హర్యానా సీఎం చెంప ఛెళ్లు | harayana cm beat by young guy | Sakshi
Sakshi News home page

హర్యానా సీఎం చెంప ఛెళ్లు

Published Mon, Feb 3 2014 12:57 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

harayana cm beat by young guy

హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం పానిపట్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీలో భాగంగా నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న ఆయనను ఓ యువకుడు చెంప పగలగొట్టాడు

 చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం పానిపట్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీలో భాగంగా నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న ఆయనను ఓ యువకుడు చెంప పగలగొట్టాడు. రోడ్‌షోలో భాగంగా ఓపెన్ టాప్ జిప్సీ ఎస్‌యూవీలో హుడా ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ఒక్క ఉదుటన ఈ వాహనంలోకి ఎక్కిన యువకుడు హుడా చెంపపై చరిచాడు. ఈ పరిణామంతో నిర్ఘాంత పోయిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
 
 ‘ఆప్’ ఎమ్మెల్యేకు కూడా
 ఢిల్లీలోని సంగమ్‌విహార్ నియోజకవర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే  దినేష్ మోహనియాకు ఆదివారం ఒక మహిళ చెంప పగలగొట్టింది. నియోజకవర్గంలోని నీటి ఎద్దడి సమస్యను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. అయితే, జరిగిన సంఘటనను నీటి మాఫియా కుట్రగా ఎమ్మెల్యే మోహనియా అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement