sprouts
-
"తంపటి తేగ" జీవితంలో ఒక్కసారైనా తినాల్సిందే...
మలికిపురం: ‘తేగ’నచ్చేసే ఆహారం ఇది.. ఆరోగ్య ప్రదాయినీగా పేరొందింది.. అందుకే దీనికి ఉభయ గోదావరి జిల్లాలో ఎంతో ప్రాధాన్యం ఉంది.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అందరూ ఇష్టపడి తినే తేగల విక్రయం కార్తిక మాసంలో వచ్చే నాగుల చవితి అనంతరం ప్రారంభం అవుతోంది. హిందూ సంప్రదాయంలో తేగలకు నాగుల చవితికి పురాణాల్లో అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల నాగుల చవితి తర్వాతే తేగలను వెలికితీసి విక్రయిస్తారు. అలాగే ఆహార ప్రియులు నాగులు చవితి చేసిన తర్వాతే తేగలను తినడం మొదలు పెడతారు. అయితే మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా తేగల దిగుబడి డిసెంబర్ నుంచీ మొదలవుతుంది. తాటి చెట్ల ద్వారా... తేగలు తాడి చెట్ల నుంచే ఉద్భవిస్తాయి. వేసవిలో తాటికాయల కాపు మొదలవుతుంది. మార్చి, ఏప్రియల్ నెలల్లో తాటి ముంజులను విక్రయిస్తారు. అనంతరం కురిసే వర్షాల నాటికి తాటికాయలు తాటి పండ్లుగా మారతాయి. అలా రాలిన తాటి పండ్ల గుజ్జును వినియోగించి పిండి వంటలు కూడా పల్లెటూర్లలో తయారు చేస్తారు. అలా రాలిన కాయల టెంకలతో పాటు, తాడి చెట్ల నుంచి తాడి కాయలను దించి ప్రత్యేక ప్రాంతాల్లో రైతులు వ్యాపారులు తేగల పాతరలు వేస్తారు. రైతులు, వ్యాపారులు వారికి ఉన్న చెట్లను బట్టి వ్యాపార స్థాయిని బట్టి ఒక్కొక్కరు ఎకరం నుంచి రెండు ఎకరాల్లో కూడా వివిధ ప్రాంతాల్లో పాతర వేస్తారు. వీటికి ఎటువంటి ఎరువులు వేయరు. భూమి ఇసుక పొరలలో దృఢంగా పెరుగుతాయి. డిసెంబర్ నాటికి ఇవి తేగలుగా తయారవుతాయి. సీజనల్ ఆహార పంటగా.. ప్రస్తుతం తేగలు, బుర్ర గుంజుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తేగలు ప్రస్తుత సీజన్లో సమృద్ధిగా లభిస్తాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కేశనపల్లి, గూడపల్లి, పశ్చిమ గోదావరిలో మొగల్తూరు, ఇరగవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు తేగలకు ప్రసిద్ధి. కోనసీమ తేగలు ఇతర ప్రాంతాలకూ ఎగమతి అవుతున్నాయి. స్థానిక ప్రజలు దూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులకు తేగలను పార్శిల్ చేసి పంపుతుంటారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు, ముంబయి, ఢిల్లీలకు కూడా తరలిస్తారు. కోనసీమలోని కేశనపల్లి, గూడపల్లి, చింతలమోరిలలో తేగలు రుచిగా ఉంటాయి. దీనికి ఇక్కడి ఎర్రటి ఇసుక నేలలే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే చింతూరులో లభించే అటవీ తేగలకు కూడా మంచి రుచి ఉంటుంది. అమ్మకాలతో ఉపాధి తేగల అమ్మకంతో అనేక మంది ఉపాధి పొందుతున్నారు. సీజనల్ ఆహార పంటల వ్యాపారులు ఈ తేగల సీజన్ వచ్చిందంటే తేగలతో రోడ్లపైనా, ప్రధాన రహదాలు వెంబడి దుకాణాలను తెరుస్తారు. భూమిలో తయారైన తేగలను తవ్వి తీసి వాటిని ప్రత్యేక కుండలలో కాలుస్తారు. వాటిని తంపటి వేయడం అంటారు. ఇలా తంపటి వేస్తేనే అవి రుచిగా ఉంటాయి. రాత్రి తంపటి వేసిన తేగలను అలా కుండల నుంచి తీసి మంచులో ఉంచుతారు. అలా చేయడం వల్ల రుచితో పాటు ఆరోగ్యకారకంగా ఉంటాయి. ఉదయం వీటిని కట్టలుగా కట్టి విక్రయాలు చేస్తారు. సైజులుగా విభజించి కట్టలు కడతారు. సైజును బట్టి పది కట్ట రూ.50 నుంచి రూ.100 వరకూ విక్రయిస్తున్నారు. బుర్ర గుంజుకూ డిమాండ్ తేగలను పాతర నుంచి తీసే సమయంలో తేగ మొలవడానికి కారణమైన తాటి టెంక (బుర్ర) కూడా బయటకు వస్తుంది. ఆ టెంకలను కత్తితో బద్దలు కొట్టి దానిలో మెత్తగా ఉండే గుజ్జును కూడా బయటకు తీస్తారు. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ప్రత్యేక ప్యాకెట్లలో వేసి పావు కిలో రూ.50కి విక్రయిస్తున్నారు.ఆహా ఆరోగ్యం.. తేగలు గుండె జబ్బులు, డయాబెటిస్ ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెడతాయి. ఇవి కొలె్రస్టాల్‌ను తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తాయి. నోటి సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. డయాబెటిస్తో బాధపడే వారు వీటిని తింటే డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలేయానికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా తాటి తేగలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇన్ని ప్రయోజనాలను కలిగించే తాటి తేగలను ప్రతిరోజు క్రమం తప్పకుండా దొరికినప్పుడు ఒకటి చొప్పున తీసుకుంటే చాలా మంచిది. ఎటువంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పెరిగే ఈ తాటి తేగలు మంచి పోషకాహారంగా మనం చెప్పవచ్చు. వీటిల్లో ఉండే పీచు పదార్థం మన జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది. మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలని భావించే వారికి తాటి తేగలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఇవి మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సమస్య రాకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తెల్లరక్త కణాలను పెంచి, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. -
మొలకెత్తిన రాగుల పిండితో లాభాలెన్నో: ఇంట్లోనే చేసుకోండిలా!
రాగులతో మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు రాగులు చాలామంచిది. కాల్షియం, ఐరన్ లాంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి. రాగులతో పసందైన వంటకాలను తయారు చేసుకొని ఆస్వాదించవచ్చు. అయితే రాగులను నానబెట్టి,మొలకలొచ్చాక, వేయించి పౌడర్ చేసుకొన వాడితేమరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లలు నుంచి పెద్దల వరకు రాగులను అనేక రూపాల్లో తీసుకోవచ్చు. రాగి జావ, రాగి పిండితో దోసెలు, ఇడ్లీలు చేసుకోవచ్చు. అలాగే రాగులతో మురుకులను కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా రాగులను మొలకలు వచ్చేలా చేసి వాటిని ఎండబెట్టి, లైట్‌గా వేయించి పౌడర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం. రుచికీ రుచీ పెరుగుతుంది. పోషకాలూ పెరుగుతాయి. రాగుల మొలకలతో పిండిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం.రాగుల మొలకలతో పిండి తయారీరాగులను రాళ్లు, ఇసుక లేకుండా శుభ్రంగా జల్లించుకోవాలి. ఆ తరువాత వీటిని శుభ్రంగా కడగాలి. ఎక్కువ సార్లు దాదాపు నాలుగు నుంచి పదిసార్లు , తెల్ల నీళ్లు వచ్చేదాకా కడుక్కోవాలి. కడిగిన రాగులను జాలీలో వేసుకొని నీళ్లు మొత్తం వాడేలా చూసుకోవాలి. తరువాత వీటిని పల్చని కాటన్ వస్త్రంలో(కాటన్ చున్నీ, చీర అయితే బావుంటుంది)వేసి మూట కట్టి, లైట్‌గా నీళ్లు చిలకరించి ఒక జాలీ గిన్నెలో పెట్టి, జాగ్రత్తగా వంట ఇంటి కప్‌బోర్డులో(గాలి, వెలుతురు తగలకుండా) పెట్టుకోవాలి. రెండు రోజులకు రాగులు మొలకలు భలే వస్తాయి. మూటలోంచి మొలకలు తెల్లగా బయటికి వచ్చేంత పెరుగుతాయి. వీటిని జాగ్రత్తగా తీసుకొని తడి ఆరేలాగా ఎండబెట్టుకోవాలి. ఆరిన తరువాత వీటిని నూనె లేకుండా ఉత్తి మూకుడులో వేగించుకోవాలి. మాడకుండా గరిటెతో తిప్పుతూ సన్నని సెగమీద కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. అంటే కమ్మని రాగుల మొలకల పిండి రెడీ.ఈ పిండిని జావ, దోసెలు, చపాతీలు తయారీలో వాడుకోవచ్చు. ఇంకా రాగిమొలకలతో చేసిన పిండిలో కొద్దిగా పుట్నాల పొడి, బెల్లం, నెయ్యి కలిపి సున్ని ఉండలుగా చేసి పిల్లలకు రోజుకు ఒకటి పెడితే మంచి శక్తి వస్తుంది.రాగి ఇడ్లీరాగుల పిండిలో గోధు రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎండు మిర్చి,, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి. కొత్తమీర కూడా కలుపుకోవచ్చు.రాగులతో ఉపయోగాలురాగులు బలవర్దకమయిన ఆహారం. ఇతర ధాన్యాల కంటే రాగుల్లో 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఎక్కువ. నానబెట్టి, మొలకెత్తడంవల్ల పోషకాలు మరింత పెరుగుతాయి కొవ్వు కంటెంట్ తగ్గుతుంది. ఈ పిండితో చేసిన ఉగ్గును శిశువులకు కూడా తినిపించవచ్చు.బీపీ మధుమేహం, కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం లాంటి సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. చిన్నపిల్లల్లో ఎముకల వృద్ధికి, అనీమియా నివారణలో ఉపయోగపడుతుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి -
మొలకలొచ్చిన ఆలుగడ్డలు : ఇలా జాగ్రత్త పడదాం!
గింజలు, ఇతర తృణ ధాన్యాల్ని నానబెట్టి మొలకెత్తిన తరువాత తినడం వలన అందులోని పోషకాలు ఎక్కువగా అందుతాయి. కానీ మొలకెత్తిన తరువాత విషపూరితంగా మారే దుంపకూర గురించి తెలుసా? మార్కెట్ నుంచి తెచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉంచినప్పుడు, బంగాళాదుంపల్లో తెల్లగా చిన్న చిన్న మొలకలొస్తాయి. ఇలాంటి వాటిని తినడం మంచిది కాదంటున్నారు ఆహార నిపుణులు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?మొలకలొచ్చిన బంగాళాదుంపలను మొలకల్ని తీసివేసి వండుకుంటాం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలా మొలకెత్తిన దుంపలను వంటలో ఉపయోగించడం మంచిది కాదు. నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ ప్రకారం, మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను వాడకుండా ఉండటమే ఉత్తమం. మొలకెత్తిన బంగాళదుంపలు ఎందుకు తినకూడదుగ్లైకోఅల్కలాయిడ్స్, యాంటీబయాటిక్ లక్షణాలు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్-తగ్గించే ప్రభావాలతో సహా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కానీ వీటిని అధికంగా తింటే విషపూరితమయ్యే అవకాశాలే ఎక్కువ. మొలకెత్తిన బంగాళా దుంపల్లో అధిక స్థాయిలో గ్లైకోఅల్కలాయిడ్స్ పెరుగుతాయి. వీటి అధిక మోతాదులో తీసుకుంటే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి లాంటి సమస్యలు రావొచ్చు. అయితే వీటి బాగా ఉడికించడం వల్ల ఈ విష ప్రభావం బాగా తగ్గుతుంది.మొలకెత్తిన బంగాళాదుంపలను తిన్న తర్వాత కొన్ని గంటల నుండి ఒక రోజులో లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇవి మరీ ఎక్కువైతే రక్తపోటు, పల్స్ వేగం, జ్వరం, తలనొప్పి, గందరగోళం, కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతాయి.గర్భధారణ సమయంలో మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం కూడా పెరుగుతుంది. అయితే మొలకలొచ్చిన దుంపలు తాజాగా ఉన్నంతవరకు బేషుగ్గా తినవచ్చని మరికందరు చెబుతున్నారు. ఆ మొలకల్ని శుభ్రంగా తీసేసి తినవచ్చు. అయితే దుంపలు కుళ్లిపోకుండా ఉన్నాయా లేదా అనేది గమనించడం ముఖ్యమంటున్నారు.మొక్కలు రాకుండా ఉండాలంటేఎక్కువ నిల్వ ఉండకుండా, తాజాగా ఉండే దుంపలను మాత్రమే వంటల్లో వాడు కోవడం. బంగాళాదుంపలను ఉల్లిపాయలతో కలిపి ఉంచకూడదు. ఎందుకంటే రెండింటినీ కలిపి ఉంచడం వల్ల దుంపలు తొందరగా మొలక లొస్తాయట. బంగాళాదుంపల సంచిలో ఆపిల్‌ను జోడించడం వలన అవి మొలకెత్తకుండా నిరోధించవచ్చట.చిన్న చిట్కా: ఇలా మొలకలొచ్చిన దుంపలను పెరట్లోని చిన్న కుండీల్లో వేస్తే చక్కగా పెరుగుతాయి. దుంపలు కూడా ఊరతాయి. -
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
మొలకెత్తిన గింజధాన్యాలను తినడం వలనఅనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలన్నా, మంచి పోషకాలు అందాలన్నా మొలకలు తినాల్సి ఉంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. మొలకలతో వచ్చే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసు కుందాం.గర్భిణీ స్త్రీలకుశరీరానికి విటమిన్ సి, ఫైబర్ , జింక్, ఇనుము, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి. మొలకలలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఈ ఆహారం చాలా అవసరం. ఆహారంలోని ఫోలేట్ సరైన పోషకాలను పిండానికి అందేలా సహాయపడుతుంది. పిల్లల మంచి మెదడు అభివృద్ధికి మంచిది . ఇంకా మలబద్ధకం , పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారిస్తాయి.విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదల ఉండేలా చేస్తుంది. జుట్టు రాలడం, తొందరగా జుట్టు మెరిసిపోవడం తగ్గుతుంది. రక్త ప్రసరణ పెరిగి, జుట్టును బలోపేతం చేసి పెరుగుదలకు సహాయపడుతుంది. మొలకలలో విటమిన్ ఏ అధిక సంఖ్యలో ఉంటుంది. ఇది కంటిశుక్లం రేచీకటి నివారణలోనూ మొత్తం కంటి ఆరోగ్యానికి మంచిది.శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మాస్కులర్ డిజెనరేషన్ సమస్యకు బాగా పనిచేస్తుంది. శాఖాహారులు మొలకలను తీసుకున్నప్పుడు ప్రోటీన్ అందుతుంది. వీటిల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ మంచి కొలెస్ట్రాల్‌ని పెంచడంలో సహాయ పడతాయి.మొలకలలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది మెరుగైన స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. వీర్యకణాల కదలికలు కూడా చురుగ్గా ఉంటాయి.మొలకల్లో విటమిన్ B లభిస్తుంది. ఇది చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. చర్మ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. సాధారణ జలుబు, ఆస్తమా నివారణలో సాయపడతాయి.సైడ్-ఎఫెక్ట్స్ & అలర్జీలుతక్కువ నాణ్యత గల మొలకలను ఉపయోగించినప్పుడు మొలకలు శరీరంలో సాల్మొనెల్లా, ఇ కోలి బ్యాక్టీరియా , వైరస్ దాడికి కారణమవుతాయని తెలుస్తోంది. ఒక్కోసారి, జ్వరం అతిసారం బారిన పడ్డారు . కొంతమందికి కడుపు తిమ్మిరి ఏర్పడింది. మొలకలు సరియైన పద్ధతిలో రాకపోతే హానికరమైన బ్యాక్టీరియా పుడుతుంది.నోట్: ఇది అవగాహన కోసం అనేది గమనించగలరు. ఏదైనా మితంగా తింటే మంచిది. మొలకలు తిన్నపుడు ఏదైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తేం వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
మొలకలు వచ్చిన ఆలు, కలర్ మారిన ఆకుకూరలు వండేస్తున్నారా..?
బిజీ లైఫ్‌లో ఏ రోజు కారోజు తాజాగా ఉండే కూరగాయాలు తెచ్చుకోవడం అందరికీ కుదరదు. అందులోనూ కొన్ని కాయగూరలు తొందరగా మెత్తగా లేదా మొలకెత్తడం, కలర్ మారిపోవడం జరుగుతుంది. అన్ని డబ్బులు పెట్టి కొని పాడేయడానికి మనసొప్పక ఏదో రకంగా వండేస్తాం. కొందరైతే పాడైన భాగాన్ని తొలగించి మిగతా భాగం నుంచి వండేస్తారు.ఇలా చెయ్యొచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా..? కొన్ని కూరగాయాలు కొద్ది రోజులే నిల్వ ఉంటాయి. మరికొన్ని పాడైపోయినా ఆ విషయం తెలియదు. మెత్తబడటం లేదా మొలకెత్తుతుంటాయి ఇంకొన్ని కూరగాయాలు. మనం పడేయబుద్ధికాక వండేస్తుంటాం. అయితే ఇలా ఉంటే కొన్ని రకాల కూరగాయాలు అస్సలు వాడకూడదట. అవేంటో సవివరంగా చూద్దామా..! బంగాళదుంపం: బంగాళ దుంపపై మొలకలు వస్తే కొందరూ వెంటనే పడేస్తారు. మరొకందరూ వాటిని తొలగించి వండేస్తారు. మరీ వాడొచ్చా అంటే..నిజానికి బంగాళదుంపలో సహజంగా సోలనిన్ , చకోనిన్ అనే రెండు రకాల టాక్సిన్లు ఉంటాయి. అయితే బంగాళదుంపపై మొలకలు వచ్చి, ఆకుపచ్చని రంగు కనిపిస్తే వెంటనే పడేయ్యడం మంచిది. జస్ట్ అప్పుడే చిన్నగా మొలకలు వచ్చి ఆకుపచ్చ రంగు కనిపించనట్లయితే వినయోగించొచ్చు. కానీ మొలకలు, ఆకుపచ్చ రంగు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వినయోగించొద్దిన నిపుణులు చెబుతున్నారు. ఈ సోలనిన్ విష పదార్థం అని దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. ఉల్లిపాయలపై నల్ల మచ్చలు ఉల్లిపాయలు వద్దకు వస్తే బయటి తొక్కలు పొడిగా ఉంటాయి. కానీ లోపాల చాలా వాటికి నల్లటి రంగు ఉంటుంది. మనం వాటిన కడిగేసి వాడేస్తుంటా. అయితే ఇదేం అంత ప్రమాద కాదని చెబుతున్నారు నిపుణులు. మట్టిలో ఉండటం వల్ల వచ్చే కొద్దిపాటి ఫంగస్ అని, దీన్ని చక్కగా కడగడం లేదా ఆ భాగాన్ని తీసేయండి చాలు అని సూచిస్తున్నారు. కానీ ఒక్కోసారి బయటపోరలు తీస్తుండగా మెత్తగా కుళ్లినట్టు ఉండి లోపల భాగం బాగుంటే అస్సలు వంటకు వినయోగించొద్దుని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఆకుకూరలు వద్దకు వస్తే.. ఇవి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. వడలిపోయి, కలర్ మారిపోతే వాడొద్దని హెచ్చరిస్తున్నారు. అక్కడక్కడ కొద్దిగా ఆకులు పసుపురంగులో ఉంటే ఆయా ఆకులను తీసుకుని వాడుకోవచ్చని చెబుతున్నారు. అలాగే ఆకుకూర కాళ్లుభాగం లేదా, ఆకులు కుళ్లినట్లు ఉంటే అస్సలు వినయోగించొద్దని చెబతున్నారు. మొత్తని టొమాటాలు.. దెబ్బతగిలిన టొమాటాలు, కొన్ని లేత మచ్చలు ఉన్నా..ఆ ప్రాంతం వరకు కట్ చేసి తీసేసి వాడుకోవచ్చు. అదే టమాట బూజు పట్టి ఉండి మొత్తం మొత్తగా ఉంటే వెంటనే పారేయండి. కొన్ని టమాటాలు మెత్తగా అయిపోతాయి. అవి వాడుకోవచ్చని, ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. వెల్లుల్లి.. భారతీయ వంటశాలల్లో ప్రధానమైనది. ఇవి గోధుమ రంగులోకి మారిన, దానిపై గోధుమ కలర్ మచ్చలు ఉన్నా.. వెల్లుల్లి పాడైందని అర్థం. కొన్నింటికి ఆకుపచ్చగా మొలకలు వస్తాయి. అలాంటి వెల్లుల్లిలోని ఆకుపచ్చ భాగాన్ని తొలగించి హాయిగా వాడుకోవచ్చు. ఎందుకంటే..? వెల్లుల్లిలోని మొలకెత్తిన ఆకుపచ్చ భాగం చేదుగా ఉంటుంది. కూరల్లో వినయోగిస్తే టేస్ట్ మారుతుంది కాబట్టి వాటిని తొలగించాలి. పుట్టగొడుగులు.. పుట్టగొడుగులు ముడతలు పడినట్టు ఉండి జిగటగా ఉండి పాడైపోయినట్లు సంకేతం. అలాగే వాటిపై నల్ల మచ్చలు చెడిపోవటాన్ని సూచిస్తాయి. ఇలాంటివి వినియోగించకపోవటమే మేలు. దోసకాయలు.. దోసకాయ సాధారణంగా ఫ్రిజ్‌లో ఒక వారం పాటు తాజగా ఉంటుంది. దోసకాయ మెత్తబడితే అది పాడైపోయిందని అర్థం. మొత్తంగా కాకుండా కేవలం దోసకాయ చివరి భాగం మాత్రమే మెత్తగా ఉంటే ఆ భాగాన్ని తీసేసి వాడుకోవచ్చు. (చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
ఇది తింటే ప్రోటీన్..మీల్మేకర్తో మొలకల టిక్కా..
మీల్మేకర్ మొలకల టిక్కా తయారీకి కావల్సినవి: మీల్మేకర్ – ఒకటిన్నర కప్పులు; పెసర మొలకలు – అరకప్పు; పాలకూర – చిన్నకట్ట ఒకటి; అల్లం – అంగుళం ముక్క; బియ్యప్పిండి – నాలుగు టేబుల్ స్పూన్లు; శనగపిండి – మూడు టేబుల్ స్పూన్లు; ధనియాల ΄÷డి – ఒకటిన్నర టీస్పూను; జీలకర్ర పొడి – టీస్పూను; రాక్ సాల్ట్ – అరటీస్పూను; కొత్తిమీర, పుదీనా తరుగు – అరకప్పు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టిక్కి వేయించడానికి సరిపడా. తయారీ విధానమిలా: ముందుగా వేడినీటిలో మీల్ మేకర్ వేసి పదినిమిషాల పాటు నానబెట్టాలి. నానిన మీల్ మేకర్‌ను మూడుసార్లు నీటితో కడగాలి చివరిగా మీల్ మేకర్‌లోని నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి ∙పాలకూరను శుభ్రంగా కడిగి, మరుగుతోన్న నీటిలో వేసి రెండు నిమిషాలు ఉంచాలి. రెండు నిమిషాల తరువాత తీసి చల్లని నీటిలో వేసి, నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి ∙మిక్సీజార్‌లో పుదీనా, కొత్తిమీర, అల్లం వేసి గ్రైండ్ చేయాలి. ఇవన్నీ నలిగిన తరువాత పెసర మొలకలు వేసి గ్రైండ్ చేయాలి. చివరగా... నీళ్లు పోయకుండా మీల్మేకర్, పాలకూర వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని ధనియాల పొడి, బియ్యప్పిండి, శనగపిండి, జీలకర్ర పొడి, రాక్ సాల్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కనపెట్టుకోవాలి. పదినిమిషాల తరువాత పిండిమిశ్రమాన్ని టిక్కిల్లా చేసుకోవాలి ∙మీడియం మంటమీద నూనె వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు టిక్కీలను కాల్చుకుని సర్వ్ చేసుకోవాలి. -
నిద్ర లేచిన వెంటనే కాఫీలు, టీలు.. కుకీలు, బిస్కట్లు అస్సలు వద్దు!
ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలామంది టీ లేదా కాఫీలు తాగుతారు. అలాగే బిస్కెట్లు, కుకీలు తింటారు. కానీ ఇది సరైన ఫుడ్ కాదు. మీరు రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తినాల్సి ఉంటుంది. ఇవి శరీరంలోని అంతర్గత అవయవాలకు శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియ సరిగ్గా జరిగేలా చూస్తాయి. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. ►ఉదయమే ఒక గ్లాసు నీరు తాగడంతో రోజు ప్రారంభించాలి. ►ఆ తర్వాత మనకు నచ్చిన ఏవైనా నానబెట్టిన గింజలు లేదా మొలకలు తీసుకోవాలి. ►వీటిని తీసుకోవడం వల్ల రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటారు. అలసట ఉండదు. ►ఇందుకోసం రాత్రిపూట వీటిని నీటిలో నానబెట్టాలి. ►ఉదయమే కొన్ని నీళ్ళు తాగి వీటిని తినాలి. ఎలాంటి గింజలు తినాలో తెలుసుకుందాం. ►బాదం, ఎండుద్రాక్ష, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలని రాత్రంతా నానబెట్టి ఉదయం తినాలి. ►అయితే అవిసె గింజలను ఎప్పుడూ విడిగా నానబెట్టడమే ఉత్తమం. ►వీటికి మరికొన్ని ఆహారాలని కలుపుకోవచ్చు. తేనె, వాల్నట్, మఖానా, జీడిపప్పు, జోడించుకొని తిని తర్వాత పాలు తాగితే శరీరం కొత్త శక్తిని పుంజుకుంటుంది. చదవండి: Cancer Prevention: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్ బారిన పడినట్టే..! -
Health Tips: మొలకలు తింటున్నారా? అయితే
Health Benefits Of Sprouts: మొలకెత్తిన విత్తనాలను సంపూర్ణ ఆహారంగా చెప్పవచ్చు. శరీరానికి కావల్సిన సకల పోషకాలు అన్నీ మొలకెత్తిన విత్తనాలలో ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటివల్ల కలిగే ప్రయోజనాలు తెలియడం వల్ల ప్రస్తుత కాలంలో చాలా మంది వీటిని తినడం అలవాటుగా చేసుకుంటున్నారు. అయితే మనలో చాలా మంది తెలిసీ తెలియక వీటిని తినే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. వీటివల్ల మొలకలు తినడం మూలాన కలిగే ప్రయోజనాల మాట అటుంచి, అజీర్తి, గ్యాస్ వంటి ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందువల్ల మొలకలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం!. మొలకెత్తిన విత్తనాలను నమలడం కొద్దిగా కష్టంతో కూడిన పని. వీటిని తినడానికి సమయం ఎక్కువగా పడుతుంది. కనుక చాలా మంది వీటిని జ్యూస్ చేసుకొని తాగేస్తుంటారు. ఇదే మనం చేస్తున్న అతి పెద్ద పొరపాటు. మొలకెత్తిన విత్తనాలను జ్యూస్ చేసి తాగడం వల్ల వీటిలో ఉండే పోషకాలు శరీరానికి ఎక్కువగా అందవు. మొలకెత్తిక విత్తనాలను నమిలినప్పుడు మన నోట్లో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలం మొలకెత్తిన విత్తనాలలో ఉండే కార్బోహైడ్రేట్స్ జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. జ్యూస్ చేసి తాగడం వల్ల ఈ కార్బోహైడ్రేట్స్ జీర్ణం అవ్వవు. కనుక శరీరం వీటిని సంగ్రహించుకోలేదు. మొలకెత్తిన విత్తనాలను నమిలినప్పుడు వీటిని జీర్ణం చేయడానికి జీర్ణాశయం, ప్రేగులల్లో రసాయనాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల పేగులు పోషకాలను ఎక్కువగా శోషించుకుంటాయి. ఈ విత్తనాలను జ్యూస్ చేసి తాగడం వల్ల రసాయనాలు ఉత్పత్తి ఎక్కువగా జరగక మన పేగులు వీటిల్లో ఉండే పోషకాలను ఎక్కువగా శోషించుకోలేవు. ఈ పోషకాలన్నీ మలం ద్వారా బయటకు పోతాయి. మొలకెత్తిన విత్తనాలను జ్యూస్ చేసి తాగడం వల్ల వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎలా తీసుకోవాలి సందేహం చాలా మందికి వస్తుంది. మొలకెత్తిన విత్తనాలను జ్యూస్ చేయకుండా గింజల రూపంలోనే ఉండేలా చూసుకోవాలి. వీటిలో తేనె, నిమ్మరసం, ఖర్జూర, దానిమ్మ గింజలు, ఎండు ద్రాక్ష, ఉల్లి పాయ ముక్కలు వేసుకుని తినడం వల్ల రుచి కొద్దిగా మెరుగుపడుతుంది. కనుక సులభంగా తినవచ్చు. మొలకెత్తిన విత్తనాలను నేరుగా తినడమే మనకు చాలా మంచిది. ఇలా నేరుగా తినడం వల్లనే మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్థాయి. చదవండి: మజ్జిగను సంస్కృతంలో ఏమంటారు? వేసవిలో ఎక్కువగా తాగుతున్నారా? -
వృద్దుడు చేసిన వెరైటీ చాట్
మీరు ఇప్పటి వరకూ చాలా రకాలైన చాట్లు గురించి విని ఉంటారు. కానీ ఈ మొలకల చాట్ గురించి ఎప్పుడైనా విన్నారా. అయితే కాన్పూర్‌కి చెందిన ఓ వృద్ధుడు చేసిన మొలకల చాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. (చదవండి: మీది గొప్ప మనసు ..ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!) ఈ వీడియోలో ఆ వృద్ధుడు మొలకలతో ఒక చిరుతిండి తయారుచేస్తున్నట్లు ఉంటుంది. ఆ వీడియోలా అతను ఆకులతో తయారు చేసిన ఒక గిన్నెలో వివిధ రకాల మొలకలు వేస్తాడు. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగు, గ్రీన్ చట్నీ, ముల్లంగి తరుగుతో అలంకరించి సర్వ్ చేస్తాడు. అయితే ఆ వృద్ధుడు ఈ చాట్ తయారు చేస్తున్నంత సేపు చక్కగా నవ్వుతూ టకటక చేసేస్తాడు. దీంతో నెటిజన్లు అంతా ఎంత మంచి చిరునవ్వు , దేవుడు అతన్నెప్పుడూ చల్లగా చూడాలంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: బాబోయ్! పామును ముద్దులతో ముంచేస్తోందిగా!) View this post on Instagram A post shared by Gaurav Wasan (@youtubeswadofficial) -
కొండ చిలువ కసరత్తులు
ఆడబోయిన తీర్థం ఎదురయినట్టు... అని సామెత. ఇక్కడ మాత్రం పూర్తి రివర్సయ్యింది. తీర్థమాడటానికి వైష్ణోదేవి వెళ్లే భక్తులకు పే...ద్ద కొండచిలువ.. అదేనండీ పదిహేనడుగుల పైథాన్ ఒకటి జమ్మూలోని కాట్రా స్టేషన్లో ఓ పిల్లర్ మీద ఇలా పాకుతూ దర్శనమిచ్చింది. ఇంకేముంది, భక్తులు బెంబేలెత్తిపోయారు. ఈ కొండచిలువగారు పిల్లర్ మీదికి పాకుతూ ఉన్న దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి, సన్నిహితులకు వాట్సప్ చేశారు. దాదాపు 45 సెకండ్లున్న ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. చురుకయిన వాళ్లెవరో ఈ విషయాన్ని వన్యప్రాణి సంరక్షణ శాఖ వారికి చేరవేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి స్థానికుల సాయంతో కొండచిలువను భద్రంగా పట్టుకుని, సురక్షితంగా తీసుకెళ్లిపోయారు. తీరా ఆ తర్వాత తేలిందేమంటే, అది వైష్ణోదేవి వెళ్లే దోవలో జరిగింది కాదని, ముంబైలోని దాదర్ స్టేషన్లో చిత్రీకరించిన దృశ్యమన్నారు. అది కూడా కరెక్ట్ కాదనే వాళ్లూ ఉన్నారు. ఎక్కడిదైతే మాత్రం ఏమిటి, పైథాన్ విన్యాసాలు నిజమే, వైరల్ అయ్యిందా లేదా అన్నదే మనకు కావలసింది! -
వరికి మొలకలు
రైతుల కంట కన్నీరు పలాస, న్యూస్‌లైన్: భారీ వర్షాలతో నీట మునిగిన పంట మొలకెత్తడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికందిన పంట నీటిపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ పరిధిలోని అంబుసోలి గ్రామానికి చెందిన తెప్ప గణేష్, టొంప గణేష్ ఐదెకరాల్లో వరి పంట సాగుచేశారు. పొలాలకు నీరందించే అంబుసోలి చెరువు ఎండిపోవడంతో మోటార్లతో నీరందించారు. సుమారు రూ.60 వేలు పెట్టుబడి పెట్టారు. స్థానికంగా వ్యవసాయ కూలీల కొరత ఉండడంతో కోటబొమ్మాళి నుంచి తెచ్చి కోత పూర్తి చేశారు. పొలంలో పోగులు వేశారు. మరో రెండు రోజులు నూర్పులు పూర్తి చేసి ధాన్యం ఇంటికి తీసుకువెళ్లాలని అనుకుంటుండగానే అల్పపీడన ప్రభావంతో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం వారి ఆశలను అడియాశలు చేసింది. మూడు రోజుల పాటు కురిసిన వర్షంతో పొలంలో ఉన్నదానిని రక్షించుకోలేకపోయారు. చేతికొచ్చిన ధాన్యం గింజలు పొలంలోనే మొలకలయ్యాయి. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని రైతులు తెప్ప గణేష్, టొంప గణేష్ తెలిపారు. మండలంలోని పలువురు రైతులు ఇదే పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.