
ఆడబోయిన తీర్థం ఎదురయినట్టు... అని సామెత. ఇక్కడ మాత్రం పూర్తి రివర్సయ్యింది. తీర్థమాడటానికి వైష్ణోదేవి వెళ్లే భక్తులకు పే...ద్ద కొండచిలువ.. అదేనండీ పదిహేనడుగుల పైథాన్ ఒకటి జమ్మూలోని కాట్రా స్టేషన్‌లో ఓ పిల్లర్ మీద ఇలా పాకుతూ దర్శనమిచ్చింది. ఇంకేముంది, భక్తులు బెంబేలెత్తిపోయారు. ఈ కొండచిలువగారు పిల్లర్ మీదికి పాకుతూ ఉన్న దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి, సన్నిహితులకు వాట్సప్ చేశారు. దాదాపు 45 సెకండ్లున్న ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.
చురుకయిన వాళ్లెవరో ఈ విషయాన్ని వన్యప్రాణి సంరక్షణ శాఖ వారికి చేరవేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి స్థానికుల సాయంతో కొండచిలువను భద్రంగా పట్టుకుని, సురక్షితంగా తీసుకెళ్లిపోయారు. తీరా ఆ తర్వాత తేలిందేమంటే, అది వైష్ణోదేవి వెళ్లే దోవలో జరిగింది కాదని, ముంబైలోని దాదర్ స్టేషన్‌లో చిత్రీకరించిన దృశ్యమన్నారు. అది కూడా కరెక్ట్ కాదనే వాళ్లూ ఉన్నారు. ఎక్కడిదైతే మాత్రం ఏమిటి, పైథాన్ విన్యాసాలు నిజమే, వైరల్ అయ్యిందా లేదా అన్నదే మనకు కావలసింది!
Comments
Please login to add a commentAdd a comment