ప్రతీకాత్మక చిత్రం
ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలామంది టీ లేదా కాఫీలు తాగుతారు. అలాగే బిస్కెట్లు, కుకీలు తింటారు. కానీ ఇది సరైన ఫుడ్ కాదు. మీరు రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తినాల్సి ఉంటుంది. ఇవి శరీరంలోని అంతర్గత అవయవాలకు శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియ సరిగ్గా జరిగేలా చూస్తాయి. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
►ఉదయమే ఒక గ్లాసు నీరు తాగడంతో రోజు ప్రారంభించాలి.
►ఆ తర్వాత మనకు నచ్చిన ఏవైనా నానబెట్టిన గింజలు లేదా మొలకలు తీసుకోవాలి.
►వీటిని తీసుకోవడం వల్ల రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటారు. అలసట ఉండదు.
►ఇందుకోసం రాత్రిపూట వీటిని నీటిలో నానబెట్టాలి.
►ఉదయమే కొన్ని నీళ్ళు తాగి వీటిని తినాలి. ఎలాంటి గింజలు తినాలో తెలుసుకుందాం.
►బాదం, ఎండుద్రాక్ష, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలని రాత్రంతా నానబెట్టి ఉదయం తినాలి.
►అయితే అవిసె గింజలను ఎప్పుడూ విడిగా నానబెట్టడమే ఉత్తమం.
►వీటికి మరికొన్ని ఆహారాలని కలుపుకోవచ్చు. తేనె, వాల్నట్, మఖానా, జీడిపప్పు, జోడించుకొని తిని తర్వాత పాలు తాగితే శరీరం కొత్త శక్తిని పుంజుకుంటుంది.
చదవండి: Cancer Prevention: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్ బారిన పడినట్టే..!
Comments
Please login to add a commentAdd a comment