
ఓటమిని ఒప్పుకుంటున్నా: హుడా
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా అంగీకరించారు. ప్రజాతీర్పును ఒప్పుకుంటున్నానని ఆదివారం విలేకరులతో అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్నారు. గతంలో తాము విజయం సాధిస్తే, ఇప్పుడు బీజేపీ గెలిచిందన్నారు.
కాంగ్రెస్ పదేళ్ల పాలన లో చేసిన అభివృద్ధిని కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీజేపీ విజయానికి నరేంద్ర మోడీ ప్రభంజనం కారణమన్న వాదనతో ఆయన విభేదించారు. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో బీజేపీ పూర్తి ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది.