జీఎస్‌టీ రిటర్నుల ఫైలింగ్‌ గడువు పెంపు  | GST increases deadline for returns | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ రిటర్నుల ఫైలింగ్‌ గడువు పెంపు 

Published Sat, Dec 1 2018 12:32 AM | Last Updated on Sat, Dec 1 2018 12:32 AM

GST increases deadline for returns - Sakshi

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టాలకు సంబంధించి అక్టోబర్‌ – డిసెంబర్‌ కాలానికి టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత) రిటర్న్స్‌ ఫైలింగ్‌కు గడువును కేంద్రం పెంచింది. 2019 జనవరి 31 వరకూ రిటర్న్స్‌ దాఖలు చేసుకోవచ్చని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

జీఎస్‌టీ కింద టీడీఎస్‌ ప్రొవిజన్స్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చాయి. సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) చట్టం ప్రకారం..రూ.2.5 లక్షలు దాటిన వస్తువులు, సేవల సరఫరాదారులకు చేసే చెల్లింపులపై నోటిఫైడ్‌ సంస్థలు 1% టీడీఎస్‌ను వసూ లు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర చట్టాల (ఎస్‌జీఎస్‌టీ) కింద మరో 1% పన్నునూ విధించాలి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement