సాక్షి,ముంబై: మౌలిక రంగ సంస్థ జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్యూ2 లో నిరాశజనకఫలితాలను నమోదు చేసింది. శనివారం ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2)లో ఫలితాల్లో మరోసారి ఢమాల్ అందింది. ఈ క్వార్టర్‌లో కూడా రూ. 77 కోట్ల (76.94 కోట్ల రూపాయలు) నికర నష్టాలను ప్రకటించింది. గతేడాది క్యూ2లో రూ. 13.4 కోట్ల నష్టం మాత్రమే.
అయితే ఆదాయంలో స్వల్ప పురోగతిని సాధించింది. మొత్తం ఆదాయం రూ. 18.55 కోట్ల నుంచి రూ. 20,16 కోట్లకు పెరిగింది. కంపెనీ ఎండీ పదవికి జీవీకే రెడ్డి చేశారని ప్రకటించింది. అయితే బోర్డులో నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జీవీకే రెడ్డి బాధ్యతలు నిర్వహించనున్నారని చెప్పింది. ఈయన రాజీనామాను బోర్డు ఆమోదించిందనీ జీవీకే పవర్ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే పీవీ ప్రసన్నరెడ్డి హోల్‌టైమ్ డైరెక్టర్‌గా నియమించేందుకు బోర్డు అనుమతించిందని తెలిపింది. నవంబరు11నుంచి మూడేళ్లపాటు ఎలాంటి వేతనం లేకుండా ఆయన పనిచేస్తారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment