు. ఫలితంగా సాధారణ రోజుల కంటే ఎక్కువ మంది విక్రేతలు కాలనీలు, మార్కెట్ల లో కూరగాయలు అమ్ముతున్నారు. కాలనీల్లో కూరలమ్మే వారి మధ్య కనీస దూరం ఉండేలా చూడాలి. ప్రజలు కూడా వందల సంఖ్యలో మార్కెట్లకు చేరుతున్నారు. అలా రాకుండా చర్యలు తీసుకోవాలి. మార్కెట్లకు సాధారణ ప్రజలను అనుమతించొద్దు. ♦ లాక్డౌన్ అమలులోకి రాగానే పోలీసు సిబ్బంది దుకాణాల వద్ద మీటరు దూరం చొప్పున నేలపై వృత్తాకారంలో గీతలు గీయించారు. ఒక్కో కొనుగోలుదారు ఆ వృత్తంలో ఉంటూ ముందుకు సాగి వస్తువులు కొనాలి. కానీ అది ఇప్పుడు అమలవ్వడం లేదు. జనం ఆ వృత్తాల్లోనే ఉండేలా చూసే బాధ్యతను దుకాణదారులకే అప్పగించాలి. ఎక్కడైనా గుంపుగా ఉంటే దుకాణదారులపై చర్యలు తీసుకోవాలి. ♦ మైకుల ద్వారా పోలీసులు హెచ్చరిస్తూ పహారాగా తిరుగుతుంటే జనంలో మార్పు వస్తుంది. అవసరమైతే గుంపులుగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి. చాలాచోట్ల యువకులు రోడ్లపై అనవసరంగా తిరుగుతున్నారు. అలాంటి వారి వాహనాలను జప్తు చేయాలి. అవసరమైతే లైసెన్సు కూడా రద్దు చేయాలి. ♦ దుకాణాలు తెరిచి ఉన్నంత సేపు జన సంచారం ఉంటోంది. అందుకే దుకాణాలను సాయంత్రం 6 వరకు కాకుండా మధ్యాహ్నమే మూతపడేలా చూడాలి. మందుల షాపులు మాత్రమే ఉండేలా చూడాలి. ♦ చాలా చోట్ల కేఫ్‌ల షట్టర్లు మూసి లోపల టీ తయారు చేసి ఫ్లాస్కోల ద్వారా బయట అమ్ముతున్నారు. పాన్షాపులదీ ఇదే తీరు. ఇలా అక్రమంగా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటే అవి మూతపడతాయి. ఇది హైదరాబాద్ పాత నగరంలోని జహనుమా రోడ్డుపై సోమవారం ఉన్న పరిస్థితి. లాక్డౌన్ అమలవుతోన్న తరుణంలో జనం ఇలా బాధ్యతారహితంగా రోడ్డెక్కారు. కరోనా బాధితుల సంఖ్య పాత నగరంలో పెరుగుతోన్న తరుణంలో అక్కడ మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉండగా, లాక్డౌన్ ఇలా అపహాస్యం పాలవుతోంది. -
జీఎస్టీ రిటర్న్స్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: జీఎస్టీఆర్–1 తుది సేల్స్ రిటర్న్స్‌ను దాఖలు చేసేందుకు గడువును కేంద్ర ప్రభుత్వం పది రోజులు పొడిగించింది. జనవరి 10 దాకా దీన్ని పొడిగించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రూ.1.5 కోట్ల దాకా టర్నోవరున్న వ్యాపార సంస్థలు జూలై–సెప్టెంబర్ కాలానికి సంబంధించిన జీఎస్టీఆర్–1ను జనవరి 10లోగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ గడువు డిసెంబర్ 31. ఇక రూ. 1.5 కోటి పైబడిన టర్నోవర్ గల సంస్థలు కూడా జూలై–నవంబర్ కాలానికి సంబంధించి జనవరి 10లోగా ఫైల్ చేయాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం జూలై–అక్టోబర్ మధ్య వ్యవధి జీఎస్టీఆర్–1ను డిసెంబర్ 31లోగా, నవంబర్‌కు సంబంధించిన దాన్ని జనవరి 10లోగా, డిసెంబర్ది ఫిబ్రవరి 10లోగా సమర్పించాల్సి ఉంది. -
వడివడిగా అడుగులు
- రాజమహేంద్రవరంలో డ్రైనేజీలు, జంక్షన్ల విస్తరణ - ముంపు, ట్రాఫిక్ సమస్యలకు చెక్ - దశాబ్దాల సమస్యలకు పరిష్కారం - స్థలాలు కోల్పోతున్నవారికి టీడీఆర్ బాండ్లు - విక్రయించే అవకాశం ఉండడంతో అంగీకరిస్తున్న స్థల యజమానులు సాక్షి, రాజమహేంద్రవరం : సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం రూపురేఖలు మారనున్నాయి. దశాబ్దాల నుంచి ఉన్న డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై నగరపాలక సంస్థ యంత్రాంగం దృష్టి పెట్టింది. పెరిగిన అవసరాలకు అనుగుణంగా బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజీలు, జంక్షన్లను విస్తరించే పనిని ఆరంభించింది. ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య రాజధానిగా భాసిల్లుతున్న రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. పెరిగిన నగర పరిధికి అనుగుణంగా రోడ్లను విస్తరించలేదు. పలు కారణాలవల్ల 1975 మాస్టర్‌ప్లాన్ పూర్తిస్థాయిలో అమలు జరగలేదు. వై జంక్షన్ నుంచి లాలాచెరువు వరకూ ఉన్న గ్రాండ్ ట్రంక్ రోడ్డు (జీఎన్టీ) రోడ్డు తప్ప నగరంలో మరే రోడ్డు 100 అడుగులు లేదు. అలాగే నగరంలోని అనేక జంక్షన్లు ఇరుకుగా ఉన్నాయి. దీనికితోడు ఆక్రమణల వల్ల ఆయా జంక్షన్లలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కంబాలచెరువు, తాడితోట, దేవీచౌక్, ఏవీ అప్పారావు రోడ్డు, జాంపేట, శ్యామలా సెంటర్, షెల్టాన్ హోటల్, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర జంక్షన్లలో వాహనాల రద్దీ తీవ్రంగా ఉంటోంది. సిగ్నల్ వ్యవస్థ కూడా సరిగా పని చేయకపోవడంతో తరచూ ఆయా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోంది. జంక్షన్లు, డ్రైనేజీలను విస్తరించాలన్న ప్రతిపాదనలు చాలా కాలం నుంచి ఉన్నా అవి ఆచరణలోకి రాలేదు. 2015 పుష్కరాలకు ఈ పనులు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ భావించినా సాధ్యపడలేదు. తాజాగా 2031 నాటికి నగర అభివృద్ధిని ఊహిస్తూ రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌కు నగరపాలక సంస్థ ఆమోద ముద్ర వేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ కావడమే ఇక మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన డ్రైనేజీలు, జంక్షన్లను విస్తరించే పనిలో నగరపాలక సంస్థ యంత్రాంగం నిమగ్నమై ఉంది. తాడితోట జంక్షన్ నుంచే ఆరంభం నగరంలో జంక్షన్లు విస్తరించే పనిని నగరపాలక సంస్థ యంత్రాంగం తాడితోట నుంచి ప్రారంభించింది. ప్రస్తుతం ఇక్కడ రోడ్డు వెడల్పు దాదాపు 45 నుంచి 50 అడుగులు ఉంది. పాత మాస్టర్‌ప్లాన్ (1975) ప్రకారం ఈ రోడ్డును 80 అడుగులకు విస్తరించాల్సి ఉన్నా జరగలేదు. రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి నుంచి మోరంపూడి వెళ్లే వైపు దుకాణాలను అధికారులు తొలగిస్తున్నారు. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ అధారంగా ఇరువైపులా 40 అడుగుల చొప్పన 80 అడుగుల మేర రోడ్డు ఉండేలా భననాలను తొలగించాలని నిర్ణయించి అమలు చేస్తున్నారు. స్థలాలను కోల్పోతున్నవారికి నష్టపరిహారంగా ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్(టీడీఆర్) బాండ్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురికి వారు కోల్పోతున్న స్థలానికి అనుగుణంగా బాండ్లు పంపిణీ చేశారు. డ్రైనేజీ విస్తరణ షురూ బ్రిటిషు కాలం నాటి డ్రైనేజీ వల్ల వర్షాకాలంలో తరచూ నగరం ముంపునకు గురవుతోంది. జంక్షన్ల వద్ద ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. చిన్నపాటి వర్షం కురిసినా శ్యామలా సెంటర్, తాడితోట సెంటర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు మోకాలు లోతు నీళ్లలో మునిగిపోతాయి. వర్షపు నీరు వేగంగా వెళ్లేందుకు అనువైన వెడల్పుతో డ్రైనేజీలు లేకపోవడమే సమస్యకు అసలు కారణం. ఈ నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చే చర్యలను నగరపాలక సంస్థ ఆరంభించింది. పాత డ్రైన్ల స్థానంలో కొత్తగా అవసరానికి తగినట్లు వెడల్పు చేస్తూ నిర్మిస్తోంది. ఇప్పటికే దేవీచౌక్‌లో పూర్తి చేయగా, పేపర్‌మిల్లు రోడ్డు, జాంపేట, తాడితోట ప్రాంతాల్లో డ్రైనేజీలకు అవసరమైన స్థలం కోసం నిర్మాణాలను తొలగిస్తోంది. తాడితోట నుంచి షెల్టాన్ హోటల్ వరకూ పాత మాస్టర్‌ప్లాన్ ప్రకారం 80 అడుగులకు రోడ్డును విస్తరించేందుకు యంత్రాంగం పని చేస్తోంది. దీనికోసం ముందుగా కుడివైపు మార్కింగ్ చేసిన మేరకు భవనాలను తొలగిస్తోంది. టీడీఆర్ బాండ్ అంటే? రోడ్ల విస్తరణ లేదా మరే ఇతర అభివృద్ధి పనులకైనా ప్రైవేటు స్థలాలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందుకు స్థల యజమానులకు పరిహారంగా నగదు, లేని పక్షంలో టీడీఆర్ బాండ్లు ఇస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో స్థల యజమానులకు ఈ తరహా బాండ్లు ఇచ్చే పద్ధతి అమలు జరుగుతోంది. ఈ విధానంలో యజమాని కోల్పోయే స్థలం (గజం) రిజిస్ట్రేషన్ విలువను పొందుపరుస్తూ, నష్టపోతున్న స్థలానికి రెట్టింపు విలువతో టీడీఆర్ బాండ్ ఇస్తారు. ఉదాహరణకు 10 గజాల స్థలం (గజం విలువ రూ.25 వేలు) కోల్పోతున్న యజమానికి 20 గజాల విలువైన బాండ్‌ను జారీ చేస్తారు. ఈ విధానాన్ని జిల్లాలోనే మొదటిసారిగా రాజమహేంద్రవరంలో అమలు చేస్తున్నారు. టీడీఆర్ బాండ్ వల్ల లాభమేంటంటే.. టీడీఆర్ బాండ్ తీసుకున్న వ్యక్తి తాను కోల్పోయిన స్థలానికి రెట్టింపు నిర్మాణం ఆదే ప్రాంతంలో చేపట్టవచ్చు. ఉదాహరణకు 300 గజాల స్థలంలో 50 గజాలు రోడ్డు విస్తరణలో కోల్పోతే మిగిలిన 250 గజాల్లో నిబంధనల ప్రకారం పరిమితి మేరకు భవన నిర్మాణం చేపట్టవచ్చు. యజమాని తాను కోల్పోయిన 50 గజాల స్థలం మేరకు రెట్టింపు (100 గజాలు) విస్తీర్ణంతో ఆ భవనం పైన మరో అంతస్తు నిర్మించుకోవచ్చు. ఇందుకు నగరపాలక సంస్థ ఎలాంటి అభ్యంతరమూ చెప్పదు. లేదంటే ఈ బాండ్లను విక్రయించుకోవచ్చు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించినవారు వీటిని కొనుగోలు చేస్తే ఆ భవనాన్ని సక్రమమైనదిగా నగరపాలక సంస్థ గుర్తిస్తుంది. ఈ వెలుసుబాటు ఉండడంతో స్థల యజమానులు కూడా టీడీఆర్ బాండ్లు తీసుకునేందుకు అంగీకరిస్తున్నారు. స్థల యజమానులు సహకరిస్తున్నారు నగరంలో ట్రాఫిక్, ముంపు సమస్య లేకుండా జంక్షన్లు, డ్రైనేజీలను విస్తరిస్తున్నాం. ఇప్పటికే పలుచోట్ల డ్రైనేజీలు విస్తరించే పని ప్రారంభించాం. తాడితోట నుంచి షెల్టాన్ వరకూ ప్రస్తుతం పాత మాస్టర్‌ప్లాన్ ప్రకారం 80 అడుగుల మేరకు భవనాలు తొలగిస్తున్నాం. కొత్త మాస్టర్‌ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోదం లభించాక అందులో నిర్ణయాలను 2031లోపు ఎప్పడైనా అమలు చేయవచ్చు. స్థల యజమానులకు టీడీఆర్ బాండ్లు జారీ చేస్తున్నాం. -
శ్రీశైలం ప్రధాన రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం
శ్రీశైలం: మాస్టర్ ప్లాన్‌లో భాగంగా బుధవారం.. శ్రీశైలం ప్రధాన రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. టోల్గేట్ నందిసర్కిల్ నుంచి కంభం సత్రం కాంపౌండ్ వరకు ప్రధాన రోడ్డుమార్గం 70 అడుగుల మేర విస్తరించనున్నారు. ఇందులో భాగంగా శివసదనం కాంపౌండ్ వాల్‌ను, అక్కడ ఉన్న కొన్ని చెట్లను తొలగించారు. దేవస్థానం ఈఓ నారాయణభరత్ గుప్త ప్రత్యక్షంగా ఉండి కొలతలు వేయించారు. కంభం సత్రంతో రోడ్డు డెడెండ్ కావడంతో అక్కడ ఉన్న కొన్ని షాపులకు నష్టం వాటిల్లకుండా 60 అడుగుల మేర మాత్రమే విస్తరణ చేయాలని సూచించారు. ఇదే విధంగా శివసదనం సర్కిల్ నుంచి గంగా, గౌరి సదన్, నంది సర్కిల్ వరకు ఇప్పటికే విస్తరణ కోసం మార్కింగ్ వేశారు. ఈ విస్తరణలో భాగంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, దేవస్థానానికి చెందిన 5కు పైగా కాటేజీలు తొలగించాల్సి వస్తోంది. ఇప్పటికే గ్రామీణ బ్యాంకు వారికి షాపింగ్ కాంప్లెక్స్‌లో స్థలాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా ఈఓ ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. రోడ్డు విస్తరణ జరిగితే మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేసి కరెంట్ పోల్స్‌ను కూడా మార్పు చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు సంబంధించి ట్రాన్స్‌కో ఎస్ఈని సంప్రదించి విస్తరణలో అడ్డంకిగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్పోల్స్ను మార్పు చేయాల్సిందిగా ఈఈ రామిరెడ్డికి ఈఓ ఆదేశాలు జారీ చేశారు. హరిహరరాయగోపుర మాడా వీధిలో విస్తరణ.. శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయ ప్రాకారానికి దక్షిణ మాడా వీధిగా ఉన్న హరిహరరాయగోపురం వద్ద 80 అడుగుల మేర రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డు పక్కనే ఉన్న దత్తాత్రేయ వనంలో ఉన్న రుద్రాక్ష చెట్లను సంరక్షించేందుకు వీలుగా వాటికి విలువైన ఇంజెక్షన్లను వేసి వేర్లతో సహా పెకిలించి ఆ వనంలోనే మరోవైపు నాటారు. అలాగే అమ్మవారి ఆలయం వెనుక వైపు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాడానికి సిద్ధమవుతున్నారు. -
రైల్వే లైన్‌ను పొడిగించాలి
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి జగిత్యాల రూరల్: నూతనంగా ఏర్పాటుచేస్తున్న మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్‌ను జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు పొడిగించాలని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు తానురాసిన లేఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గురువారం పంపించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం మనోహరాబాద్–సిద్దిపేట–సిరిసిల్ల–కొత్తపల్లికి రైల్వేలైన్ మంజూరు చేసిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర రాజధాని నుంచి కరీంనగర్ వరకు రైల్వేలైన్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ప్రతిపాదించిన మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్‌ను మనోహరబాద్, గజ్వేల్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్‌పేట, మంచిర్యాల వరకు కొనసాగిస్తే చాలా ఉపయోగం ఉంటుందన్నారు. దీంతో ఉత్తర భారతదేశాన్ని కలిపే రైలుకు ప్రత్యామ్నాయ రైల్వేలైన్ ఏర్పాటు చేసినట్లవుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలుగా మారనున్న జగిత్యాల, మంచిర్యాల రైల్వేలైన్‌తో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 7న మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేస్తున్నందున ముఖ్యమంత్రి చొరవ తీసుకుని రైల్వేలైన్ జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు పొడిగించేలా చూడాలని కోరారు. నిజామాబాద్ ఎంపీ కవిత, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్కు లేఖలు పంపినట్లు పేర్కొన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, మండల ఉపాధ్యక్షుడు గంగం మహేశ్ పాల్గొన్నారు. -
భూసమీకరణ గడువు పొడిగింపు చెల్లదు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని భూసమీకరణకు గడువు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చట్టానికి విరుద్ధమని రైతుసంఘాలు ధ్వజమెత్తాయి. రైతుల అభ్యర్థన మేరకు నోటిఫికేషన్ గడువును పెంచుతున్నామని సీఆర్డీఏ అధికారి చెప్పడాన్ని తప్పుపట్టాయి. భూములిచ్చేందుకు రైతులే అనాసక్తి చూపుతున్న తరుణంలో మళ్లీ గడువు పెంచి ఎవర్ని బెదిరిస్తారని ప్రశ్నించాయి. ‘‘సీఆర్డీఏ చట్టంలోని 9వ అధ్యాయం ల్యాండ్ పూలింగ్ అంశానికి చెంది నది. అందులోని 55వ సెక్షన్‌లోని 4, 5, 6 నిబంధనల్లో పేర్కొన్న ప్రకారం నిర్ణీత గడువులోనే భూసమీకరణ పూర్తి కావాలి. అదీ రైతుల ఇష్టపూర్వకంగానే జరగాలి. సెక్షన్ 56, 2వ నిబంధన ప్రకారం భూ సమీకరణకు అత్యధికంగా ఇచ్చిన గడువు 30 రోజులు. ల్యాండ్ పూలింగ్ పథకం నోటిఫికేషన్ నిబంధనలూ ఇదే అంశాన్ని ధ్రువీకరిస్తున్నాయి. భూసమీకరణకు ప్రభుత్వం జనవరి 2 నుంచి 14 వరకు సమయానుకూలంగా ఆయా గ్రామాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటి ప్రకారం ఈ నెల 14తో గడువు ముగిసింది. తుది నోటిఫికేషన్ ఆధారంగా భూములిచ్చినా కూడా సీఆర్డీఏ అధికారులు మాత్రం పాత తేదీలతో అంటే జనవరి 2 నుంచి ఫిబ్రవరి 2 లోపు ఇచ్చినట్టే రికార్డుల్లో రాస్తున్నారు. ఇంతచేసినా అనుకున్న మేర భూ సమీకరణ జరగక నోటిఫికేషన్ గడువును పొడిగించారు. ఇది సీఆర్డీఏ చట్టానికి, ల్యాండ్పూ లింగ్ నిబంధనలకు వ్యతిరేకం. ఒకవేళ పొడిగించాలనుకుంటే చట్టాన్ని మార్చాలి. లేదంటే ఆర్డినెన్స్ తీసుకురావాలి. ల్యాండ్ పూలింగ్ స్కీంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే విషయాన్ని చెప్పింది’’ అని రైతు సంఘాలు పేర్కొన్నాయి. దీనిపై రైతు సమాఖ్య నేత ఎం.శేషగిరిరావు మాట్లాడుతూ.. నోటిఫికేషన్ గడువు పొడిగింపుపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. గడువు పొడిగింపు అన్యాయం, చట్టవిరుద్ధమని ఏపీ రైతు సంఘం నేత కేవీవీ ప్రసాదరావు పేర్కొన్నారు. భూసేకరణ చట్టం ప్రకారమే భూమిని సేకరించాలని మరో రైతు నాయకుడు వి.సుబ్బారావు డిమాండ్ చేశారు. -
మెట్రో రైలు మార్గం మరింత పొడిగింపు
ఢిల్లీ నుంచి ఫరీదాబాద్ వరకు రూ. 2500 కోట్లతో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు మార్గాన్ని వల్లభ్‌గఢ్ వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా తెలిపారు. ఇందుకోసం త్వరలోనే మరో రూ. 468 కోట్లు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ శివార్లలో ఉన్న వల్లభ్‌గఢ్‌లో పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హూడా ఈ విషయం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ఫలాలు సామాన్యులకు అందేందుకు వీలుగా రెండు లక్షల మంది సుశిక్షితులైన కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ ఓ సైన్యాన్ని తయారుచేస్తుందని హూడా చెప్పారు. ప్రతి జిల్లాలోను కార్యకర్తల నమోదు కార్యక్రమం జరుగుతోందని, బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. హర్యానాలో అక్టోబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.