సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఓ యజ్ఞంలా కొనసాగుతున్న ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని.. పొడిగించాలని వైఎస్‌ఆర్‌సీపీ నిర్ణయించుకుంది. ప్రజల నుంచి దక్కుతున్న విశేష స్పందనతో కార్యక్రమానికి ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది.
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఈనెల 20తోనే ముగించాలనుకుంది. అయితే.. ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. దీంతో.. షెడ్యూల్‌ను మరో తొమ్మిది రోజులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం మొదలైంది. అప్పటి నుంచి ప్రజలు భాగస్వామ్యం అవుతున్న తీరు సర్వత్రా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు 84 లక్షల కుటుంబాల సర్వే పూర్తి అయ్యింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మద్దతుగా 63 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి.
ఇదీ చదవండి: ‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’
Comments
Please login to add a commentAdd a comment