మనం తినే ఆహారంలో వివిధ రకాల పోషకాలు సమతుల్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా జీవించగలుగుతాం. అందుకే పోషకాహార నిపుణులు మనం తినే ఆహారంలో అన్ని రంగుల్లోని పండ్లు, కూరగాయలు ఉండాలంటున్నారు. ముఖ్యంగా రెయిన్‌బో(ఇంద్ర ధనుస్సు) డైట్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు. ఏంటీది అనేకదా..!. ఏం లేదండీ ఇంద్రధనుస్సులోని ఏడు రంగుల్లో ఉండే కూరగాయాలు, పండ్లు తీసుకుంటే అన్ని రకాల పోషకాలు శరీరానికి అందడమే గాక చక్కటి ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుందని చెబుతున్నారు. ఈ డైట్ వల్ల జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చని అంటున్నారు. అలాంటి ఈ రెయిన్‌బో డైట్‌లో రంగుల వారీగా ఉండే కూరగాయాలు, పండ్లు వర్గీకరణ, వాటి ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!
ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటాయని మనకు తెలుసు. అలాగే రెయిన్‌బో డైట్ అంటే ఎరుపు, పసుపు, ఊదా, ఆకుపచ్చ, నారింజ వంటి వివిధ రంగుల్లో పండ్లు, కూరగాయలను కలిగి ఉంటుంది. అందులోని ప్రతి రంగుతో కూడిన కూరగాయాలు, పండ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో చూద్దామా..!
రెడ్ ఫుడ్స్: ఇవి లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. అందువల్ల ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే గాక కేన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ రంగు కూరగాయలు, పండ్లు ప్రోస్టేట్, మూత్ర నాళం, డీఎన్‌ఏ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. అందువల్ల ఎరుపు రంగులో ఉండే యాపిల్స్, చెర్రీస్, నారింజ, బెర్రీలు, పుచ్చకాయలు, ఎర్ర ద్రాక్ష, బీట్‌రూట్‌లు, టమోటాలు మొదలైనవి తప్పక తినమని నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ ఫుడ్స్: క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల అవి శరీరాన్ని నిర్విషీకరణ చేసి జీర్ణక్రియకు తోడ్పడతాయి. అలాగే శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ ఆహారాలు కంటి, ఊపిరితిత్తులు, కాలేయం, కణాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. త్వరగా గాయాలు నయం అవ్వడంలో, చిగుళ్ల ఆరోగ్యంలో సహయపడతాయి. ఆకుపచ్చ రంగులో ఉండే అవోకాడో, ద్రాక్ష, కివి, బేరి, బ్రోకలీ, దోసకాయ, ఆస్పరాగస్, క్యాబేజీ, బీన్స్, మొదలైనవి తీసుకోవాలి.
వైట్ ఫుడ్స్: దీనిలో అల్లిసిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఎముకలకు మద్దతునిస్తాయి. అలాగే గుండె జబ్బులు, కేన్సర్‌తో పోరాడుతాయి. అందుకోసం అరటిపండ్లు, వెల్లుల్లి, కాలీఫ్లవర్, బంగాళదుంపలు, పుట్టగొడుగులు, ఖర్జూరం, అల్లం, ముల్లంగి మొదలైనవి తినండి.
పసుపు ఆహారాలు: వీటిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఈ సిట్రస్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, చర్మ సంరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అందుకోసం నిమ్మకాయలు, పైనాపిల్, అత్తి పండ్లను, మొక్కజొన్న, పసుపు మిరియాలు, పసుపు టమోటాలు, మామిడి, బంగారు కివి మొదలైనవి. ఈ ఆహారాలు కళ్ళకు, రోగనిరోధక వ్యవస్థకు మంచివి
పర్పుల్ ఫుడ్స్: వీటిలో ఆంథోసైనిన్‌లు అధికంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కడుపులోని మంటను తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా గుండెకు, మెదడుకు, ఎముకలకు, ధమనులకు, జ్ఞానానికి మేలు చేస్తాయి. ఈ ఆహారాలు కేన్సర్‌తో పోరాడటమే గాకుండా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి కూడా తోడ్పడతాయి. అందుకోసం ప్లం, ప్రూనే, బ్లాక్‌బెర్రీ, అత్తి పండ్లను, ఎండుద్రాక్ష, వంకాయ, ఊదా క్యాబేజీ, బ్లూబెర్రీస్, పర్పుల్ ద్రాక్ష మొదలైనవి.
ఆరెంజ్ ఫుడ్స్: వీటిలో ఉండే బీటా-కెరోటిన్‌తో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. నరాలు, కండరాల ఆరోగ్యానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి ఇవి చాలా అవసరం. దీని కోసం నారింజ, గుమ్మడికాయ, బొప్పాయి, పసుపు, చిలగడదుంపలు మొదలైనవి తీసుకోవాలి.
ఎల్లప్పుడూ వివిధ రంగుల కూరగాయలు, పండ్లు తినాలని లక్ష్యంగా పెట్టుకోండి. ఈ ఆహారాలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి మెదడు కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి, అభిజ్ఞా పనితీరును పెంచుతాయి.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. పాటించేమందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి ఫాలో అవ్వడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment