న్యూఢిల్లీ: వ్యాపారులు జీఎస్‌టీకి సంబంధించి నెలవారీ వేసే రిటర్న్స్ ‘జీఎస్‌టీఆర్–3బీ’లో తప్పులు సరిదిద్దుకునేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించింది. దీంతో వారు తొలుత లెక్కించిన జీఎస్టీలో గనక తప్పొప్పులుంటే వాటిని సరిదిద్దుకుని మళ్లీ రిటర్న్ దాఖలు చేయటానికి వీలవుతుంది. ఇలా దిద్దటం వల్ల పెనాల్టీ పడుతుందన్న భయం కూడా ఉండదు.
ఇలా సరిదిద్దుకోవటం ద్వారా సరైన ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కూడా కలుగుతుంది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక వ్యాపారులకు పన్ను చెల్లింపులను సరిగ్గా లెక్కించటం కష్టతరమయ్యింది. దీంతో పరిశ్రమ వర్గాలు నిబంధనలను సరళం చేయాలని డిమాండ్ చేశాయి. తాజా నిబంధనల సరళీకరణ వల్ల జీఎస్‌టీ రిటర్న్స్ ఫామ్‌లో మార్పులు చేర్పులు కోరుకుంటున్న వ్యాపారులకు ఉపశమనం కలుగుతుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) ఇండియా ట్యాక్స్ పార్ట్‌నర్ అభిషేక్ జైన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment