ఇది తింటే ప్రోటీన్‌..మీల్‌మేకర్‌తో మొలకల టిక్కా.. | How To Make Mil Maker Sprouts Tikka Recipe In Telugu | Sakshi
Sakshi News home page

ఇది తింటే ప్రోటీన్‌..మీల్‌మేకర్‌తో మొలకల టిక్కా..

Published Fri, Aug 11 2023 12:36 PM | Last Updated on Fri, Aug 11 2023 1:42 PM

How To Make Mil Maker Sprouts Tikka Recipe In Telugu - Sakshi

మీల్‌మేకర్‌ మొలకల టిక్కా తయారీకి కావల్సినవి: 

మీల్‌మేకర్‌ – ఒకటిన్నర కప్పులు; పెసర మొలకలు – అరకప్పు; పాలకూర – చిన్నకట్ట ఒకటి;
అల్లం – అంగుళం ముక్క; బియ్యప్పిండి – నాలుగు టేబుల్‌ స్పూన్లు; శనగపిండి – మూడు టేబుల్‌ స్పూన్లు;
ధనియాల ΄÷డి – ఒకటిన్నర టీస్పూను; జీలకర్ర  పొడి – టీస్పూను; రాక్‌ సాల్ట్‌ – అరటీస్పూను;
కొత్తిమీర, పుదీనా తరుగు – అరకప్పు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టిక్కి వేయించడానికి సరిపడా.



తయారీ విధానమిలా:

  • ముందుగా వేడినీటిలో మీల్‌ మేకర్‌ వేసి పదినిమిషాల పాటు నానబెట్టాలి. నానిన మీల్‌ మేకర్‌ను మూడుసార్లు నీటితో కడగాలి
  • చివరిగా మీల్‌ మేకర్‌లోని నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి ∙పాలకూరను శుభ్రంగా కడిగి, మరుగుతోన్న నీటిలో వేసి రెండు నిమిషాలు ఉంచాలి.
  • రెండు నిమిషాల తరువాత తీసి చల్లని నీటిలో వేసి, నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి ∙మిక్సీజార్‌లో పుదీనా, కొత్తిమీర, అల్లం వేసి గ్రైండ్‌ చేయాలి.
  • ఇవన్నీ నలిగిన తరువాత పెసర మొలకలు వేసి గ్రైండ్‌ చేయాలి.
  • చివరగా...  నీళ్లు పోయకుండా మీల్‌మేకర్, పాలకూర వేసి గ్రైండ్‌ చేయాలి.
  • గ్రైండ్‌ చేసిన మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని ధనియాల పొడి, బియ్యప్పిండి, శనగపిండి, జీలకర్ర పొడి, రాక్‌ సాల్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కనపెట్టుకోవాలి.

  • పదినిమిషాల తరువాత పిండిమిశ్రమాన్ని టిక్కిల్లా చేసుకోవాలి ∙మీడియం మంటమీద నూనె వేసి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు టిక్కీలను కాల్చుకుని సర్వ్‌ చేసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement