manipulation
-
ఓటర్ జాబితా తారుమారుకు బీజేపీ కుట్ర: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. ‘‘ఢిల్లీలో ఒక్క అసెంబ్లీ స్థానంలోనే 11 వేల ఓట్లను తొలగించాలంటూ ఈసీకి బీజేపీ దరఖాస్తులు చేసింది. నేను పోటీ చేసే న్యూఢిల్లీ స్థానంలోనూ 12,500 పేర్లను తొలగించాలంటూ దరఖాస్తు చేసింది. మేం ఈసీ దృష్టికి తీసుకెళ్లడం వల్ల పేర్ల తొలగింపు ఆగిపోయింది’’ అని వివరించారు. బీజేపీ ఆటలను సాగనివ్వబోమన్నారు. -
అల లండను పురములో.. పుట్టగానే తారుమారు.. ఐదు దశాబ్దాల తర్వాత వెలుగులోకి!
సగం జీవితం అయిపోయాక.. పెరిగిన ఇల్లే గాక పెంచిన తల్లిదండ్రులు.. తోబుట్టువులు.. ఎవరూ తనవారు కారని తెలిస్తే? ఇప్పటిదాకా ఏర్పరుచుకున్న బంధాలన్నీ అబద్ధమేనని అర్థమైతే? ఊహించడానికే కష్టంగా ఉంది కదూ! లండన్‌లో ఇద్దరు మహిళలకు అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎందుకంటే వారిద్దరూ పసికందులుగా ఉన్నప్పుడే తారుమారయ్యారు. అల వైకుంఠపురం సినిమాను తలపించే ఈ ఉదంతం లండన్‌లో టాకాఫ్ ద టౌన్‌గా మారిందిప్పుడు. డీఎన్ఏ కిట్‌తో... 2021 క్రిస్మస్. లండన్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌కు చెందిన టోనీకి మిత్రులు డీఎన్ఏ హోమ్ టెస్టింగ్ కిట్ కానుకగా ఇచ్చారు. దాంతో పనేముంది లెమ్మని పక్కకు పడేశాడు. రెండు నెలల తర్వాత ఫిబ్రవరిలో కిట్ కంటపడింది. సెలవు రోజు కావడంతో టైం పాస్ కోసం తన శాంపిల్‌ను డీఎన్ఏ టెస్ట్‌కు పంపాడు. తర్వాతి ఆదివారం సాయంత్రం తల్లి జోన్‌తో ఫోన్లో మాట్లాడుతుండగా రిజల్ట్ మెయిల్ వచి్చంది. తన తల్లి కుటుంబం ఐర్లాండ్‌లో ఎక్కడి నుంచి వచి్చందో దాని ఆధాంరగా గుర్తించగలిగాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ తన చెల్లెలి పేరు చూసి షాకయ్యాడు. తన చెల్లెలు జెస్సికాకు బదులు క్లెయిర్ అనే పేరును సోదరిగా పేర్కొన్నారు. తామిద్దరి డీఎన్ఏలు పూర్తిగా సరిపోలడమే అందుకు కారణం. జెస్సికా తమకు ముగ్గురు అన్నదమ్ముళ్ల తర్వాత పుట్టిన ఏకైక అమ్మాయి. అలాంటిది తను అసలైన చెల్లె కాదని డీఎన్ఏ టెస్టు పేర్కొనడం టోనీని కలవరపరిచింది. ఏమైనా 80 ఏళ్ల తల్లికి ఈ విషయం చెప్పి ఆందోళనకు గురి చేయొద్దనుకున్నాడు. మర్నాడే క్లెయిర్‌ను సంప్రదించాడు. డీఎన్ఏ పరీక్ష రిజల్టు గురించి వివరించాడు. ‘‘అది పొరపాటని అనుకుంటున్నా. నువ్వేమైనా తెలుసుకోగలవా?’ అంటూ మెసేజ్ చేశాడు. దాంతో తను కూడా షాకైంది. ఎందుకంటే క్లెయిర్‌కు రెండేళ్ల క్రితమే ఆమె కొడుకు డీఎన్ఏ కిట్‌ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చాడు. పరీక్ష చేయించుకుంటే తల్లిదండ్రులతో తన డీఎన్ఏ అస్సలు పోలలేదు. ఈ వివరాలన్నీ టోనీతో పంచుకుందామె. ఆ క్రమంలో, జెస్సికా పుట్టిన ఆస్పత్రిలోనే క్లెయిర్ కూడా పుట్టిందని తేలింది. ఏం జరిగిందంటే... జోన్ 1967లో నాలుగో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచి్చంది. నవజాత శిశువును ఆమె కాసేపు ముద్దులాడాక సిబ్బంది పిల్లల గదిలోకి తీసుకెళ్లారు. అర్థరాత్రి దాటాక మరో మహిళకు పుట్టిన పాపను కూడా పిల్లల వార్డుకు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ తారుమారయ్యారు. జోన్‌కు పుట్టిన క్లెయిర్ మరో మహిళ పొత్తిళ్లలోకి, ఆమెకు పుట్టిన జెస్సికా జోన్ చెంతకు చేరారు. పాపాయి జుత్తు రంగు నల్లగా ఉండటంతో అనుమానించినా, ముగ్గురు కొడుకుల తరువాత పుట్టిన కూతురు కావడంతో ఆ సంతోషంలో పెద్దగా పట్టించుకోలేదు. ఇద్దరూ నా కూతుళ్లే ఆస్పత్రిలో తనకు తెలిసిన ఈ నిజాలను క్లెయిర్‌తో పంచుకున్నాడు టోనీ. ఆమె మర్నాడే వెళ్లి తన అసలు తల్లి జోన్‌ను, కుటుంబాన్ని కలిసింది. క్లెయిర్ రోజూ ఆ ప్రాంతం మీదుగానే ఆఫీసుకు వెళ్తుంటుంది. ఇన్నేళ్లుగా తన అసలు తల్లి అదే రూట్లో తనకు తెలియకుండా ఉంటోందని తెలుసుకుని భావోద్వేగానికి గురైంది. తన క్లెయిర్ భర్తకు, పిల్లలకు విషయం చెప్పింది. క్లెయిర్, జెస్సికా ఇద్దరూ తన కూతుళ్లేనని జోన్ చెప్పుకొచి్చంది. జెస్సికా అసలు ఏడాది ముందే మరణించింది. న్యాయపరమైన చిక్కులు.. తారుమారు కారణంగా క్లెయిర్, జెస్సికా పుట్టిన రోజులు మారిపోయాయి. దాంతో బర్త్ సరి్టఫికెట్ మొదలుకుని పాస్‌పోర్ట్ దాకా అన్నీ మార్చాల్సిన అవసరం వచి్చంది. ఈ నిర్వాకంపై జాతీయ ఆరోగ్య ట్రస్టు (ఎన్హెచ్ఎస్)కు టోనీ ఘాటుగా లేఖ రాశాడు. తప్పు ఒప్పుకున్న ట్రస్టు, వారిద్దరికీ పరిహారం ఇస్తామని ప్రకటించింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
TS: పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసు
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పీఎస్‌లో పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసు నమోదైంది. గొర్రెల పంపిణీలో అవకతకలు జరిగాయంటూ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకం అమలులో అవకతవకలు చోటుచేసుకున్నాయి. గొర్రెల పంపిణీ కోసం గుంటూరు జిల్లా నుండి అధికారులు గొర్రెలను తీసుకొచ్చారు. గొర్రెలను ఇచ్చిన వారికి బదులు ఇతరుల ఖాతాలోకి నగదు జమ అయ్యిందని, మొత్తం 2 కోట్ల రూపాయలు మోసం జరిగిందని గచ్చిబౌలిలో ఫిర్యాదు చేశారు. పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. పలువురు అధికారులకు నోటీసులు జారీ చేశారు. -
Adani-Hindenburg case: ‘అదానీ’కి భారీ ఊరట
న్యూఢిల్లీ: ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘అదానీ గ్రూప్’నకు మరో విజయం లభించింది. స్టాక్ ధరల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థపై కొనసాగుతున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లేదా సీబీఐకి అప్పగించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. అదానీ గ్రూప్‌పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) కొనసాగిస్తున్న దర్యాప్తు పట్ల న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. సెబీ సమగ్ర దర్యాప్తు జరుపుతోందని వెల్లడించింది. ఈ దశలో సెబీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దర్యాప్తును సెబీ నుంచి సిట్ లేదా సీబీఐకి బదిలీ చేయాలన్న వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 46 పేజీల తీర్పు వెలువరించింది. అదానీ గ్రూప్‌పై పెండింగ్‌లో ఉన్న రెండు దర్యాప్తులను 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. సెబీ దర్యాప్తును అనుమానించలేం అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని, మదుపర్లను మోసగించిందని ఆరోపిస్తూ అదానీ–హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ వివాదం తర్వాత సుప్రీంకోర్టులో నాలుగు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. న్యాయవాదులు విశాల్ తివారీ, ఎంఎల్ శర్మ, కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, అనామికా జైశ్వాల్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ నివేదిక వచి్చన తర్వాత ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సెబీ చట్టంలో చేసిన మార్పుల కారణంగా అదానీ గ్రూప్ అవకతవకలు బయటపడడం లేదని పిటిషనర్లు ఆరోపించారు. సెబీని పటిష్టం చేయాలని కోరారు. ఈ నాలుగు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పత్రికల్లో వచి్చన వార్తలు లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు(ఓసీసీఆర్పీ) వంటి థర్డ్ పార్టీ సంస్థల నివేదికల ఆధారంగా సెబీ దర్యాప్తును అనుమానించలేమని స్పష్టం చేసింది. అలాంటి నివేదికలను కేవలం ఇన్‌పుట్స్‌గా పరిగణించవచ్చని అభిప్రాయపడింది. సెబీ దర్యాప్తును అనుమానించడానికి అలాంటివి ఆధారాలుగా ఉపయోగపడవని పేర్కొంది. చట్టబద్ధమైన సంస్థ అయిన సెబీ కొనసాగిస్తున్న దర్యాప్తును మరో సంస్థకు బదిలీ చేసే అధికారం కోర్టుకు లేదని పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల్లోనే మాత్రమే అలా బదిలీ చేయగలమని తేలి్చచెప్పింది. నిర్ధారణ కాని సమాచారంపై ఆధారపడొద్దు అదానీపై గ్రూప్‌పై 24 ఆరోపణలు రాగా, సెబీ ఇప్పటికే 22 ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చేయడానికి, కోర్టుకెక్కడానికి నిర్ధారణ కాని సమాచారంపై పిటిషనర్లు ఆధారపడినట్లు తెలుస్తోందని వెల్లడించింది. వారు తగిన పరిశోధన కూడా చేయకుండానే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని ఆక్షేపించింది. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకూడదని సూచించింది. న్యాయవాదులు గానీ, పౌర సమాజం సభ్యులు గానీ అప్రమత్తంగా ఉండాలని, నిర్ధారణ కాని సమాచారం లేదా థర్డ్‌పార్టీ నివేదికల ఆధారంగా ఇష్టారాజ్యంగా పిటిషన్లు వేయడం సరైంది కాదని తేలి్చచెప్పింది. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సానుకూల సంకేతాలు రావడంతో బుధవారం స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్‌లోని నమోదిత కంపెనీల షేర్ల ధరలు పైకి ఎగబాకాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఎన్డీటీవీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ వంటి సంస్థల షేర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. సత్యమేవ జయతే: గౌతమ్ అదానీ సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు. సత్యమే జయిస్తుందన్న నిజాన్ని ఈ తీర్పు మరోసారి నిరూపించిందని అన్నారు. భారతదేశ ప్రగతి చరిత్రలో తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉంటామని చెప్పారు. ప్రతికూల సమయంలో తమకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘సత్యమేవ జయతే’ అంటూ గౌతమ్ అదానీ బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన అదానీ
అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదికపై అదానీ గ్రూపు చైర్మన్, బిలియనీర్ గౌతమ్ అదానీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు సమాచారంతో, తమను అపఖ్యాతి చేయాలన్న దురుద్దేశంతో చేసిన ఆరోపణలని పునరుద్ఘాటించారు. ఇప్పటికే అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండించింది. తాజాగా గ్రూప్ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో గౌతం అదానీ మంగళవారం మాట్లాడారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కావాలనే తమ పబ్లిక్ ఆఫర్‌కు ముందు విడుదల చేశారనీ, ఇది ఉద్దేశపూర్వకంగా కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించారు. అయినా ఎఫ్‌పీవో సక్సెస్ అయినప్పటికీ, పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అదానీ చెప్పారు. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) ఈ సందర్బంగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తప్పుడు ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన వాటాదారులకు స్థిరమైన వృద్ధి , విలువ సృష్టికి హామీ ఇచ్చారు. అలాగే ప్రపంచ స్థాయి ఆస్తులను నిర్మించేందుకు గ్రూప్ కట్టుబడి ఉందని బిలియనీర్ చెప్పారు. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!) కాగా అదానీ గ్రూప్‌లో అకౌంటింగ్ మోసం, స్టాక్ ప్రైస్ మానిప్యులేషన్ జరిగిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది అదానీ గ్రూప్ స్టాక్‌ల భారీ పతనానికి దారితీసింది. ఫలితంగా గ్రూపు మార్కెట్ విలువను భారీగా కోల్పోయింది. అలాగే హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగిన తర్వాత రెగ్యులేటరీ మెకానిజమ్‌ల వైఫల్యాన్ని సూచించే ఆధారాలు తమకు లభించ లేదని ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు ప్యానెల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం? ) #WATCH | "...The report was a combination of targeted misinformation and discredited allegations. The majority of them dating from 2004 to 2015. They were all settled by authorities at that time. This report was a deliberate and malicious attempt aimed at damaging our… pic.twitter.com/yEH5r3Duff — ANI (@ANI) July 18, 2023 -
వీర్యం తారుమారు చేసినందుకు రూ.1.5 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ) రూ.1.5 కోట్ల జరిమానా విధించింది. కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన మహిళకు ఆమె భర్త వీర్యం బదులు మరొకరి వీర్యాన్ని ఎక్కించడమే ఇందుకు కారణం. అసిస్టెట్ రిప్రొడక్టివ్ టెక్నిక్(ఏఆర్టీ) విధానంలో సంతానం కోసం దంపతులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత 2009 జూన్‌లో వారికి కవలలు జని్మంచారు. శిశువులకు డీఎన్ఏ పరీక్షలు చేయించగా, వారి తండ్రి అతడు కాదని తేలింది. మరొకరి వీర్యంతో వారు జన్మించినట్లు స్పష్టమయ్యింది. మనోవేదనకు గురైన దంపతులు తమకు న్యాయం చేయాలని, రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆసుపత్రిని ఆదేశించాలని కోరుతూ ఎన్సీడీఆర్సీని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ దర్యాప్తు వారికి అనుకూలంగా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దంపతులకు రూ.1.5 కోట్ల పరిహారం చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రిని ఆదేశించింది. ప్రైవేట్ హాస్పిటళ్లలో కృత్రిమ గర్భధారణ వల్ల జన్మించిన ప్రతి శిశువు డీఎన్ఏ ప్రొఫైల్‌ను తయారీ చేసి ఇచ్చేలా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. -
స్మాల్ క్యాప్ కంపెనీల షేర్ల ధరల్లో అవకతవకలు
న్యూఢిల్లీ: పెద్ద ఎత్తున ఎస్ఎంఎస్లు పంపిణీ చేయడం ద్వారా ఐదు స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్లలో మ్యానిపులేషన్‌కు పాల్పడినందుకు 135 సంస్థలపై సెబీ చర్యలు తీసుకుంది. అడ్డంగా సంపాదించినందుకు రూ.126 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు సెక్యూరిటీస్ మార్కెట్లోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్, 7ఎన్ఆర్ రిటైల్ లిమిటెడ్, డార్జిలింగ్ రోప్‌వే కంపెనీ లిమిటెడ్, జీబీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విషాల్ ఫ్యాబ్రిక్స్ షేర్లను కొనుగోలు చేయాలంటూ ఆయా సంస్థలు ఇన్వెస్టర్లకు ఎస్ఎంఎస్లు పంపించినట్టు సెబీ గుర్తించింది. మూడు పెద్ద బృందాలు కలసికట్టుగా ఈ ముందస్తు పథకాన్ని నడిపించినట్టు పేర్కొంది. ‘‘ఈ పథకంలో భాగంగా ముందు ఆయా షేర్ల ధరలను పెంచుతూ వెళ్లారు. మానిపులేటివ్ ట్రేడ్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించారు. షేరు ధర పెరుగుతుంటే రిటైల్ ఇన్వెస్టర్లలో సాధారణంగా ఆసక్తి ఏర్పడుతుంది. ధరలను పెంచిన తర్వాత బై కాల్స్ ను ప్రసారం చేశారు. హనీఫ్ షేక్ అనే వ్యక్తి సూత్రధారిగా దీన్ని నడిపించాడు. బై కాల్స్ చూసి రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు రావడంతో వీరు తమవద్దనున్న షేర్లను అధిక ధరల వద్ద అమ్ముకుని బయటపడ్డారు. తద్వారా భారీ లాభాలను ఆర్జించారు’’అని సెబీ పేర్కొంది. -
భారత్‌పేతో జాగ్రత్త! అలాంటి పనులు చేస్తే జైలుకే?
న్యూఢిల్లీ: అవకతవకలు, దుష్ప్రవర్తన ఆరోపణలపై పలువురు ఉద్యోగులు, వెండార్లను తొలగించినట్లు, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు పేమెంట్స్ సేవల స్టార్టప్ సంస్థ భారత్‌పే వెల్లడించింది. అలాగే మాజీ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ పేరు ప్రస్తావించకుండా, ఆయనకు కేటాయించిన షేర్లను కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. గ్రోవర్ ఎండీగా వ్యవహరించినప్పుడు చోటు చేసుకున్న అవకతవకలు, కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలపై కంపెనీ బోర్డు సవివరంగా చర్చించిన మీదట ఈ చర్యలు తీసుకున్నట్లు భారత్‌పే పేర్కొంది. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు పునరావృతం కాకుండా సీనియర్ మేనేజ్మెంట్, ఉద్యోగులకు కొత్త ప్రవర్తనా నియమావళిని, వెండార్లకు సంబంధించి సమగ్రమైన కొనుగోళ్ల విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించింది. ‘తప్పుడు లేదా అడ్డగోలు రేట్లతో ఇన్వాయిస్లు ఇచ్చిన చాలా మంది వెండార్లు ఇకపై కంపెనీతో వ్యాపార లావాదేవీలు జరపకుండా బ్లాక్ చేశాం. జీఎస్టీ విచారణలో కూడా వీరి పేర్లు ఉన్నాయి. ఇప్పటికే చెల్లించిన మొత్తాలను రికవర్ చేసుకునేందుకు వారికి లీగల్ నోటీసులు కూడా జారీ చేశాం. రాబోయే రోజుల్లో వారిపై సివిల్ / క్రిమినల్ కేసులు కూడా వేయబోతున్నాం‘ అని భారత్‌పే తెలిపింది. కొత్త సీఎఫ్‌వోను ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నామని, తరచుగా అంతర్గత ఆడిట్ కూడా నిర్వహిస్తామని పేర్కొంది. చదవండి: తప్పు చేస్తే సహించేదేలే..! అష్నీర్‌కు భారత్‌పే ఇన్వెస్టర్ల వార్నింగ్! -
ఎస్ఐ పరీక్షలో అక్రమాలు.. మళ్లీ ఎగ్జామ్
బనశంకరి: ఎస్ఐ పరీక్షల్లో అక్రమాలు వెలుగు చూడటంతో ఆ పరీక్షను రద్దు చేసినట్లు హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ మొత్తం 545 ఎస్ఐ పోస్టులకు 2021 ఆగష్టు 3న రాత పరీక్ష నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా 54,289 మంది అభ్యర్దులు హాజరైనట్లు తెలిపారు. అక్రమాలు చోటుచేసుకున్నట్లు విచారణలో వెలుగుచూడటంతో పరీక్షను రద్దు చేశామన్నారు. కొత్తగా పరీక్ష నిర్వహిస్తామని త్వరలో తేదీ ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే ఎంపికైన వారు కూడా పరీక్ష రాయాలన్నారు. ఎస్ఐ పరీక్షలో కుమ్మక్కైన వారికి మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం ఇచ్చేదిలేదన్నారు. ఇకపై పరీక్షల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బ్లూటూత్ వినియోగించి అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ విచారణలో నిర్ధారణ అయ్యిందని, ఇందులో ఎవరు భాగస్వాములైనప్పటికీ విడిచిపెట్టేదిలేదన్నారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది : ప్రియాంక ఖర్గే దివ్యహాగరగి అరెస్ట్‌పై మాజీమంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ఎస్ఐ అభ్యర్థుల నుంచి వసూలు చేసిన కోట్లాదిరూపాయల డబ్బు ఎక్కడికి వెళ్లిందనే దానిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఐడీ బృందం పుణెలో దివ్య హాగరగితో సహా ఆరుగురిని అరెస్ట్‌చేయడాన్ని ప్రియాంక్ ఖర్గే స్వాగతించారు. పరీక్ష కేంద్రాలు కేటాయించడం, డబ్బు ఇచ్చిన అభ్యర్థులకు నిర్దిష్టమైన పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసే సదుపాయం కల్పించడం లాంటి పనులు చేపట్టడం వెనుక ప్రముఖులు ఉన్నారని, వారిపై సీఐడీ విచారణ చేపట్టలేదన్నారు. అసలైన తిమింగలాలను పట్టుకోవాలన్నారు. కింగ్‌పిన్ దివ్య అరెస్ట్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాల కేసులో ప్రధాన సూత్రధారి దివ్య హాగరగి, కలబురిగి జ్ఞానజ్యోతి విద్యాసంస్థ ప్రిన్సిపాల్ కాశీనాథ్, ఇని్వజిలేటర్లు అర్చన, సునంద, ఎస్ఐ అభ్యర్థిని శాంతాబాయి, వీరికి ఆశ్రయమిచ్చిన పారిశ్రామికవేత్త సురేశ్‌ను సీఐడీ ఎస్పీ రాఘవేంద్ర నేతృత్వంలోని బృందం గురువారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని పుణెలో అరెస్ట్ చేసింది. వీరిని శుక్రవారం కలబురిగి సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. గురువారం ఈ కేసులో అరెస్ట్ అయిన జ్యోతి పాటిల్‌ను విచారణ చేపట్టగా దివ్య హాగరగితో పాటు ఐదుగురు పుణెలో తలదాచుకున్నట్లు సమాచారం అందించారు. గురువారం రాత్రి సీఐడీ బృందం మహారాష్ట్రకు వెళ్లి ఐదుగురిని అరెస్ట్ చేసింది. కస్టడీకి నిందితులు.. దివ్యతోసహా ఆరుగురిని వైద్య పరీక్షల అనంతరం శుక్రవారం కలబురిగి ఒకటవ అదనపు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 11 రోజుల కస్టడీకి అనుమతించింది. ఇక, దివ్య హాగరగితోసహా ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయంపై రాష్ట్ర డీజీపీ ప్రవీణ్‌సూద్ సీఎం బసవరాజ బొమ్మైకి సమాచారం అందించారు. ఆర్టీ.నగరలో ఉన్న సీఎం నివాసానికి ప్రవీణ్‌సూద్ విచ్చేసి వివరాలు తెలియజేశారు. ఈ కేసులో ఎవరు భాగస్వాములైనప్పటికీ చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. -
ఏపీలోని 17 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలు: రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ
అమరావతి: ఏపీలోని17 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల అవకతవకలు జరిగినట్లు గుర్తించామని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరిబాబు తెలిపారు.10 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.5.25 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని శేషగిరిబాబు వెల్లడించారు. ఇప్పటికే రూ.కోటి రికవరీ చేశామని, అవకతవకలపై ఆరుగురు సబ్రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశామని అన్నారు. మిగతా సబ్రిజిస్ట్రార్లపై విచారణ జరుగుతోందన్నారు. అవకతవకలు జరిగిన చోట్ల కేసులు నమోదు చేయిస్తున్నామని ఐజీ శేషగిరిబాబు అన్నారు. 2021 ఏప్రిల్ నుంచి జులై వరకు 54 నకిలీ చలానాలు గుర్తించినట్లు తెలిపారు. నకిలీ చలానాలతో రూ.7లక్షల మేర గోల్మాల్ జరిగినట్టు నిర్ధారించారు. చలానాల గోల్‌మాల్‌లో డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పొన్నూరు, భీమవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీలు చేపట్టింది. కాగా తణుకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రూ.54,100 అనధికార నగదు స్వాధీనం చేసుకున్నారు. -
ఇదేందయ్యా ఇది.. ఇదెప్పుడూ చూడలా!
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా నరసింగ పాడు గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలో వార్డు అభ్యర్థులిద్దరు గుర్తులు తారుమారయ్యాయని రగడ నెలకొంది. అధికారులు రంగంలోకి దిగి ఆరా తీయగా.. ఇద్దరు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్ని వారే పొరపాటు పడి ఒకరి గుర్తును మరొకరు ప్రచారం చేసుకున్నారు. వారికి అధికారికంగా కేటాయించిన అసలు గుర్తులేమిటో అధికారులు వివరించడంతో నాలుక్కరుచుకోవడం అభ్యర్థుల వంతయ్యింది. అభ్యర్థుల్లో ఒకరైన సకినాల ఏడుకొండలుకు గౌను, మరో అభ్యర్థి పొదిలి వెంకటేశ్వర్లుకు ప్రెషర్ కుక్కర్‌ను అధికారులు కేటాయించగా.. అభ్యర్థులు పొరబడి పోటీ అభ్యర్థి గుర్తును తమదిగా ప్రచారం చేసుకున్నారు. (చదవండి: ఓటమిని జీర్ణించుకోలేక రోడ్డును తవ్వేశారు!) ప్రజా తీర్పును వక్రీకరిస్తావా? -
జీవీకే గ్రూప్ ఆడిటర్ల రాజీనామా
హైదరాబాద్: ఆర్థిక అవకతవకలకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఇన్ఫ్రా దిగ్గజం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తాజాగా మరో పరిణామం ఎదురైంది. ఆడిటింగ్‌లో కంపెనీ సహకరించడం లేదంటూ ప్రైస్ వాటర్‌హౌస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకుంది. వివిధ అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ పలు మార్లు కోరినప్పటికీ కంపెనీ ఇవ్వడం లేదంటూ, ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆడిటింగ్ సంస్థ ఆగస్టు 13న లేఖ ద్వారా రాజీనామా ప్రతిపాదన పంపినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీవీకే తెలియజేసింది. -
అధ్యక్ష ఎన్నికల వాయిదాకు సంకేతాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్ష ఎన్నికల్ని వాయిదా వేసే ప్రతిపాదనల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ జాప్యం జరుగుతుందన్న సంకేతాలు పంపుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో మెయిల్ ద్వారా వేసే ఓట్లలో భారీగా అవకతవకలు చోటు చేసుకుంటాయని ఆరోపించారు. ఈ ఏడాది నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే అమెరికాలో ఎన్నికల్ని వాయిదా వెయ్యడం అంత సులభం కాదు. అమెరికా రాజ్యాంగంలో జాప్యం అన్న పదానికే చోటు లేదు. అయినప్పటికీ ట్రంప్ గురువారం ‘‘దేశ చరిత్రలోనే 2020 ఎన్నికల్లో కచ్చితత్వం లోపిస్తుందని, భారీగా అవకతవకలు జరుగుతాయి. దీనివల్ల అమెరికా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి’’ అని ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల్లో ఎక్కువ మంది మెయిల్ ఇన్ ఓటింగ్ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. మెయిల్ ద్వారా ఓటు వేసే ప్రక్రియలో విదేశీ హస్తం ఉంటుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా సురక్షితంగా ఓటేసే పరిస్థితులు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా వేస్తే ఏమవుతుంది ? అని ట్రంప్ ఆ ట్వీట్లో ప్రశ్నించారు. -
ఉస్మానియాలో రిపోర్టుల తారుమారు!
బషీరాబాద్: అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన ఓ యువకుడికి కోవిడ్ పాజిటివ్ వచ్చిం దని వైద్యులు చెప్పడంతో కుప్పకూలిపోయా డు. అనుమానం వచ్చి ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌గా తెలిం ది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన మేఘనాథ్ గౌడ్ విద్యావాలంటీర్. ఈ నెల 3న అనారోగ్యంతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పడంతో అతడికి వైద్యులు కరోనా పరీక్ష చేయగా.. ఈ నెల 7న రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. దీంతో బాధితుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రిపోర్టులో ఫోన్ నంబర్, ఇంటి పేరు తప్పు గా ఉండటంతో అనుమానం వచ్చి నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా కరోనా నెగెటివ్‌గా తేలింది. అతడికి కరోనా లేదని, నిమోనియా తో బాధపడుతున్నారని అక్కడి వైద్యులు తెలి పారు. ఇదే విషయమై ఉస్మానియా వైద్యులను కుటుంబసభ్యులు నిలదీయగా పొరపాటున తారుమారయ్యాయని చెప్పి చేతులు దులుపుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన తమ్ముడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, సమయానికి చికిత్స అందక ఆరోగ్యం క్షీణించిందని, ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నామని, రూ.11 లక్షలు ఖర్చయిందని, ఇంకా రూ.15 లక్షల వరకు అవుతుందని వైద్యులు చెప్పారన్నారు. దాతలు తమను ఆదుకోవాలని కోరారు. -
పింఛన్లలో ‘వంచన’!
సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’పింఛన్ల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లను కొల్లగొట్టినట్లు తేల్చింది. పండుటాకులకు ఆపన్నహస్తం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకంలో 14,975 మంది అక్రమంగా పింఛన్లను పొందుతున్నట్టు పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) విచారణలో వెల్లడైంది. సామాజిక భద్రత పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు బీడీ, చేనేత, గీత కార్మికులు, ఫైలేరియా, ఎయిడ్స్ బాధితులకు రూ.2,016, వికలాంగులకు రూ.3,016 చొప్పున నెలవారీగా పింఛన్‌ను పంపిణీ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 39,29,753 మంది లబ్ధిదారులకు పింఛన్లను ఇస్తుండగా, ఇందులో 60 ఏళ్లు పైబడిన 12,86,363 మంది వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లను ప్రభుత్వం అందజేస్తోంది. వీటి మంజూరులో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడం తో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన సర్కారు.. కొన్ని చోట్ల కుటుంబంలోని దంపతులిద్దరికీ వృద్ధాప్య పింఛన్లు అందుతున్నట్లు గుర్తించింది. నిబంధనల ప్రకారం ఇద్దరిలో ఒకరికి మాత్రమే పింఛన్ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇందుకు భిన్నంగా రాష్ట్రవ్యాప్తంగా 14,975 మంది గత కొన్నేళ్లుగా పింఛన్ సొమ్ము పొందుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేల్చింది. దీంతో ఇలా అక్రమంగా పింఛన్ తీసుకున్న లబ్ధిదారుల నుంచి సొమ్ము రికవరీ చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో విచారణ ఆధార్, ఇతరత్రా డాక్యుమెంట్ల ఆధారంగా డబుల్ పింఛన్ పొందిన లబ్ధిదారుల జాబితాను సేకరించిన ప్రభుత్వం.. దీని ఆధారంగాక్షేత్రస్థాయిలో నిగ్గు తేల్చడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ నెల 10 వరకు గుర్తించిన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి విచారణ జరపాలని ఆదేశించింది. విచారణ బాధ్యతలను గ్రామ పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్, గ్రామ రెవెన్యూ అధికారులకు అప్పగించింది. విచారణ అనంతరం అనర్హుల వివరాలను అందజేయాలని, వారి నుంచి సొమ్ము రికవరీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ‘కాటి’కి వెళ్లిన వారివీ లూటీ! పోస్టాఫీసులు, బ్యాంకు ఖాతాల ద్వారా పంపిణీ చేస్తున్న పింఛన్లు కూడా పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వ అంతర్గత విచారణలో తేలింది. చాలాచోట్ల లబ్ధిదారుల జాబితాలో నుంచి మృతుల పేర్లు తొలగించకపోవడంతో.. వీరి పేరిట జమవుతున్న సొమ్ము నొక్కేస్తున్నట్లు గుర్తించింది. బయోమెట్రిక్ సంతకంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులే ఈ డబ్బు లు స్వాహా చేస్తున్నట్లు తేల్చింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 91,442 మందికి సంబంధించిన పింఛన్లను పరిశీలించిన అధికారులు.. ఇందులో 1,792 మంది చనిపోయినట్లు నిర్ధారించారు. వీరిలో 522 మంది పేరిట పింఛన్ డబ్బులు డ్రా అయినట్లు గమనించారు. మరణించిన లబ్ధిదారుల పేరుతో గ్రామపంచాయతీ కార్యదర్శులు మొత్తం రూ.94.96 లక్షలు విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ నిధులను కార్యదర్శుల నుంచి వసూలు చేయడమేగాకుండా శాఖాపరమైన చర్యలు తీసు కోవాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. రిక‘వర్రీ’ ప్రభుత్వ తాజా ఆదేశాలతో కుటుంబంలో ఇద్దరు పింఛన్లు తీసుకుంటున్న వృద్ధుల్లో కొత్త ఆందోళన ప్రారంభమైంది. ఇద్దరిలో ఒకరే తీసుకోవాలనే నిబంధనపై అవగాహన లేకపోవడంతో పాటు ప్రభుత్వం ఇస్తోంది కదా అని తీసుకున్న లబ్ధిదారులు.. ఇప్పుడు సొమ్ము వాపస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుండటంతో కలవరానికి గురవుతున్నారు. ఈ అక్రమ బాగోతంలో అధికారుల పాత్ర కూడా ఉన్నప్పటికీ, వారిని పక్కనపెట్టి కేవలం లబ్ధిదారులనే బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద అందజేస్తున్న ఆసరా పింఛన్ల వివరాలు.. వృద్ధులు: 12,86,363 వికలాంగులు: 4,98,565 వితంతువులు: 14,52,545 చేనేత కార్మికులు : 37,569 గీత కార్మికులు: 63,162 హెచ్ఐవీ బాధితులు: 33,229 బోదకాలు వ్యాధిగస్తులు: 14,403 బీడీ కార్మికులు: 4,08,755 ఒంటరి మహిళలు: 1,35,162 -
ముసాయిదా ఓటర్ల జాబితాలో అవకతవకలు
సాక్షి, న్యూఢిల్లీ: ఈనెల 10న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో తీవ్రమైన అవకతవకలు ఉన్నాయని, దాదాపు 30 లక్షల ఓట్లు పునరావృతం అయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా మరో 18 లక్షల ఓట్లు తెలంగాణలో, ఏపీలో రెండు చోట్లా నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్లు సహా ఎన్నికల అధికారులకు శుక్రవారం ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘30 లక్షలు డూప్లికేట్ ఉన్నాయి. అంటే మొత్తం ఓటర్లతో పోలిస్తే 12 శాతం. ఇది చిన్న సంఖ్య కాదు. ఆంధ్ర, తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో రెండు చోట్లా కొనసాగుతున్నవి 18 లక్షల ఓట్లు ఉన్నాయి. 20 లక్షల ఓట్లను తొలగించారు. ఎన్నికల సంఘం అధికారులు కూడా మేం చెప్పిన వాటిని ఇంచుమించుగా ఒప్పుకొన్నారు. వారి దృష్టికి కూడా వచ్చినట్లు చెప్పారు. సీడాక్ సంస్థతో తనిఖీ చేయిస్తున్నామని ఈసీ చెప్పింది. జంధ్యాల రవిశంకర్ తన పరిశోధక బృందంతో విశ్లేషించి ఈ అవకతవకలను తేల్చారు’అని శశిధర్‌రెడ్డి వివరించారు. 2019 జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకొని జారీచేసిన షెడ్యూలును రద్దు చేశారని, ఆ షెడ్యూలు ప్రకారం ముందుకెళ్తే ఈ అవకతవకలను తొలగించొచ్చని చెప్పారు. కానీ 2018 జనవరి 1వ తేదీని ప్రామాణికంగా స్వల్పకాలిక సవరణలు చేపడుతున్నారని, దీంతో పొరపాట్లను సరిదిద్దడం సాధ్యం కాదని వివరించారు. అవకతవకలన్నీ ఉద్దేశపూర్వకంగా జరిగినవేనని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అవకతవకలున్నా ముందస్తుకా..? ‘30 లక్షల ఓట్ల డూప్లికేషన్ తొలగించాలంటే చాలా సమయం పడుతుంది. సక్రమంగా లేవని తెలిసి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఎంతమేరకు సమంజసం. అసెంబ్లీ రద్దయినప్పుడు ముందస్తుగా వెళ్లాల్సిందే. కానీ ఈ అవకతవకలను సరిచేయకుండా సీఎం చెప్పినట్లు నవంబర్, డిసెంబర్లలో ఎన్నికలు పూర్తయితే ఈ అవకతవకలను ఎలా సరిచేస్తారు.. దేశంలో ఇదో ఆశ్చర్యకరమైన విషయం. ఎన్నికల సంఘం న్యాయంగా ఎన్నికలు నిర్వహించాలి. ఇన్ని తప్పిదాలు ఆధారాలతో చూపించినప్పుడు వాటిని సరిచేయాలి. ఇందుకు చాలా సమయం పడుతుంది. ఇంత స్వల్ప సమయం సరిపోదు’అని పేర్కొన్నారు. ఎన్నికలను వాయిదా వేయాలంటారా అని ప్రశ్నించగా, ‘అవకతవకలను సరిచేయడానికి సమయం కావాలని అడుగుతున్నాం’అని బదులిచ్చారు. పూర్తి ఆధారసహితంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వివరించినట్లు జంధ్యాల రవిశంకర్ చెప్పారు. ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని, శనివారం జాతీయ మీడియా ముందు నిరూపిస్తామని పేర్కొన్నారు. ‘30 లక్షల్లో 40 వేల మంది 18 ఏళ్లకంటే తక్కువగా ఉన్నారు. ఇది మొదటి తప్పు. భర్తపేరుతో ఒకసారి, తండ్రిపేరుతో మరోసారి ఉన్నవారు, సున్నా వయసు నుంచి 250 ఏళ్ల వయసు ఉన్న వారూ ఉన్నారు. పురుషుడు అని ఒకపేరుతో ఉన్నవి, అదే పేరుతో స్త్రీగా నమోదు చేశారు. పునరావృతమైన పేర్లు 15 లక్షలు ఉన్నాయి’అని చెప్పారు. -
ఆస్పత్రిలో చిన్నారుల తారుమారు
నాచారం:నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బుధవారం ఉదయం జన్మించిన చిన్నారులు తారుమారు కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెలితే... బుధవారం ఉదయం ఏఎస్రావునగర్కు చెందిన శివకుమార్, అఖిల దంపతులు, ఎల్బీనగర్కు చెందిన మహే ష్, మనీషారాణి దంపతులు డెలివరీ నిమిత్తం నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి వచ్చారు. అఖిల, మనీషారానిలకు ఆపరేషన్ చేయగా ఇద్దరు మగ శిశువులు జన్మించినట్లు కిందిస్థాయి సిబ్బంది తల్లిదండ్రులకు తెలిపారు. ఇద్దరు చిన్నారులకు పుట్టగానే ట్యాగ్లు వేసి అఖిలకు బిడ్డను చూపించారు. అంతలో మరొకరు వచ్చి ఈ శిశువు మీ శిశువు కాదు పొరపాటు జరిగిందంటూ మరో శిశువును అప్పగించారు. దీంతో వారి కుటుంబసభ్యులు ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగారు. మొదట చూపిన శిశువే తమ శిశువని వాగ్వాదానికి దిగడంతో ఆస్పత్రిలో గందరగోళం నెలకొంది. ఆస్పత్రి వైద్యులు, ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యాన్ని అంగీకరిస్తూ ఎవరి శిశువును వారికి అప్పగిస్తామని చెప్పి చిన్నారులు, వారి తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రుల, చిన్నారుల రక్త పరీక్షలు సరిపోయాయని ఎవరి శిశువును వారికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. అయినా తల్లిదండ్రులకు చిన్నారుల విషయంలో అనుమానం ఉండటంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని పట్టుబట్టారు. ఇందుకు వైద్యులు అంగీకరించడంతో వారు శాంతించారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తాం కింది స్థాయి సిబ్బంది (ఆయాలు) నిర్లక్ష్యం కారణంగా శిశువుల మార్పిడి జరిగింది. శిశువుల చేతికి ఉన్న ట్యాగ్ల ఆధారంగా ఎవరి శిశువులను వారికి అప్పగించాం. అయితే ఈ విషయం లో తల్లిదండ్రులకు అనుమానం వ్యక్తం చేయడంతో రక్త పరీక్షలు నిర్వహించగా, చిన్నారులు వారి తల్లిదండ్రులు నమూనాలు సరిపోయాయి. అయినా వారు అంగీకరించ నందున గురువారం సీసీఎంబీలో చిన్నారులకు డీఎన్ఏ పరీక్ష లు నిర్వహించి ఎవరి శిశువులను వారికి అప్పగిస్తాం. ప్రస్తుతం శిశువులు, తల్లులు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. – ఈఎస్ఐ ఎంఎస్ డాక్టర్ పద్మజ -
షేర్ల ధర అవకతవకలకు పాల్పడే కంపెనీలపై సెబీ చర్యలు
న్యూఢిల్లీ: షేర్ల ధరల్లో అవకతవకలకు పాల్పడే కంపెనీలు, సంబంధిత డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ యోచిస్తోంది. పన్నులు తప్పించుకోవడానికి సెక్యూరిటీల చట్టాన్ని వేలాది కంపెనీలు ఉల్లంఘించాయని సెబీ భావిస్తోంది. అందుకనే షేర్ల ధరల విషయమై అవకతవకలకు పాల్పడే లిస్టెడ్ కంపెనీలు, సంబంధిత డైరెక్టర్లపై తగిన చర్యలు తీసుకునే ప్రయత్నాలను సెబీ చేస్తోంది. ఇలాంటి లావాదేవీల ద్వారా లబ్ది పొందిన వారి వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి సెబీ అందించనున్నది. ఈ అంశాలకు సంబంధించిన ఒక ప్రతిపాదన ఈ వారంలో సెబీ బోర్డ్ ముందుకు రానున్నది. ఆదాయపు పన్ను విభాగం నివేదించిన వివిధ షేర్ల లావాదేవీలపై సెబీ జరిపిన విశ్లేషణ ఆధారంగా సెబీ ఈ ప్రతిపాదనను రూపొందించిందని సమాచారం.వివిధ కేటగిరీల్లో 32వేలకు పైగా కంపెనీలపై తదుపరి విచారణ జరపాలని సెబీ నిర్ణయించిందని ఈ వర్గాలు వెల్లడించాయి. అక్రమంగా లాభాలు ఆర్జించడానికి లిస్టెడ్ కంపెనీలు, ఆపరేటర్లు, సంబంధిత సంస్థలు పలు స్కీమ్‌లను రూపొందించాయని ఐటీ విభాగం సెబీ దృష్టికి తెచ్చింది. దీర్ఘకాల మూలధన లాభాలు(ఎల్టీజీఎస్), స్వల్పకాలిక మూలధన నష్టాలు చూపడానికి షేర్ల ధరల్లో అవకతవకలకు పాల్పడడం ద్వారా స్టాక్ ఎక్సే్చంజ్ ప్లాట్ఫార్మ్ను దుర్వినియోగం చేశారని ఐటీ విభాగం సెబీకి తెలిపింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేర్ల జారీ, లేదా విలీన ప్రక్రియల ద్వారా అక్రమంగా మూలధన లాభాల పన్ను ప్రయోజనాలు పొందారని ఐటీ విభాగం వివరించింది. -
భవిత తారుమారు
ఎస్కేయూ : చక్కగా పరీక్షలు రాశాం.. మెరుగైన ఫలితాలు సాధిస్తాం.. అని డిగ్రీ సెకెండ్ సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులందరూ తమ భవితవ్యాన్ని గొప్పగా ఊహించుకున్నారు. తీరా ఫలితాలు తారుమారు కావడంతో ఆశలన్నీ అడియాసలయ్యాయి. శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం రెగ్యులర్ డిగ్రీ పరీక్షల విభాగం అస్తవ్యస్తంగా తయారైందన్నదానికి ఇదీ నిదర్శనం. ఫలితాల జాబితాలో చూస్తే పరీక్షలకు హాజరైనా గైర్హాజరు అయినట్లు చూపుతోంది. విద్యార్థులు తమ సబ్జెక్టులను రీవ్యాల్యుయేషన్ పెట్టించాలా.. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలా? అన్నదానిపై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈనెల 30న తుది గడువు ముగియనుంది. యూజీ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా తయారైంది. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ రెండో సెమిస్టర్ (రెగ్యులర్ ఫలితాలు) శనివారం విడుదల చేశారు. ఫలితాలు తారుమారు కావడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. పరీక్షలకు హాజరైన గైర్హాజరు అయినట్లు ఫలితాలు ప్రకటించడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కొందరు అగళి డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ కళాశాల అనంతపురం విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఫలితాలు ప్రకటించారు. యూజీ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ఫలితాలు తారుమారు అయ్యాయని కళాశాల అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతేడాది నుంచి ఇలాంటి తప్పిదాలు పునరావృతం అవుతున్నా.. ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో యూజీ విభాగం అధికారుల్లో జవాబుదారీతనం కొరవడింది. ఒక సబ్జెక్టుకు బదులు మరో సబ్జెక్టు : డిగ్రీ మొదటి, రెండు, మూడో సంవత్సరం రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయేషన్‌కు విద్యార్థులు ఫీజు కట్టిన సబ్జెక్టు కాకుండా మరో సబ్జెక్టుకు రీవాల్యుయేషన్ చేశారు. దీంతో వేలాది మంది విద్యార్థులు ఎస్కేయూ యూజీ విభాగం వద్ద పడిగాపులు కాస్తున్నారు. తీరా యూజీ విభాగం అధికారుల దృష్టికి తీసుకువస్తే ఫీజు చెల్లించిన చలానాలు చూపిస్తే.. రీవాల్యుయేషన్‌కు జవాబు పత్రాలు పంపుతున్నారు. వేలాది ఫెండింగ్ కేసులు ఇలాంటివి ఉన్నాయి. అయితే డిగ్రీ రెగ్యులర్, రీవాల్యుయేషన్లో ఫెయిల్ అయినవారు సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెలాఖరులోపు సప్లిమెంటరీ ఫీజు కట్టాలని నిర్దేశించారు. పెండింగ్‌లో రీవాల్యుయేషన్ ఫలితాలు ప్రకటించకపోవడంతో విద్యార్థులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఇంటర్నల్ మార్కులు పంపలేదు ఆయా కళాశాలలు విద్యార్థుల ఇంటర్నల్ మార్కులు పంపకపోవడంతో ఫలితాలు ప్రకటించలేదు. ఎన్నో సార్లు హెచ్చరించినప్పటికీ కళాశాలల యాజమాన్యాలు అప్రమత్తం కాలేదు. ఇంటర్నల్ మార్కులు అందగానే ఫలితాలు సవరిస్తాం. – శ్రీరాములు నాయక్, డిప్యూటీ రిజిస్ట్రార్, ఎస్కేయూ యూజీ విభాగం -
మారిన ఫిజిక్స్ ప్రశ్నపత్రం
ఎచ్చెర్ల: బీఆర్ఏయూలో శుక్రవారం నిర్వహించిన ఫిజిక్స్ పరీక్షలో ప్రశ్నపత్రం తారుమారైంది. ఫిజిక్స్ ప్రశ్నపత్రానికి బదులు బీబీఎం కోర్సుకు సంబంధించిన సేల్స్మేనేజ్మెంట్ ప్రశ్నపత్రం ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. తప్పిదాన్ని గుర్తించిన వర్సిటీ అధికారులు వెంటనే ప్రశ్నపత్రాలను వెనుకకు తీసుకున్నారు. వర్సిటీ పరీక్ష కేంద్రంగా డిగ్రీ చివరి ఏడాదిలో ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన 761 మంది విద్యార్థులకు ఇన్స్టెంట్ పరీక్ష నిర్వహించారు. వీరిలో 752 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫిజిక్స్ సబ్జెక్టులో 73 మంది ఫెయిల్ కాగా 69 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. ఫిజిక్స్ ప్రశ్నపత్రాలు అని రాసి ఉన్న బండిల్స్‌ను తెరచి ఇన్విజిలేటర్లకు వర్సిటీ అధికారులు అందజేశారు. అందులో ఫిజిక్స్-3 ప్రశ్నపత్రంకు బదులుగా బీబీఎం కోర్సుకు సంబంధించిన సేల్స్ మేనేజ్మెంట్ ప్రశ్నపత్రం ఉంది. వీటిని చూసుకోకుండా విద్యార్థులకు అందజేయడంతో సమస్యతలెత్తింది. అధికారులు అందజేసిన సేల్స్ మేనేజ్మెంట్ సబ్జెక్టు ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వారి జాబితాలో సైతం లేదు. ఈ ప్రశ్న పత్రాలు పెద్దమొత్తంలో ప్రచురించి ఎలా అందజేశారన్నది చర్చనీయాంశంగా మారింది. అదనపు సెట్ లు సైతం పరీక్షల నిర్వహణ కేంద్రంలో అందుబాటులో లేవు. దీంతో డిజైన్ ప్రశ్నపత్రాన్ని జిరాక్సులు తీసి విద్యార్థులకు అంజేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 11.30కు ఆరంభం కావడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. అధికారులు అదనపు సమయం కేటాయించినా సాయంత్రం ఫిజిక్స్-4 పరీక్ష రాసేందుకు ఇబ్బంది పడ్డారు. తొందరలో ఏమరపాటు... డిగ్రీ చివరి ఏడాది ఒక్క సబ్జెక్టులో ఫెయిలైన విద్యార్థులందరికీ శుక్రవారం పరీక్ష నిర్వహించి శనివారం ఫలితాలు వెల్లడించేందుకు వర్సిటీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈనెల 3 నుంచి పీజీ ప్రవేశాలకు సంబంధించిన ఆసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ లోపు విద్యార్థులకు డిగ్రీ ప్రొవిజనల్స్, మార్కులు జాబితాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రయత్నంలో ఫిజిక్స్ ప్రశ్నపత్రం మారడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. మిగిలిన సబ్జెక్టుల విద్యార్థులు సజావుగా పరీక్షను పూర్తిచేశారు. పరీక్షలను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు, ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజులు పర్యవేక్షించారు. -
ర్యాంకులు ఉల్టా పల్టా!
* తెలంగాణ, ఏపీ ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు తారుమారు * ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్‌కు ఏపీలో ఏడో ర్యాంకు * ఏపీలో ఫస్ట్ ర్యాంకర్‌కు తెలంగాణలో పదో ర్యాంకు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఎంసెట్ లో టాప్ ర్యాంకులు తారుమారయ్యాయి! ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థికి తెలంగాణ ఎంసెట్‌లో పదో ర్యాంకు లభించగా.. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో ఒకటో ర్యాంకు సాధించిన విద్యార్థికి ఏపీలో 7వ ర్యాంకు వచ్చింది. అగ్రికల్చర్ అండ్ మెడికల్(ఎంబీబీఎస్, బీడీఎస్ మినహా) ఎంసెట్‌లోనూ ఇదే పరిస్థితి. తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో ఒకటో ర్యాంకు సాధించిన విద్యార్థికి ఏపీలో 100వ ర్యాంకు లభించింది. ఇదే విభాగంలో తెలంగాణ ఎంసెట్‌లో పదో ర్యాంకు సాధించి న విద్యార్థికి ఏపీలో 193వ ర్యాంకు వచ్చింది. ఇటీవల ఏపీ ఎంసెట్ ఫలితాలను ప్రకటించగా.. గురువారం తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ ఎంసెట్ రాసిన అనేక మంది విద్యార్థులు ఏపీ ఎంసెట్ కూడా రాశారు. ఏపీ ఎంసెట్ రాసిన వారిలో చాలామంది తెలంగాణ ఎంసెట్‌కు హాజరయ్యారు. రెండుచోట్లా తొలి పది స్థానాల్లో నిలిచినవారికి తెలంగాణలో వచ్చిన ర్యాంకు ఏపీలో రాలేదు.. ఏపీలో వచ్చిన ర్యాంకు తెలంగాణలో రాలేదు. వీరివే కాదు ఇలా అనేక మంది విద్యార్థుల ర్యాంకులు మారిపోయాయి. మెడికల్ టాపర్ల మనోగతం గ్రామాల్లో సేవ చేస్తా: ప్రదీప్ గాలివీడు: ఏపీలోని వైఎస్సార్ జిల్లాకు చెందిన బొజ్జల ప్రదీప్ కుమార్ రెడ్డి తెలంగాణ మెడికల్‌లో తొలి ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. రాయచోటి నియోజకవర్గం గాలివీడుకు చెందిన బొజ్జల నారాయణరెడ్డి, అంజనమ్మ దంపతుల కుమారుడైన ప్రదీప్ ఇంటర్లో ఏపీలో రెండో ర్యాంకు సాధించాడు. ఇటీవలి ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాల్లో 100వ ర్యాంకు సాధించాడు. తండ్రి టీచర్ కాగా తల్లి గృహిణి. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. కార్డియాలజిస్టుగా గ్రామాల్లో పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం’’ అని ప్రదీప్ ‘సాక్షి’కి తెలిపాడు. ఎయిమ్స్‌లో సీటే లక్ష్యం..: అర్బాజ్ కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన మహ్మద్ అర్బాజ్ తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మెడికల్ విభాగంలో మూడో ర్యాంకు సాధించాడు. ఏపీ ఎంసెట్‌లో 48వ ర్యాంకు సాధించిన అర్బాజ్, ఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు సాధించడమే తన లక్ష్యమని తెలిపాడు. ఇంటర్‌లోనూ ప్రతిభావంతురాలు హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెందిన ఉప్పల ప్రణతి మెడికల్ విభాగంలో రాష్ట్రంలో నాలుగో ర్యాంకు సాధించింది. పదో తరగతి, ఇంటర్‌లోనూ ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. తల్లి హేమలత గృహిణి కాగా తండ్రి హైటెక్ సిటిలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పదో తరగతిలో 9.8 గ్రేడ్ తెలంగాణ ఎంసెట్ మెడికల్ విభాగంలో ఐదో ర్యాంకు సాధించిన యజ్ఞప్రియ ఇటీవలి ఏపీ ఎంసెట్‌లో మూడో ర్యాంక్ సాధించింది. వీరిది మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట. తండ్రి సత్యనారాయణరెడ్డి హైదరాబాద్‌లో సాగునీటి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. యజ్ఞప్రియ పదో తరగతిలో 9.8 గ్రేడ్ మార్కులు, ఇంటర్లో 975 మార్కులు సాధించింది. మంచి డాక్టర్నవుతా: జలీలి హైదరాబాద్ పాతబస్తీ నూర్‌ఖాన్‌బజార్‌కు చెందిన జీషాన్ అహ్మద్ జలీలి ఎంసెట్ మెడికల్‌లో 6వ ర్యాంక్ సాధించాడు. మంచి వైద్యునిగా ఎదుగుతానని అతను చెప్పాడు. జీషాన్ తండ్రి డాక్టర్ ఖలీం అహ్మద్ జలీలి నిజాం కాలేజీలో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగా తల్లి అంజుమ్ ఫాతిమా యాకత్పురా ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్. జీషాన్ అక్క మరియా డాక్టర్. సోదరుడు హరూన్ అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు.