న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వాయిదా వేసిన విషయంలో సంబంధిత ఆడిటర్లను ప్రభుత్వం వివరణ కోరినట్లు తెలియవచ్చింది. ఫలితాల వెల్లడిలో జాప్యం జరగడానికి సంబంధించిన అంశాలపై ఆడిటర్లను కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరణ అడిగిందని ఆ వర్గాలు వెల్లడించాయి. కాగా భవిష్యత్తులో కంపెనీ మనుగడ విషయమై ఆడిటర్లు సందేహాలు వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడ్డాయి.
ఈ నెల 27న ఫలితాలు....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వాయిదా వేస్తున్నామని జెట్ ఎయిర్‌వేస్ ఈ నెల 9న ప్రకటించింది. ఈ ఫలితాలను ఈ నెల 27న వెల్లడిస్తామని ఇటీవలే జెట్ ఎయిర్‌వేస్ పేర్కొంది. ఆర్థిక ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతున్న విషయమై మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ కూడా దృష్టి సారించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీఎస్‌ఈలో జెట్ ఎయిర్‌వేస్ షేర్ 3 శాతం పతనమై రూ.292కు పడిపోయింది.
జెట్ ఎయిర్‌వేస్‌పై కేంద్రం దృష్టి
Published Wed, Aug 22 2018 12:50 AM | Last Updated on Wed, Aug 22 2018 12:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment