GVK Power and Infrastructure
-
జీవీకే గ్రూప్ ఆడిటర్ల రాజీనామా
హైదరాబాద్: ఆర్థిక అవకతవకలకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఇన్ఫ్రా దిగ్గజం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తాజాగా మరో పరిణామం ఎదురైంది. ఆడిటింగ్‌లో కంపెనీ సహకరించడం లేదంటూ ప్రైస్ వాటర్‌హౌస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకుంది. వివిధ అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ పలు మార్లు కోరినప్పటికీ కంపెనీ ఇవ్వడం లేదంటూ, ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆడిటింగ్ సంస్థ ఆగస్టు 13న లేఖ ద్వారా రాజీనామా ప్రతిపాదన పంపినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీవీకే తెలియజేసింది. -
జీవీకే పవర్‌కి మళ్లీ నష్టాలే
సాక్షి,ముంబై: మౌలిక రంగ సంస్థ జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యూ2 లో నిరాశజనకఫలితాలను నమోదు చేసింది. శనివారం ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2)లో ఫలితాల్లో మరోసారి ఢమాల్ అందింది. ఈ క్వార్టర్లో కూడా రూ. 77 కోట్ల (76.94 కోట్ల రూపాయలు) నికర నష్టాలను ప్రకటించింది. గతేడాది క్యూ2లో రూ. 13.4 కోట్ల నష్టం మాత్రమే. అయితే ఆదాయంలో స్వల్ప పురోగతిని సాధించింది. మొత్తం ఆదాయం రూ. 18.55 కోట్ల నుంచి రూ. 20,16 కోట్లకు పెరిగింది. కంపెనీ ఎండీ పదవికి జీవీకే రెడ్డి చేశారని ప్రకటించింది. అయితే బోర్డులో నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జీవీకే రెడ్డి బాధ్యతలు నిర్వహించనున్నారని చెప్పింది. ఈయన రాజీనామాను బోర్డు ఆమోదించిందనీ జీవీకే పవర్ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే పీవీ ప్రసన్నరెడ్డి హోల్‌టైమ్ డైరెక్టర్‌గా నియమించేందుకు బోర్డు అనుమతించిందని తెలిపింది. నవంబరు11నుంచి మూడేళ్లపాటు ఎలాంటి వేతనం లేకుండా ఆయన పనిచేస్తారని పేర్కొంది. -
జీవీకే పవర్ నష్టం రూ. 51 కోట్లు
న్యూఢిల్లీ: మౌలిక రంగ సంస్థ జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 51 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం క్యూ1లో ఇది రూ. 3 కోట్లు. మరోవైపు తాజాగా ఆదాయం రూ. 6.62 కోట్ల నుంచి రూ. 6.81 కోట్లకు పెరిగినట్లు సంస్థ తెలిపింది. అటు ఈ ఏడాది జూన్ 30 నాటికి జీవీకే కోల్ డెవలపర్స్ (సింగపూర్) తీసుకున్న రూ. 7,843 కోట్ల మేర రుణాలకు పూచీకత్తు ఇచ్చినట్లు, వివిధ పెట్టుబడులపై రూ. 295 కోట్ల మేర నిధులు రావాల్సి ఉందని కంపెనీ పేర్కొంది. బొగ్గు ధరల పతనం కారణంగా ఆస్తులకు మించి రుణభారంతో సతమతమవుతున్న జీవీకే కోల్ త్వరలో కోలుకోగలదని ఆశాభావం వ్యక్తం చేసింది. -
ప్రమోటర్ల చేతులు మారిన జీవీకే పవర్ షేర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాకు చెందిన వ్యక్తిగత ప్రమోటర్లు, ప్రమోటింగ్ కంపెనీల మధ్య షేర్లు చేతులు మారాయి. అంతర్గత బదిలీ లావాదేవీల తర్వాత జీవీకే పవర్లో ప్రమోటింగ్ కంపెనీ వెర్టెక్స్ ప్రాజెక్ట్స్ వాటా 23.35 శాతం నుంచి 8.91 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో జి. ఇందిరా కృష్ణారెడ్డి వాటా 8.34 శాతం నుంచి 14.59 శాతానికి పెరిగితే, జి. అపర్ణా రెడ్డి వాటా 0.40 శాతం నుంచి 4.79 శాతానికి, షాలినీ భూపాల్ వాటా 0.40 శాతం నుంచి 3.74 శాతానికి పెరిగింది. అలాగే మరో ప్రమోటింగ్ కంపెనీ గ్రీన్రిడ్జ్ హోటల్స్ వాటా సున్నా నుంచి 0.46 శాతానికి చేరింది. తాజ్ జీవీకే హోటల్స్ లిమిటెడ్‌లో 14.29 శాతం వాటా కలిగిన ప్రమోటర్ షాలినీ భూపాల్ తన వాటాను 0.68 శాతానికి తగ్గించుకున్నారు. -
క్యూఐబీ ద్వారా జీవీకే 1,000 కోట్ల సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ. 694 కోట్ల ఆదాయంపై రూ.235 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 500 కోట్ల ఆదాయంపై రూ. 171 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. తగినంత గ్యాస్ సరఫరా లేక విద్యుత్ ప్రాజెక్టులు పనిచేయకపోవడం, అధిక వడ్డీరేట్లు నష్టాలు పెరగడానికి ప్రధాన కారణంగా కంపెనీ పేర్కొంది. 2013-14 పూర్తికాలానికి రూ. 2,820 కోట్ల ఆదాయంపై రూ. 369 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించగా, అంతక్రితం ఏడాది రూ. 2,608 కోట్ల ఆదాయంపై రూ. 336 కోట్ల నికర నష్టం వచ్చింది. ఎయిర్పోర్ట్ విభాగం తప్ప విద్యుత్, రహదారుల విభాగాలు నష్టాల్లోనే ఉన్నాయి. క్యూ4లో ఎయిర్పోర్ట్ విభాగం లాభాలు రూ. 155 కోట్ల నుంచి రూ. 211 కోట్లకు పెరిగింది. క్యూఐబీకి ఓకే క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్(క్యూఐబీ)కు వాటాలను విక్రయించడం ద్వారా గరిష్టంగా రూ. 1,000 కోట్ల వరకు మూలధనం సమీకరించుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులోనే గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా రూ.500 కోట్లు సేకరించడానికి బోర్డు ఆమోదం తెలిపింది.