
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని హరియాణా మాజీ ముఖ్యమంత్రిపై సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. భూపేందర్ సింగ్ హుడా హరియాణా ముఖ్యమంత్రిగా ఉన్న (2004-07) సమయంలో 912 ఎకరాల్లో భూ కుంభకోణం జరిగిందని జస్టిస్ ఎకే గోయల్, ఉదమ్ లలిత్‌తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. హూడా సీఎంగా ఉన్న సమయంలో డీఎల్‌ఎఫ్ హౌసింగ్ కార్సోరేషన్‌కు ఇండస్టీయల్ టౌన్‌షిప్ కొరకు కేటాయించిన భూముల్లో భారీ ముడుపులు తీసుకున్నారని, వాటిని వెంటనే రికవరీ చేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.
కేసును వెంటనే దర్యాప్తు చేసి భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని సుప్రీం ఆదేశించింది. ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రజా ప్రతినిదులే భారీ కుంభకోణలకు పాల్పడితే ప్రజలకు రక్షణ ఎక్కడినుంచి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి పై తీవ్ర అసహానం వ్యక్తం చేసింది. ఉధ్దేశ పూర్వకంగానే ఈ అవకతవకలకు పాల్పడ్డారని ప్రజలనుంచి తీసుకున్న భూములన్నింటిని స్వాధీనం చేసుకోవాలని సీబీఐని ఆదేశించింది. (కాగా రైతులు దగ్గర నుంచి తీసుకున్న 912 ఎకరాల్లో.. ఎకరానికి కేవలం రూ. 25 లక్షల చొప్పున రైతులకు చెల్లించి, రూ.80 లక్షలు చెల్లించామని ప్రభుత్వనికి లెక్కల్లో చూపారు. కాగా డీఎల్‌ఎఫ్ సంస్థకు మాత్రం ఎకరం 4.5 కోట్ల చొప్పున 912 ఎకరాలను కేటాయించారు.)
Comments
Please login to add a commentAdd a comment