న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థుల రెండో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. బీజేపీని వీడి ఆప్‌లో చేరిన ప్రొఫెసర్ ఛత్రపాల్‌ను బర్వాలా అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు 29 మంది అభ్యర్థులను ప్రకటించింది.
తాజాగా ప్రకటించిన జాబితాలో సధైరా నుంచి రీటా బమ్నేయకు టిక్కెట్టు ఇచ్చారు. థానేసర్ నుంచి కృష్ణ బజాజ్, ఇంద్రి నుంచి హవా సింగ్‌లను అభ్యర్థులుగా ప్రకటించారు. ముక్త్యార్ సింగ్ బాజిగర్‌కు రాటియా నుంచి, అడ్వకేట్ భూపేంద్ర బెనివాల్‌కు అడంపూర్ నుంచి, జవహర్‌లాల్‌కు బవాల్ టిక్కెట్ ఇచ్చారు. ఫరీదాబాద్ నుంచి ప్రవేశ్ మెహతా, తిగావ్ నుంచి అబాష్ చండేలాలను అభ్యర్థులుగా ప్రకటించారు.
మరోవైపు గత ఐదు రోజులుగా కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు విషయమై చర్చలు జరిగినప్పటికీ అవి ఫలవంతం కాలేదు. పొత్తులో భాగంగా ఆప్ 10 సీట్లకు పైగా డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ఆ పార్టీకి మూడు సీట్లకు మించి ఇవ్వడానికి సిద్ధంగా లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆప్ కాంగ్రెస్ మధ్య పొత్తు లేనట్లేనని తేలింది. ఈ పరిణామాల అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సోమవారం విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment