హైదరాబాద్: ఆర్థిక అవకతవకలకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఇన్‌ఫ్రా దిగ్గజం జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి తాజాగా మరో పరిణామం ఎదురైంది. ఆడిటింగ్‌లో కంపెనీ సహకరించడం లేదంటూ ప్రైస్ వాటర్‌హౌస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకుంది. వివిధ అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ పలు మార్లు కోరినప్పటికీ కంపెనీ ఇవ్వడం లేదంటూ, ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆడిటింగ్ సంస్థ ఆగస్టు 13న లేఖ ద్వారా రాజీనామా ప్రతిపాదన పంపినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీవీకే తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment