బిజీ లైఫ్‌లో ఏ రోజు కారోజు తాజాగా ఉండే కూరగాయాలు తెచ్చుకోవడం అందరికీ కుదరదు. అందులోనూ కొన్ని కాయగూరలు తొందరగా మెత్తగా లేదా మొలకెత్తడం, కలర్ మారిపోవడం జరుగుతుంది. అన్ని డబ్బులు పెట్టి కొని పాడేయడానికి మనసొప్పక ఏదో రకంగా వండేస్తాం. కొందరైతే పాడైన భాగాన్ని తొలగించి మిగతా భాగం నుంచి వండేస్తారు.ఇలా చెయ్యొచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా..?
కొన్ని కూరగాయాలు కొద్ది రోజులే నిల్వ ఉంటాయి. మరికొన్ని పాడైపోయినా ఆ విషయం తెలియదు. మెత్తబడటం లేదా మొలకెత్తుతుంటాయి ఇంకొన్ని కూరగాయాలు. మనం పడేయబుద్ధికాక వండేస్తుంటాం. అయితే ఇలా ఉంటే కొన్ని రకాల కూరగాయాలు అస్సలు వాడకూడదట. అవేంటో సవివరంగా చూద్దామా..!
బంగాళదుంపం:
బంగాళ దుంపపై మొలకలు వస్తే కొందరూ వెంటనే పడేస్తారు. మరొకందరూ వాటిని తొలగించి వండేస్తారు. మరీ వాడొచ్చా అంటే..నిజానికి బంగాళదుంపలో సహజంగా సోలనిన్ , చకోనిన్ అనే రెండు రకాల టాక్సిన్‌లు ఉంటాయి. అయితే బంగాళదుంపపై మొలకలు వచ్చి, ఆకుపచ్చని రంగు కనిపిస్తే వెంటనే పడేయ్యడం మంచిది. జస్ట్ అప్పుడే చిన్నగా మొలకలు వచ్చి ఆకుపచ్చ రంగు కనిపించనట్లయితే వినయోగించొచ్చు. కానీ మొలకలు, ఆకుపచ్చ రంగు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వినయోగించొద్దిన నిపుణులు చెబుతున్నారు. ఈ సోలనిన్ విష పదార్థం అని దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు.
ఉల్లిపాయలపై నల్ల మచ్చలు
ఉల్లిపాయలు వద్దకు వస్తే బయటి తొక్కలు పొడిగా ఉంటాయి. కానీ లోపాల చాలా వాటికి నల్లటి రంగు ఉంటుంది. మనం వాటిన కడిగేసి వాడేస్తుంటా. అయితే ఇదేం అంత ప్రమాద కాదని చెబుతున్నారు నిపుణులు. మట్టిలో ఉండటం వల్ల వచ్చే కొద్దిపాటి ఫంగస్ అని, దీన్ని చక్కగా కడగడం లేదా ఆ భాగాన్ని తీసేయండి చాలు అని సూచిస్తున్నారు. కానీ ఒక్కోసారి బయటపోరలు తీస్తుండగా మెత్తగా కుళ్లినట్టు ఉండి లోపల భాగం బాగుంటే అస్సలు వంటకు వినయోగించొద్దుని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఆకుకూరలు వద్దకు వస్తే..
ఇవి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. వడలిపోయి, కలర్ మారిపోతే వాడొద్దని హెచ్చరిస్తున్నారు. అక్కడక్కడ కొద్దిగా ఆకులు పసుపురంగులో ఉంటే ఆయా ఆకులను తీసుకుని వాడుకోవచ్చని చెబుతున్నారు. అలాగే ఆకుకూర కాళ్లుభాగం లేదా, ఆకులు కుళ్లినట్లు ఉంటే అస్సలు వినయోగించొద్దని చెబతున్నారు.
మొత్తని టొమాటాలు..
దెబ్బతగిలిన టొమాటాలు, కొన్ని లేత మచ్చలు ఉన్నా..ఆ ప్రాంతం వరకు కట్ చేసి తీసేసి వాడుకోవచ్చు. అదే టమాట బూజు పట్టి ఉండి మొత్తం మొత్తగా ఉంటే వెంటనే పారేయండి. కొన్ని టమాటాలు మెత్తగా అయిపోతాయి. అవి వాడుకోవచ్చని, ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు.
వెల్లుల్లి..
భారతీయ వంటశాలల్లో ప్రధానమైనది. ఇవి గోధుమ రంగులోకి మారిన, దానిపై గోధుమ కలర్ మచ్చలు ఉన్నా.. వెల్లుల్లి పాడైందని అర్థం. కొన్నింటికి ఆకుపచ్చగా మొలకలు వస్తాయి. అలాంటి వెల్లుల్లిలోని ఆకుపచ్చ భాగాన్ని తొలగించి హాయిగా వాడుకోవచ్చు. ఎందుకంటే..? వెల్లుల్లిలోని మొలకెత్తిన ఆకుపచ్చ భాగం చేదుగా ఉంటుంది. కూరల్లో వినయోగిస్తే టేస్ట్ మారుతుంది కాబట్టి వాటిని తొలగించాలి.
పుట్టగొడుగులు..
పుట్టగొడుగులు ముడతలు పడినట్టు ఉండి జిగటగా ఉండి పాడైపోయినట్లు సంకేతం. అలాగే వాటిపై నల్ల మచ్చలు చెడిపోవటాన్ని సూచిస్తాయి. ఇలాంటివి వినియోగించకపోవటమే మేలు.
దోసకాయలు..
దోసకాయ సాధారణంగా ఫ్రిజ్‌లో ఒక వారం పాటు తాజగా ఉంటుంది. దోసకాయ మెత్తబడితే అది పాడైపోయిందని అర్థం. మొత్తంగా కాకుండా కేవలం దోసకాయ చివరి భాగం మాత్రమే మెత్తగా ఉంటే ఆ భాగాన్ని తీసేసి వాడుకోవచ్చు.
(చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!)
Comments
Please login to add a commentAdd a comment