గింజలు, ఇతర తృణ ధాన్యాల్ని నానబెట్టి మొలకెత్తిన తరువాత తినడం వలన అందులోని పోషకాలు ఎక్కువగా అందుతాయి. కానీ మొలకెత్తిన తరువాత విషపూరితంగా మారే దుంపకూర గురించి తెలుసా? మార్కెట్ నుంచి తెచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉంచినప్పుడు, బంగాళాదుంపల్లో తెల్లగా చిన్న చిన్న మొలకలొస్తాయి. ఇలాంటి వాటిని తినడం మంచిది కాదంటున్నారు ఆహార నిపుణులు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మొలకలొచ్చిన బంగాళాదుంపలను మొలకల్ని తీసివేసి వండుకుంటాం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలా మొలకెత్తిన దుంపలను వంటలో ఉపయోగించడం మంచిది కాదు. నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ ప్రకారం, మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను వాడకుండా ఉండటమే ఉత్తమం.
మొలకెత్తిన బంగాళదుంపలు ఎందుకు తినకూడదు
గ్లైకోఅల్కలాయిడ్స్, యాంటీబయాటిక్ లక్షణాలు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్-తగ్గించే ప్రభావాలతో సహా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కానీ వీటిని అధికంగా తింటే విషపూరితమయ్యే అవకాశాలే ఎక్కువ. మొలకెత్తిన బంగాళా దుంపల్లో అధిక స్థాయిలో గ్లైకోఅల్కలాయిడ్స్ పెరుగుతాయి. వీటి అధిక మోతాదులో తీసుకుంటే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి లాంటి సమస్యలు రావొచ్చు. అయితే వీటి బాగా ఉడికించడం వల్ల ఈ విష ప్రభావం బాగా తగ్గుతుంది.
మొలకెత్తిన బంగాళాదుంపలను తిన్న తర్వాత కొన్ని గంటల నుండి ఒక రోజులో లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇవి మరీ ఎక్కువైతే రక్తపోటు, పల్స్ వేగం, జ్వరం, తలనొప్పి, గందరగోళం, కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతాయి.
గర్భధారణ సమయంలో మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం కూడా పెరుగుతుంది.
అయితే మొలకలొచ్చిన దుంపలు తాజాగా ఉన్నంతవరకు బేషుగ్గా తినవచ్చని మరికందరు చెబుతున్నారు. ఆ మొలకల్ని శుభ్రంగా తీసేసి తినవచ్చు. అయితే దుంపలు కుళ్లిపోకుండా ఉన్నాయా లేదా అనేది గమనించడం ముఖ్యమంటున్నారు.
మొక్కలు రాకుండా ఉండాలంటే
ఎక్కువ నిల్వ ఉండకుండా, తాజాగా ఉండే దుంపలను మాత్రమే వంటల్లో వాడు కోవడం. బంగాళాదుంపలను ఉల్లిపాయలతో కలిపి ఉంచకూడదు. ఎందుకంటే రెండింటినీ కలిపి ఉంచడం వల్ల దుంపలు తొందరగా మొలక లొస్తాయట. బంగాళాదుంపల సంచిలో ఆపిల్‌ను జోడించడం వలన అవి మొలకెత్తకుండా నిరోధించవచ్చట.
చిన్న చిట్కా: ఇలా మొలకలొచ్చిన దుంపలను పెరట్లోని చిన్న కుండీల్లో వేస్తే చక్కగా పెరుగుతాయి. దుంపలు కూడా ఊరతాయి.
Comments
Please login to add a commentAdd a comment