
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. ‘‘ఢిల్లీలో ఒక్క అసెంబ్లీ స్థానంలోనే 11 వేల ఓట్లను తొలగించాలంటూ ఈసీకి బీజేపీ దరఖాస్తులు చేసింది. నేను పోటీ చేసే న్యూఢిల్లీ స్థానంలోనూ 12,500 పేర్లను తొలగించాలంటూ దరఖాస్తు చేసింది. మేం ఈసీ దృష్టికి తీసుకెళ్లడం వల్ల పేర్ల తొలగింపు ఆగిపోయింది’’ అని వివరించారు. బీజేపీ ఆటలను సాగనివ్వబోమన్నారు.