
జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ క్యాన్సర్‌తో పోరాడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆమె 2015 నుంచి సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
అనితా గోయల్ కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా గురువారం ఉదయం ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనిత 1979లో మార్కెటింగ్ అనలిస్ట్‌గా కంపెనీలో చేరారు. ఆమె మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్‌గా ఎదిగిన తర్వాత నరేష్ గోయల్‌తో పరిచయం ఏర్పడింది. వారు కలిసిన తొమ్మిదేళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
మనీలాండరింగ్ కేసులో 2023లో జైలుకెళ్లిన ఆమె భర్త నరేష్‌గోయల్‌కు వైద్యకారణాల వల్ల బాంబే హైకోర్టు సోమవారం బెయిల్ ఇచ్చింది. భర్త జైల్లోనుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే భార్య మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది.
Comments
Please login to add a commentAdd a comment