వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్ష ఎన్నికల్ని వాయిదా వేసే ప్రతిపాదనల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ జాప్యం జరుగుతుందన్న సంకేతాలు పంపుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో మెయిల్ ద్వారా వేసే ఓట్లలో భారీగా అవకతవకలు చోటు చేసుకుంటాయని ఆరోపించారు. ఈ ఏడాది నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే అమెరికాలో ఎన్నికల్ని వాయిదా వెయ్యడం అంత సులభం కాదు.
అమెరికా రాజ్యాంగంలో జాప్యం అన్న పదానికే చోటు లేదు. అయినప్పటికీ ట్రంప్ గురువారం ‘‘దేశ చరిత్రలోనే 2020 ఎన్నికల్లో కచ్చితత్వం లోపిస్తుందని, భారీగా అవకతవకలు జరుగుతాయి. దీనివల్ల అమెరికా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి’’ అని ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల్లో ఎక్కువ మంది మెయిల్ ఇన్ ఓటింగ్ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. మెయిల్ ద్వారా ఓటు వేసే ప్రక్రియలో విదేశీ హస్తం ఉంటుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా సురక్షితంగా ఓటేసే పరిస్థితులు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా వేస్తే ఏమవుతుంది ? అని ట్రంప్ ఆ ట్వీట్‌లో ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment