సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఆదాయ పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు మరో ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ గడువును పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైలింగుల గడువును ఈ ఏడాది నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ శనివారం ప్రకటించింది.
ప్రస్తుత కష్టసమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐటీ శాఖ ట్వీట్ చేసింది. ఇది పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు సహాయపడుతుందని పేర్కొంది.
Understanding & keeping in mind the times that we are in, we have further extended deadlines. Now, filing of ITR for FY 2019-20 is extended to 30th Nov, 2020. We do hope this helps you plan things better.#ITDateExtension#FacilitationDuringCovid#WeCare #IndiaFightsCorona pic.twitter.com/ZoGBpok3V7
— Income Tax India (@IncomeTaxIndia) July 4, 2020
Comments
Please login to add a commentAdd a comment