
న్యూఢిల్లీ: జీఎస్‌టీఆర్–1 తుది సేల్స్ రిటర్న్స్‌ను దాఖలు చేసేందుకు గడువును కేంద్ర ప్రభుత్వం పది రోజులు పొడిగించింది. జనవరి 10 దాకా దీన్ని పొడిగించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రూ.1.5 కోట్ల దాకా టర్నోవరున్న వ్యాపార సంస్థలు జూలై–సెప్టెంబర్ కాలానికి సంబంధించిన జీఎస్‌టీఆర్–1ను జనవరి 10లోగా సమర్పించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈ గడువు డిసెంబర్ 31. ఇక రూ. 1.5 కోటి పైబడిన టర్నోవర్ గల సంస్థలు కూడా జూలై–నవంబర్ కాలానికి సంబంధించి జనవరి 10లోగా ఫైల్ చేయాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం జూలై–అక్టోబర్ మధ్య వ్యవధి జీఎస్‌టీఆర్–1ను డిసెంబర్ 31లోగా, నవంబర్‌కు సంబంధించిన దాన్ని జనవరి 10లోగా, డిసెంబర్‌ది ఫిబ్రవరి 10లోగా సమర్పించాల్సి ఉంది.