Auditors
-
టెక్ ఉద్యోగులకే కాదు.. వీరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు!
ఆర్థిక వ్యవహారాల్లో ఆడిటర్లు, అకౌంటెంట్ల పాత్ర చాలా కీలకం. అయితే వీరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముప్పు పొంచి ఉంది. ఆడిటర్లు, అకౌంటెంట్లు చేస్తున్న పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయగలదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ అన్నారు. సీఏ ఎస్. హరిహరన్ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో సోమనాథన్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నిర్దిష్ట ప్రభావాన్ని కలిగి ఉందన్నారు. వ్యాపార ప్రక్రియలో ఆటోమేషన్‌ను కృత్రిమ మేధస్సు మరింత శక్తివంతంగా చేస్తుందన్నారు. ఆడిటర్లు, అకౌంటెంట్లు చేస్తున్న పనిని కొంచెం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయగలదని ఆయన అన్నారు. (ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్! ఐటీ కంపెనీలదే హవా..) ఇక భారత ఆర్థిక వ్యవస్థలో క్రెడిట్ లెండింగ్ విస్తరణను తాను ఊహించగలనని సోమనాథన్ పేర్కొన్నారు. ‘భారతదేశంలో ప్రైవేట్ రంగానికి జీడీపీలో సుమారు 55 శాతం క్రెడిట్ ఉండగా, చైనాలో ఇది 180 శాతానికి పైగా ఉంది. అయితే ఇది ఆరోగ్యకరమని లేదా వాంఛనీయమని చెప్పను. ఇది జీడీపీలో 100-120 శాతానికి పెరగాలి. ఇది పెట్టుబడి వృద్ధిని వేగవంతం చేస్తుంది’ అన్నారు. ఇప్పటి వరకూ ప్రారంభంకాని ప్రాజెక్ట్‌లు కూడా తగినంత క్రెడిట్ లభిస్తే ప్రారంభమవుతాయన్నారు. అయితే ఎన్పీఏలు లేకుండా క్రెడిట్ పరిమాణాన్ని విస్తరించడం సవాలు అన్నారు. ఈ క్రెడిట్ విస్తరణ అకౌంటెంట్లకు డిమాండ్ పెరగుతుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో భారత్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య నిరంతరం పెరుగుతుందని, 6 నుంచి 7 శాతం వార్షిక విస్తరణను చూడగలమని సోమనాథన్ వివరించారు. ఫలితంగా నిపుణులైన అకౌంటెంట్లకు డిమాండ్ పెరుగుతుందన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి
చెన్నై: భారతదేశం అభివృద్ధి చెందిన దేశ హోదా సాధించడానికి రాబోయే 25 ఏళ్లు ‘క్లిష్టమైనవి’ అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారత్ వృద్ధిలో ఆడిటర్లు కీలక పాత్ర పోషించాల్సన అవసరం ఉందని పేర్కొన్న ఆమె, ఈ బాటలో వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని, చిన్న కంపెనీలు అభివృద్ధి చెందేలా అవగాహన కలి్పంచాలనివిజ్ఞప్తి చేశారు. గత 20–25 ఏళ్లలో దేశం అనేక స్థాయిల్లో పురోగమించిందని, 60 ఏళ్లలో సాధించలేనిది గత దశాబ్దంలో భారత్ సాధించిందని పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్సహా పలు నివేదికలు ఇవే విషయాలను చెబుతున్నాయని అన్నారు. ది సోసైటీ ఆఫ్ ఆడిటర్స్ 90వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి తమిళం– ఇంగ్లీషుల్లో దాదాపు 40 నిమిషాలు మాట్లాడిన ఆమె ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ► నేను ఈ వృత్తిలో (ఆడిటింగ్) ఉన్న అనుభవజు్ఞలతో మాట్లాడుతున్నాను. దశాబ్దాల క్రితం రిజిస్టర్ అయిన సంస్థలలో మీది ఒకటి. మీ అందరితో నా సమావేశం కేవలం 90 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడానికి మాత్రమే కాదు. ఈ వృత్తిలో మీరు మరిన్ని బాధ్యతలను స్వీకరించుకోవాల్సిన సమయంలో నేను మీతో మాట్లాడుతున్నాను. ► ప్రపంచవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్ల విధానాలు చాలా మార్పులకు లోనవుతున్నాయి. ఇక్కడకు వచి్చన ఆడిటర్లలో కొందరు ఇప్పటికే తమ వృత్తిలో నెలకొంటున్న మార్పును గమనించారని నేను భావిస్తున్నాను. ► ఆడిటింగ్ విధానంలో టెక్నాలజీ ఇకపై కీలక భూమికను పోషించనుంది. మీలో చాలా మంది ఈ మార్పును సానుకూలతలో స్వీకరిస్తున్నారు. వచ్చే జూలై నుండి చార్టర్డ్ అకౌంటెంట్ల పరీక్షలు కూడా వేరే ఫార్మాట్లో ఉండబోతున్నాయి. ► రాబోయే 25 ఏళ్లలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి కీలకం. మనలో ప్రతి ఒక్కరూ మీ వృత్తిపై దృష్టి పెట్టడమే కాకుండా దేశానికి మెరుగైన సేవలందించే మార్గాలను అందించండలో ముఖ్యమైన పాత్ర పోషించాలి. ► స్వాతంత్య్ర ఉద్యమంలో చేరడానికి చాలా మంది న్యాయవాదులు తమ వృత్తిని విడిచిపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రోజు మీరు మీ వృత్తిని విడిచిపెట్టాలని ఎవరూ కోరుకోరు. కానీ దేశానికి సేవ చేయడం, దేశ లక్ష్యాల గుర్తింపులో మీరు భాగస్వాములుగా ఉండాలి. మీ వృత్తి కార్యకలాపాల్లో ఇది కూడా ఒక భాగం కావాలి. ప్రతి ఒక్కరూ ‘కర్తవ్యం’ అనే గొప్ప భావాన్ని కలిగి ఉండాలి. భారత్ అభివృద్ధి చెందిన దేశ స్థితికి చేరుకోవడంలో అలాగే దేశం తన గత వైభవాన్ని తిరిగి సాధించడంలో ఉన్న సవాళ్లను ఎదుర్కోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా ఉండాలి. ► 1947కు ముందు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఇళ్లు, ఉద్యోగాలు కోల్పోయిన స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. అలాంటి అవసరం ఈ రోజు తలెత్తబోదు. ప్రతి వృత్తిలోనూ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ.. తద్వారా దీనిని దేశాభివృద్ధికి మిళితం చేయడానికి తగిన కృషి సల్పాలి. ► ఉదాహరణకు, మీరు ఈ రంగంలో మీ పెట్టుబడులను కేటాయించినట్లయితే, మీరు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారని, అది దేశానికి మంచి ఆదాయాన్ని కూడా ఇస్తుందని మీరు మీ ఖాతాదారులకు సలహా ఇవ్వవచ్చు. ఇలాంటి సూచనలు ఇవ్వడం ద్వారా మీరు దేశాభివృద్ధికి తోడ్పడగలరు. ► ప్రభుత్వం ఎక్కడ డబ్బు కోల్పోతున్నారో సంబంధిత అధికారులకు తెలియజేయడం ద్వారా ఆడిటర్లు దేశ పురోగతిలో భాగం పంచుకోవాలి. ► మీరు కంపెనీ పేరు లేదా దానిలో ప్రమేయం ఉన్న వ్యక్తి పేరు చెప్పనవసరం లేదు. ఇది మీ ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. కానీ పన్ను ఏ రూపంలో ఎగవేత జరుగుతోందో మాత్రం మీరు ప్రభుత్వ అధికారులకు తెలియజేయవచ్చు. -
ఆడిటర్లు చట్టబద్ధంగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: ఆడిటర్లు నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడకుండా, విధానపరమైన ప్రక్రియను అనుసరించాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) చైర్పర్సన్ అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే సూచించారు. ఆడిటింగ్ అన్నది కేవలం టిక్ కొట్టే పని మాత్రం కాదన్నారు. పలు కంపెనీల్లో ఆడిటింగ్ లోపాలు బయటపడుతుండడం, ఈ విషయంలో ఆడిటర్లపై నియంత్రణ సంస్థ చర్యలు తీసుకుంటుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై పాండే తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆడిట్ డాక్యుమెంట్లు అన్నవి సరైన విధి విధానాలను అసరించారనే దానికి సాక్ష్యాలుగా పేర్కొన్నారు. ‘‘మేము విలన్‌గా ఇక్కడ లేమని ఆడిటర్ల సమాజానికి నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు సాయం చేయడానికి, వ్యవస్థను మరింత మెరుగుపరచడానికే మేము ఇక్కడ ఉన్నామని తెలియజేస్తున్నాను’’అంటూ పాండే చెప్పారు. ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ (ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను వెల్లడించడం) వ్యవస్థ అనేది ఎంతో ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ఎన్ఎఫ్ఆర్ఏ కిందకు సుమారు 7,000 కంపెనీలు వస్తాయి. అన్‌లిస్టెడ్ కంపెనీలపైనా నియంత్రణ కలిగి ఉంది. యాజమాన్యం లేదా న్యాయ సలహాలపై ఆడిటర్లు ఎక్కువగా ఆధారపడుతున్నట్టు గుర్తించామని చెప్పారు. ‘‘నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడడం, అవసరమైన విశ్లేషణ చేయకపోవడం అన్నది సరికాదు. నిపుణులు చెప్పిన అభిప్రాయానికే మీరు కూడా మొగ్గు చూపించొచ్చు. కానీ, మీరు ప్రామాణిక ఆడిట్ చేసినట్టు అక్కడ పత్రాలు చెప్పాలి. అది ముఖ్యమైనది’’అని సూచించారు. ఆడిట్‌తో మోసాలు వెలుగులోకి చట్టబద్ధమైన ఆడిటింగ్ ప్రక్రియను అనుసరించినప్పుడు మోసాలను గుర్తించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పాండే అన్నారు. ‘‘ఆడిటర్లు మోసాలను అన్ని వేళలా గుర్తిస్తారని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ, మీరు తగిన విధంగా వ్యవహరిస్తే బయట పడేందుకు మంచి అవకాశాలు ఉంటాయి’’అని చెప్పారు. కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అవి తమ ఆడిట్ కమిటీలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇండిపెండెంట్ డైరెక్టర్లకు సాధికారత కలి్పంచాలన్నారు. -
ఫోరెన్సిక్ ఆడిటర్లకు గడువు పెంపు
న్యూఢిల్లీ: ఫోరెన్సిక్ ఆడిటర్లుగా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇలా ఎంపికైన ఆడిటర్లు మ్యూచువల్ ఫండ్స్, ఆస్తుల నిర్వహణ కంపెనీ(ఏఎంసీ)లు, ట్రస్టీ సంస్థలకు సేవలు అందించవలసి ఉంటుంది. అర్హతగల సంస్థలు దరఖాస్తు చేసుకునేందుకు తొలుత ఇచ్చిన గడువు ఈ నెల 6తో ముగియగా.. తాజాగా మార్చి 31వరకూ సెబీ పొడిగించింది. దరఖాస్తుదారులు మొబైళ్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు తదితర యూఎస్బీ డ్రైవ్‌ల నుంచి సమాచారాన్ని సేకరించడం, క్రోడీకరించడం, డిజిటల్ ఎవిడెన్స్‌పై నివేదికలు రూపొందించడం తదితర కార్యకలాపాలు చేపట్టవలసి ఉంటుంది. బైబ్యాక్ బిడ్స్, ధరలపై సెబీ ఆంక్షలు స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా చేపట్టే బైబ్యాక్‌లకు వర్తింపు స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా చేపట్టే సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)లో సెబీ తాజాగా ఆంక్షలు విధించింది. బిడ్స్ వేయడం, ధరల నిర్ణయం, పరిమాణం తదితర అంశాలకు ఆంక్షలు వర్తింపచేస్తూ సెబీ సర్క్యులర్‌ను జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం కొనుగోలు తేదీ నుంచి గత 10 ట్రేడింగ్ పనిదినాల రోజువారీ సగటు పరిమాణం(విలు వ)లో 25 శాతాన్ని మించి బైబ్యాక్ చేపట్టేందుకు వీలుండదు. మార్కెట్ ప్రారంభానికి ముందు తొలి అర్ధగంట, ట్రేడింగ్ సమయంలో చివరి అర్ధగంట లో బైబ్యాక్ బిడ్స్‌ను అనుమతించరు. క్రితంరోజు ట్రేడైన ధరకు 1% శ్రేణిలో మాత్రమే ఆర్డర్లకు అను మతి ఉంటుంది. తాజా నిబంధనలను అమలు చేయవలసిందిగా అటు కంపెనీలు, ఇటు ఎంపిక చేసిన బ్రోకర్లను సెబీ ఆదేశించింది. నిబంధనల అమలును స్టాక్ ఎక్సే్ఛంజీలు పర్యవేక్షిస్తుంటాయని, ఉల్లంఘిస్తే జరిమానా లేదా తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం బైబ్యాక్ చేపట్టేందుకు స్టాక్ ఎక్సే్ఛంజీలు, టెండర్ ఆఫర్ మార్గా లు అందుబాటులో ఉన్నాయి. కాగా.. స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా బైబ్యాక్ చేపట్టడాన్ని దశలవారీగా తొలగించనున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరుకల్లా పాన్–ఆధార్ లింక్ ఇన్వెస్టర్లకు సెబీ తాజా ఆదేశాలు సెబీ ఈ నెలాఖరులోగా ఆదాయ పన్ను శాఖ నుంచి పొందే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) కు ఆధార్‌ను లింక్ చేయవలసిందిగా ఇన్వెస్టర్లను మరోసారి ఆదేశించింది. తద్వారా సెక్యూరిటీల మార్కెట్లో లావాదేవీలను ఎలాంటి సమస్యలూ లేకుండా నిర్వహించుకునేందుకు వీలుంటుందని తెలియజేసింది. గడువులోగా పాన్‌కు ఆధార్‌ను లింక్ చేయని ఇన్వెస్టర్లను కేవైసీ నిబంధనలు ఉల్లంఘించినట్లు భావిస్తామని పేర్కొంది. దీంతో సెక్యూరిటీలు, ఇతర లావాదేవీలపై ఆంక్షలు అమలుకానున్నట్లు వెల్లడించింది. 2023 మార్చి31లోగా ఆధార్‌ను లింక్ చేయకుంటే పాన్ సేవలు నిలిచిపోనున్నట్లు 2022 మార్చిలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది. అంతేకాకుండా 1961 ఆదాయపన్ను చట్టం ప్రకారం తగిన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలియజేసింది. -
ఆడిటింగ్‌లో సైంటిఫిక్ పద్ధతులు పాటించాలి
న్యూఢిల్లీ: ఆడిటింగ్‌లో మరింత పటిష్టమైన, శాస్త్రీయమైన పద్ధతులను పాటించాలని ఆడిటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సమస్యలను గుర్తించడంలోనూ, పరిష్కారాలను కనుగొనడంలోనూ ఆడిటింగ్ కీలక సాధనమని ఆయన పేర్కొన్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్వహించిన తొలి ఆడిట్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు తెలిపారు. ఒకప్పుడు దేశీయంగా ఆడిట్ అంటే ఒకింత అనుమానంగా, భయంగాను చూసేవారని, కాగ్.. ప్రభుత్వం ఒకదానితో మరొకటి తలపడినట్లుగా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతం మైండ్‌సెట్ మారిందన్నారు. విలువ జోడింపులో ఆడిట్ కీలక పాత్ర పోషిస్తుందన్న భావన నెలకొందని మోదీ చెప్పారు. గత ప్రభుత్వం పాటించిన తప్పుడు విధానాలు, పారదర్శకత లేకపోవడం వల్లే బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. ‘గతంలో ఎన్పీఏలను ఎలా దాచిపెట్టేవారో మీకు తెలుసు. గత ప్రభుత్వాలు చేసిన పనులను మేం పూర్తి నిజాయితీతో దేశ ప్రజల ముందు ఉంచాము. సమస్యలను గుర్తించినప్పుడే వాటికి పరిష్కార మార్గాలను కనుగొనగలము. వ్యవస్థలో పారదర్శకత తెచ్చిన తర్వాత ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి‘ అని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. డేటా కీలకం.. గతంలో సమాచారాన్ని కథల రూపంలో చెప్పేవారని, చరిత్రను కూడా కథల రూపంలోనే రాశారని మోదీ చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని, సమాచారం అంటే డేటాయేనని ఆయన పేర్కొన్నారు. ‘21వ శతాబ్దంలో సమాచారం అంటే డేటా. భావి తరాల్లో మన చరిత్రను డేటా ద్వారానే చూస్తారు. దాని కోణంలోనే అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో చరిత్రను డేటానే నిర్దేశిస్తుంది‘ అని మోదీ తెలిపారు. కాగ్ అడిగే డేటా, ఫైళ్లను ప్రభుత్వ విభాగాలు విధిగా అందజేయాలని ఆయన సూచించారు. క్షేత్ర స్థాయి ఆడిట్లు నిర్వహించడానికి ముందు ప్రాథమికంగా బైటపడిన అంశాల గురించి ఆయా ప్రభుత్వ విభాగాలకు తెలియజేసేలా కాగ్ కొత్త విధానాన్ని అమల్లోకి తేవడం మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని మోదీ చెప్పారు. మరోవైపు, తొలి ఆడిటర్ జనరల్ 1860 నవంబర్ 16న బాధ్యతలు చేపట్టారని, అందుకే ఆ రోజును ఆడిట్ దివస్‌గా నిర్వహించాలని భావించినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము తెలిపారు. కొత్త ఆడిట్ ప్రక్రియ మేనేజ్మెంట్ అప్లికేషన్‌ను కాగ్ అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
జీవీకే గ్రూప్ ఆడిటర్ల రాజీనామా
హైదరాబాద్: ఆర్థిక అవకతవకలకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఇన్ఫ్రా దిగ్గజం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తాజాగా మరో పరిణామం ఎదురైంది. ఆడిటింగ్‌లో కంపెనీ సహకరించడం లేదంటూ ప్రైస్ వాటర్‌హౌస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకుంది. వివిధ అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ పలు మార్లు కోరినప్పటికీ కంపెనీ ఇవ్వడం లేదంటూ, ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆడిటింగ్ సంస్థ ఆగస్టు 13న లేఖ ద్వారా రాజీనామా ప్రతిపాదన పంపినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీవీకే తెలియజేసింది. -
పైపైన ఆడిటింగ్.. సంక్షోభానికి కారణం
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు)లో సంక్షోభానికి ఆడిటర్ల తీరే కారణమని బ్యాంకు ఎండీగా సస్పెన్షన్‌కు గురైన జాయ్‌థామస్ ఆరోపించారు. సమయాభావంతో బ్యాంకు పుస్తకాలను పైపై ఆడిటింగ్ చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్బీఐకి ఆయన ఐదు పేజీల లేఖను రాశారు. వసూలు కాని బకాయిలను (ఎన్పీఏలు) వాస్తవ గణాంకాల కంటే తక్కువగా చూపించడం వెనుక బ్యాంకు యాజమాన్యం, డైరెక్టర్ల పాత్ర ఉన్నట్టు థామస్ అంగీకరించారు. అలాగే, పీఎంసీ బ్యాంకు మొత్తం రుణ పుస్తకం రూ.8,800 కోట్లలో రూ.6,500 కోట్ల మేర ఒక్క హెచ్‌డీఐఎల్ ఖాతాకు (73 శాతం) నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన విషయాన్ని దాచడంలోనూ యాజమాన్యం పాత్ర ఉన్నట్టు థామస్ పేర్కొన్నారు. పీఎంసీ బ్యాంకుకు ముగ్గురు ఆడిటర్లు ఉండగా, వీరిలో ఎవరి పేరునూ థామస్ తన లేఖలో పేర్కొనలేదు. 2018–19 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదిక ప్రకారం.. లక్డావాల్ అండ్ కో, అశోక్ జయేష్ అండ్ అసోసియేట్స్, డీబీ కేట్కార్ అండ్ కో సంస్థలు స్టాట్యుటరీ ఆడిటర్లుగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ముంబై పోలీసు శాఖ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో థామస్ లేఖ కూడా భాగంగా ఉంది. థామస్‌తోపాటు, బ్యాంకు చైర్మన్ వర్యమ్‌సింగ్, హెచ్‌డీఐఎల్ ప్రమోటర్ వాద్వాన్ పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. 2008 నుంచి గోప్యంగానే.. బ్యాంకు వృద్ధి క్రమంలో ఉండడంతో ఆడిటర్లు సమయాభావం వల్ల కేవలం పెరిగిన అడ్వాన్స్‌లను (రుణాలు) చూశారే కానీ, మొత్తం బ్యాం కు ఖాతాలకు సంబంధించిన కార్యకలాపాలను పరిశీలించలేదని థామస్ తన లేఖలో వివరించా రు. బ్యాంకు ప్రతిష్ట దెబ్బతింటుందన్న భయం తోనే భారీ రుణ ఖాతాల సమాచారాన్ని 2008 నుంచి ఆర్బీఐకి తెలియజేయకుండా గుట్టుగా ఉంచినట్టు థామస్ తెలిపారు. చెల్లింపుల్లో జా ప్యం ఉన్నప్పటికీ గత మూడేళ్లుగా హెచ్‌డీఐఎల్ ఖాతాను స్టాండర్డ్‌గానే చూపించామన్నారు. రంగంలోకి ఐసీఏఐ చార్టర్డ్ అకౌంటెంట్ల అత్యున్నత మండలి (ఐసీఏఐ) పీఎంసీ బ్యాంకు వ్యవహారంలో రంగంలోకి దిగింది. పీఎంసీ బ్యాంకులో చోటుచేసుకున్న అవకతవకల్లో ఆడిటర్ల పాత్రను తేల్చేందుకు గాను ఆర్బీఐ, ఇతర నియంత్రణ సంస్థల నుంచి సమాచారం కో రింది. ఆర్బీఐ విజిలెన్స్ విభాగం, మహా రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కమిషనర్‌కు లేఖ రాసింది. తాము గుర్తించిన వివరాలు, ఆడిటర్ల పాత్ర అందులో ఏమైనా ఉందా అన్న వివరాలను తెలియజేయాలని కోరినట్టు ఏఐసీఏఐ తెలిపింది. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా బ్యాంకు స్టాట్యుటరీ ఆడిటర్ల నుంచి కోరినట్టు వెల్లడించింది. ఆడిటర్ల పాత్ర ఉన్నట్టు తేలితే ఐసీఏఐ తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ
సాక్షి, ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వ్యాపారంలో వరుస నష్టాలు, రుణభారం వెరసి అనిల్ అంబానీ వరుసగా ఆస్తులు, కంపెనీలలో షేర్లను అమ్మకానికి పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆడిటర్ల రూపంలో మరో షాక్ తగిలింది. రిలయన్న్ గ్రూపునకు చెందిన అనుబంధ కంపెనీలైన రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు చెందిన ఆడిటర్లు రాజీనామా చేశారు. గత మూడు నెలలుగా చట్టబద్దమైన ఆడిటర్లుగా తప్పు కోవడం పెద్ద దెబ్బే. తాజాగా మరో రెండు కంపెనీల ఆడిటర్లు రాజీనామా చేశారు. దీంతో ఈ మూడు నెలల్లోనే రిలయన్స్ గ్రూప్‌లోని నాలుగు కంపెనీల ఆడిటర్లు వైదొలిగినట్లు అయింది. కంపెనీకి చట్టబద్ధమైన ఆడిటర్లలో ఒకరైన బీఎస్ఆర్ అండ్ కం 2019 ఆగస్ట్ 9వ తేదీ నుంచి వై దొలిగిందని రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ స్టాక్ ఎక్స్చేంజ్ సమాచారంలో వెల్లడించాయి. ఈ మేరకు ఆడిటర్లు కంపెనీలకు ఒక లేఖ రాసినట్టు తెలిపాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ 14వ తేదీన రిలయన్స్ ఇన్ఫ్రా ఆడిట్ నివేదికలో ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ పైన ఆందోళన వ్యక్తం చేసిందని, తమకు వివిధ అంశాలపై సరైన సమాచారం లభించలేదని కంపెనీ పేర్కొంది. కాగా ఒకవైపు అనిల్ అంబానీ సోదరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పట్టిందల్లా బంగారంలా దూసుకుపోతున్నారు. పెట్రో కెమికల్ బిజినెస్‌లో 20 శాతం విదేశీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. దుబాయ్ కంపెనీసౌదీ అరామ్కో ద్వారా మొత్తం 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో తన కంపెనీని అప్పుల్లేని కంపెనీగా తీర్చదిద్దుతామని కంపెనీ ఏజీఎం సందర్బంగా ప్రతిష్టాత్మకంగా వెల్లడించారు. మరోవైపు అనిల్ అంబానీ మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నారు -
మైనారిటీ ఇన్వెస్టర్లకు బాసట
న్యూఢిల్లీ: మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడంపై కేంద్ర ప్రభుత్వం మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీల చట్టం కింద క్లాస్ యాక్షన్ దావాలు వేసే మైనారిటీ ఇన్వెస్టర్లకు అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించాలని యోచిస్తోంది. దీనికోసం ప్రత్యేక స్కీమును సిద్ధం చేస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా సంస్థ యాజమాన్యం తీరు, నిర్వహణ తమ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందని భావించిన పక్షంలో మదుపుదారులు ఒక గ్రూప్‌గా ఏర్పడి కంపెనీపై దావా వేయడాన్ని క్లాస్ యాక్షన్ దావాగా వ్యవహరిస్తారు. విదేశాల్లో ఎక్కువగా ప్రాచుర్యం ఉన్న ఈ తరహా దావా వేసేందుకు దేశీయంగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 245 కింద వెసులుబాటు ఉంది. ‘క్లాస్ యాక్షన్ దావాలను పరిశీలిస్తున్నాం. మదుపుదారుల అవగాహన, రక్షణ నిధి ఐఈపీఎఫ్ కింద క్లాస్ యాక్షన్ దావా వేసే మైనారిటీ ఇన్వెస్టర్లకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు త్వరలో ఒక స్కీమ్ ప్రవేశపెట్టబోతున్నాం. క్లాస్ యాక్షన్‌కి సంబంధించి న్యాయ సేవలకు అయిన వ్యయాలను రీయింబర్స్ చేసేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. క్లాస్ యాక్షన్ వేసేందుకు అవసరమైన కనీస మదుపుదారుల సంఖ్య, కనీస షేర్ హోల్డింగ్ లేదా డిపాజిట్లు మొదలైన అంశాలను నిర్వచించడం జరుగుతుంది. వీటిని కూడా త్వరలోనే నోటిఫై చేస్తాం‘ అని శ్రీనివాస్ వివరించారు. ఈ పరిమితులను సోమవారం నోటిఫై చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. క్లాస్ యాక్షన్ దావా వేసేందుకు అన్‌లిస్టెడ్ కంపెనీల్లోనైతే కనీస వాటా 5 శాతంగాను, లిస్టెడ్ సంస్థల్లోనైతే 2 శాతంగా ఉండేట్లుగా పరిమితి నిర్దేశించే అవకాశం ఉంది. ఆడిటర్లు, రేటింగ్ ఏజెన్సీలకు కూడా వర్తింపు ఇటీవల అక్రమ నిధుల సమీకరణ స్కీములు, కొన్ని కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మోసపూరిత విధానాలతో ఇన్వెస్టర్లు మోసపోతున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో క్లాస్ యాక్షన్ దావాలు మరింతగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘సాధారణంగా మైనారిటీ ఇన్వెస్టర్లకు క్లాస్ యాక్షన్ దావాల విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై పెద్దగా అవగాహన ఉండదు. తీవ్రంగా నష్టపోయిన వారికి ఇది గొప్ప ఆయుధం లాంటిది. ఆడిటర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు... ఇలా ఎవరిపైనైనా సరే క్లాస్ యాక్షన్ దావా వేయొచ్చు. నష్టాలతో సతమతమవుతున్న మైనారిటీ ఇన్వెస్టర్లు తప్పనిసరిగా దీన్ని ఎంచుకోవచ్చు. ఈ దిశగా ఇన్వెస్టర్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది‘ అని శ్రీనివాస్ పేర్కొన్నారు. -
జెట్ ఎయిర్వేస్పై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వాయిదా వేసిన విషయంలో సంబంధిత ఆడిటర్లను ప్రభుత్వం వివరణ కోరినట్లు తెలియవచ్చింది. ఫలితాల వెల్లడిలో జాప్యం జరగడానికి సంబంధించిన అంశాలపై ఆడిటర్లను కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరణ అడిగిందని ఆ వర్గాలు వెల్లడించాయి. కాగా భవిష్యత్తులో కంపెనీ మనుగడ విషయమై ఆడిటర్లు సందేహాలు వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడ్డాయి. ఈ నెల 27న ఫలితాలు.... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వాయిదా వేస్తున్నామని జెట్ ఎయిర్వేస్ ఈ నెల 9న ప్రకటించింది. ఈ ఫలితాలను ఈ నెల 27న వెల్లడిస్తామని ఇటీవలే జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. ఆర్థిక ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతున్న విషయమై మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ కూడా దృష్టి సారించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేర్ 3 శాతం పతనమై రూ.292కు పడిపోయింది. -
పీఎన్బీ స్కాంపై మౌనం వీడిన జైట్లీ
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణంపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మౌనం వీడారు. ఈ స్కాంపై తొలిసారి స్పందించారు. ఈ స్కాంలో ఆడిటర్లు, బ్యాంకర్లనే జైట్లీ నిందించారు. పీఎన్బీలో చోటుచేసుకున్న ఈ రూ.11,400 కోట్ల కుంభకోణానికి వీరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ''నిర్ణయాలు తీసుకునే అధికారం బ్యాంకు మేనేజ్మెంట్కి ఉంటే, దాన్ని సమర్థవంతంగా, సరియైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి. ఒకవేళ దానిలో ఏమైనా లోపాలు గుర్తిస్తే, దానికి వారే బాధ్యత వహించాలి'' అని జైట్లీ ఏడీఎఫ్ఐఏపీ వార్షిక సమావేశంలో అన్నారు. ఆడిటర్లు ఏం చేస్తున్నారు? అంతర్గత, బహిర్గత ఆడిటర్లు దీన్ని గుర్తించడం విఫలమైతే, సీఏ నిపుణులు గురించి తీవ్రంగా ఆలోచించాల్సి ఉందని భావిస్తున్నా అని పేర్కొన్నారు. బ్యాంకుల నిర్వహణపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్యాంకుల సిస్టమ్ నమ్మకం, రుణగ్రహీత, రుణదాత రిలేషన్‌షిప్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. కాగ, పీఎన్బీలో నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ స్కాం వెలుగులోకి వచ్చాక, ఈడీ, సీబీఐ వీరి సంస్థలపై భారీ ఎత్తున్న తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మోసంలో 120 షెల్ కంపెనీలు పాలుపంచుకున్నట్టు ఈడీ ఆరోపిస్తోంది. వీటిలో 80 కంపెనీలు నీరవ్ మోదీ, చౌక్సి రన్ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ కేసులో భాగమైన మెహుల్ చౌక్సి ప్రమోటర్‌గా ఉన్న గీతాంజలి జెమ్స్, దాని అసోసియేటెడ్ సంస్థలపై ఐటీ కూడా దాడులు చేసింది. ముంబై, పుణే, సూరత్, హైదరాబాద్, బెంగళూరు వంటి పలు నగరాల్లో ఉన్న కంపెనీల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తోంది. -
గతవారం బిజినెస్
150 ఫ్లాట్లను విక్రయించిన ఆర్‌కామ్ రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) కంపెనీ నవీ ముంబైలోని 150 రెసిడెన్షియల్ ఫ్లాట్లను రూ.330 కోట్లకు విక్రయించింది. నవీ ముంబైలోని సీ ఉడ్స్ కాంప్లెక్స్‌లో ఉన్న ఈ ఫ్లాట్స్‌ను విక్రయించామని, దాదాపు సగం డబ్బులు వచ్చేశాయని ఆర్‌కామ్ తెలిపింది. రుణ భారం తగ్గించుకోవడానికి ఆస్తుల నగదీకరణలో భాగంగా ఈ ఫ్లాట్లను విక్రయించామని పేర్కొంది. కార్పొరేట్ మోసం కోటి దాటితే కేంద్రం దృష్టికి ఆడిటర్లు కంపెనీల ఖాతాలను పరిశీలించే క్రమంలో రూ. 1 కోటి పైగా విలువ చేసే సందేహాస్పద కార్పొరేట్ మోసాల ఉదంతాలేమైనా గుర్తిస్తే ప్రభుత్వం దృష్టికి తేవాల్సి ఉంటుంది. కంపెనీల చట్టానికి ఈ మేరకు సవరణలు చేస్తూ కార్పొరేట్ వ్యవహారాల శాఖ నిబంధనలు ప్రకటించింది. మోసం ఉదంతం తెలిసిన రెండు రోజుల్లోగా ఆడిటరు ముందుగా కంపెనీ బోర్డు లేదా ఆడిట్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలి. దీనిపై 45 రోజుల్లోగా వాటి నుంచి వివరణ తీసుకోవాలి. ఆ తర్వాత 15 రోజుల్లోగా ఆడిటరు తన నివేదికను కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. మ్యాట్రిమోని.కామ్, క్విక్‌హీల్ ఐపీఓలకు ఓకే మ్యాట్రీమోని.కామ్, క్విక్ హీల్ టెక్నాలజీస్ ఐపీఓలకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ రెండు కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1,000 కోట్ల నిధులు సమీకరిస్తాయని అంచనా. ఐపీఓకు సంబంధించిన పత్రాలను మ్యాట్రిమోని.కామ్ సంస్థ ఆగస్టులో, క్విక్ హీల్ టెక్నాలజీస్ సంస్థ సెప్టెంబర్‌లో సెబీకి సమర్పించాయి. మ్యాట్రిమోని.కామ్ కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ.600-700 కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఇక క్విక్ హీల్ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.250 కోట్లను సమీకరించనున్నది. ఎన్సీడీల ద్వారా రూ.15,000 కోట్ల సమీకరణ భారత కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్సీడీ)ల ద్వారా రూ.15,000 కోట్లు సమీకరించాయి. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు ఎన్సీడీల ద్వారా రూ.9,713 కోట్లు సమీకరించాయి. విస్తరణ ప్రణాళికలకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల నిమిత్తం, ఇతర సాధారణ వ్యాపార అవసరాల నిమిత్తం కంపెనీలు ఎన్సీడీల ద్వారా నిధులు సమీకరించాయి. ఎన్సీడీలను షేర్లుగా మార్చుకోవడానికి వీలుండదు. కన్వర్టబుల్ డిబెంచర్ల కన్నా వీటికి అధిక వడ్డీ వస్తుంది. ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ విలీనం! దేశీ టెలికం రంగంలో మరో భారీ విలీనానికి రంగం సిద్ధమవుతోంది. అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), ఎయిర్‌సెల్‌ల విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు కంపెనీల మొబైల్/వైర్లెస్ వ్యాపారాలను విలీనం చేయడానికి ఎయిర్‌సెల్ వాటాదారులతో చర్చలు జరుపుతున్నట్లు ఆర్‌కామ్ మంగళవారం ప్రకటించింది. కాగా, ఎంటీఎస్ బ్రాండ్‌తో దేశీయంగా టెలికం సేవలు అందిస్తున్న సిస్టెమా శ్యామ్ టెలీ సర్వీసెస్ భారతీయ వ్యాపారాన్ని విలీనం చేసుకునే ప్రక్రియలో ఆర్‌కామ్ నిమగ్నమైన సంగతి తెలిసిందే. క్యూ2లో క్యాడ్ 1.6 శాతం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) సెప్టెంబర్ త్రై మాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 1.6 శాతంగా నమోదయ్యింది. విలువ రూపంలో ఇది 8.2 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ లోటు జీడీపీలో 2.2 శాతంగా ఉంది. విలువలో 10.9 బిలియన్ డాలర్లు. ఎగుమతులు-దిగుమతులకు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు తగ్గడం త్రై మాసికం పరంగా క్యాడ్ తగ్గడానికి కారణమని ఆర్బీఐ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్లో రైల్వే బుకింగ్ ప్రైవేట్ రంగ దిగ్గజం బ్యాంక్ ఐసీఐసీఐ తొలిసారిగా తన వెబ్సైట్ ద్వారా రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం రైల్వే ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. వినియోగదారులు ఐసీఐసీఐ వెబ్సైట్లో రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకోవాలంటే ముందుగా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో సభ్యత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. పాన్ నిబంధనలు సవరించండి ఆభరణాల కంపెనీల సమాఖ్య ఆల్ ఇండియా జెమ్స్, జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్)... కొత్తగా తెస్తున్న పాన్ నిబంధనలను తప్పుపట్టింది. రూ.2 లక్ష లపై కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి అనే నిబంధనలు జ్యుయలరీ రంగానికి ప్రతికూలమని వ్యాఖ్యానించింది. దీనివల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందని, రూ.2 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని కోరింది. బంగారం దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని పేర్కొంది. స్వచ్ఛ భారత్ సుంకం వసూళ్లు రూ.330 కోట్లు డిసెంబర్ 16 నాటికి స్వచ్ఛ భారత్ సుంకపు వసూళ్లు రూ.329 కోట్లుగా ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించి నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం నవంబర్ 15 నుంచి పన్ను పరిధిలోకి వచ్చే అన్ని సేవలపైన 0.5 శాతంమేర స్వచ్ఛ భారత్ సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. స్వచ్ఛ భారత్ సుంకపు వసూళ్లు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రూ.3,750 కోట్లకు చేరొచ్చని సిన్హా అంచనా వేశారు. స్వచ్ఛ భారత్ సుంకంతో (0.5 శాతం) కలుపుకొని సర్వీస్ ట్యాక్స్ 14.5 శాతానికి చేరింది. ఐడియా 4జీ సేవలు ప్రారంభం టెలికం రంగ సంస్థ ఐడియా సెల్యులర్ 4జీ ఎల్టీఈ సేవలను బుధవారం ప్రారంభించింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో కలిపి), కర్ణాటక, తమిళనాడు, కేరళ సర్కిళ్లలో ఈ సేవలను ఆవిష్కరించింది. ప్రస్తుతానికి నాలుగు సర్కిళ్లకుగాను 75 పట్టణాల్లో కస్టమర్లు 4జీ ఎల్టీఈని పొందవచ్చు. అయితే ఈ జాబితాలో ప్రధాన నగరాలేవీ లేవు. ఇక రిలయన్స్ క్షిపణులు! ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా భారీ డిఫెన్స్ ఒప్పందం కుదిరింది. భారత్‌కు చెందిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్.. రష్యా ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ సిస్టమ్స్ తయారీ దిగ్గజం అల్మాజ్యాంటేతో గురువారం భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం భారత్ రక్షణ దళాలకు అవసరమైన మొత్తం ఎయిర్‌డిఫెన్స్ మిసైల్స్(క్షిపణులు), రాడార్ సిస్టమ్స్‌ను ఇరు సంస్థలు కలిసి తయారు చేయనున్నాయి. డీల్స్.. * ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ యూకే (టీఎస్యూకే) యూరప్‌లోని తమ లాంగ్ ప్రొడక్ట్స్ వ్యాపార విభాగాన్ని విక్రయించనుంది. ఇందుకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ సంస్థ గ్రేబుల్ క్యాపిటల్‌తో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. * చిన్న, మధ్య తరహా సంస్థల ఎదుగుదలకు తోడ్పాటు అందించే దిశగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ (నీస్‌బడ్)తో చేతులు కలిపింది. * భారత్‌లో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో అమెరికాకు చెందిన విటియోస్ గ్రూప్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. డీల్ విలువ 13 కోట్ల డాలర్లు (దాదాపు రూ.861 కోట్లు).