Success Story రూ.90 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి కోట్ల ఆదాయం | Meet Mohit Nijhawan who quit MNC job to grow microgreens | Sakshi
Sakshi News home page

Success Story రూ.90 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి కోట్ల ఆదాయం

Published Sat, Mar 15 2025 4:56 PM | Last Updated on Sat, Mar 15 2025 5:19 PM

Meet Mohit Nijhawan who quit MNC job to grow microgreens

జీవితంలోపైకి రావాలని, మంచి లాభాలను సాధించాలని సాధారణంగా చాలామంది వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.  కానీ  తన చుట్టూ  ఉండేవారి  బాధలు,  అనారోగ్యాలను చూసి చలించిపోయి  వ్యాపారం ప్రారంభించే వారు చాలా తక్కువ.  అదీ అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలివేసి మరీ  ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకునేవారు చాలా అరుదుగా ఉంటారు.  చండీగఢ్‌కు చెందిన మోహిత్ నిజవాన్ (Mohit Nijhawan) అలాంటి వారిలో ఒకరు. ఇంతకీ ఆయన వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి గల కారణాలు ఏంటి? ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు?    

లక్షల జీతం  వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం ప్రారంభించడం  అంత ఈజీకాదు. ఇందుకు  పూర్తి విశ్వాసం, కృషి పట్టుదల ఉండాలి.   చండీగఢ్‌కు చెందిన మోహిత్‌ నిజవాన్‌ బయో కెమిస్ట్రీలో పీజీ చేశాడు.   ముంబైలోని ఒక ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు.  రూ.90 లక్షల  వేతనం. అయితే తన బంధువుల్లో చాలా కేన్సర్‌ బారిన పడటం, వారిలో చాలా మందికి వైద్య ఖర్చులుగా భారీగా ఉండటం,  ఖరీదైన మందులు తీసుకున్న తర్వాత కూడా నయం కాకపోవడం గమనించాడు.  ముఖ్యంగా తన సోదరుడు సహా తన దగ్గరి బంధువులు చాలా మంది క్యాన్సర్‌తో బాధపడుతుండటం ఆయనను బాధించింది. అందులోనూ ఒక పిల్లవాడు  తన కళ్ల ముందే చనిపోవడం తట్టుకోలేకపోయాడు. ఈ కేన్సర్‌ కేసులు అంటువ్యాధులు కావని, జీవనశైలి , డైటరీఆహార పదార్థాల వల్ల వస్తున్నాయని  గుర్తించాడు. అంతే సంచలన నిర్ణయంతీసుకున్నాడు. 2020లో  ఉద్యోగాన్ని వదిలివేసి మైక్రోగ్రీన్స్ (microgreens) పెంచాలని నిర్ణయించుకున్నాడు.

తన స్నేహితుడితో కలిసి 21వ శతాబ్దపు వెజ్జీ స్టార్టప్‌గా చెప్పుకునే మైక్రోగ్రీన్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కానీ స్నేహితుడు మోసం చేయడంతో  భారీ ఆర్థిక నష్టాన్ని చవి చూశాడు.  మరోవైపు కుటుంబ సభ్యుల ఆగ్రహాన్ని కూడాఎదుర్కోవలసి వచ్చింది. ఎందుకంటే చక్కటి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించడం మోహిత్ తల్లిదండ్రులకు సుతరామూ ఇష్టం లేదు.  కానీ మోహిత్‌ పట్టువీడలేదు.

 మోహిత్ 2022 సంవత్సరంలో రూ. 30 వేల పెట్టుబడితో తన వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించాడు.  500 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాడు. బ్రోకలీ, కాలీఫ్లవర్, ఆవాలు, మెంతులు, ముల్లంగి మొదలైన 21 రకాల విత్తనాలతో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు.  చండీగఢ్‌కు చెందిన ఒక ఆంకాలజిస్ట్‌కు విక్రయించాడు. అక్కడ మైక్రోగ్రీన్స్  తినిడం వల్ల  కొంతమంది రోగుల ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో తన ఆశయం నెరవేరిందన్న ఉత్సాహం వచ్చింది మోహిత్‌కు. ఎంబ్రియోనిక్ గ్రీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించాడు.  గ్రీను బ్రాండ్ పేరుతో మైక్రోగ్రీన్‌లను విక్రయిస్తోంది. బీట్‌రూట్, ముల్లంగి, తులసి, కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు, బ్రోకలీ, ముల్లంగి, బఠానీలు వంటి అనేక రకాల మైక్రోగ్రీన్స్ ఉన్నాయి. సాధారణ ప్రజలే కాకుండా, రెస్టారెంట్లు, జిమ్‌లు, కేఫ్‌లు  ఈ కంపెనీ కస్టమర్లలో భాగం.

చదవండి: చాక్లెట్లు అంటే పిచ్చి : కట్‌ చేస్తే..‌ ఏడాదికి కోటి రూపాయలు

ఔత్సాహికులకు శిక్షణ
మోహిత్ మైక్రోగ్రీన్‌లను అమ్మడమే కాకుండా, వాటిని పెంచడంపై రైతులకు శిక్షణ కూడా ఇస్తాడు. మైక్రోగ్రీన్స్ అమ్మకాల ద్వారా  నెలకు రూ.12 లక్షల వ్యాపారం చేస్తున్నాడు, అంటే ఏటా దాదాపు రూ.1.44 కోట్లు. అంటే నెలకు దాదాపు రూ.5 లక్షలు. అలాగే ప్రతీ ఏటా రూ.60 లక్షలు లాభం సంపాదిస్తున్నాడు.

ఇదీ చదవండి: #WomenPower :హంపీ టెంపుల్‌లోని ఈ సారథుల గురించి తెలుసా?

మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి?
విత్తనాలను మట్టి లేకుండా, కేవలం నీటి సహాయంతో ట్రేలలో పెంచుతారు. ఇవి మొలకెత్తిన కొన్ని రోజుల తర్వాత (7 -10 రోజులలోపు),  చిన్న చిన్న మొలకలుగా ఉన్నపుడే సలాడ్లు, శాండ్‌విచ్‌లు లేదా ఏదైనా ఇతర ఆహారంలో ఉడికించకుండానే ఉపయోగిస్తారు.  వీటిల్లో సాధారణ ఆకుకూరల కంటే 40 శాతం ఎక్కువ పోషకాలుంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా, కేన్సర్ వంటి వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు. వీటికి పెంచడానికి, పొలం లేదా భూమి అవసరం లేదు. నీటి సహాయంతో కేవలం ట్రేలలోనే పెంచుతారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలు సమృద్ధిగా ఉంటాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement