అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదికపై అదానీ గ్రూపు చైర్మన్, బిలియనీర్ గౌతమ్ అదానీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు సమాచారంతో, తమను అపఖ్యాతి చేయాలన్న దురుద్దేశంతో చేసిన ఆరోపణలని పునరుద్ఘాటించారు. ఇప్పటికే అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండించింది.
తాజాగా గ్రూప్ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో గౌతం అదానీ మంగళవారం మాట్లాడారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కావాలనే తమ పబ్లిక్ ఆఫర్‌కు ముందు విడుదల చేశారనీ, ఇది ఉద్దేశపూర్వకంగా కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించారు. అయినా ఎఫ్‌పీవో సక్సెస్ అయినప్పటికీ, పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అదానీ చెప్పారు. (వెకేషన్‌లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?)
ఈ సందర్బంగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తప్పుడు ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన వాటాదారులకు స్థిరమైన వృద్ధి , విలువ సృష్టికి హామీ ఇచ్చారు. అలాగే ప్రపంచ స్థాయి ఆస్తులను నిర్మించేందుకు గ్రూప్ కట్టుబడి ఉందని బిలియనీర్ చెప్పారు. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!)
కాగా అదానీ గ్రూప్‌లో అకౌంటింగ్ మోసం, స్టాక్ ప్రైస్ మానిప్యులేషన్ జరిగిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది అదానీ గ్రూప్ స్టాక్‌ల భారీ పతనానికి దారితీసింది. ఫలితంగా గ్రూపు మార్కెట్ విలువను భారీగా కోల్పోయింది. అలాగే హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగిన తర్వాత రెగ్యులేటరీ మెకానిజమ్‌ల వైఫల్యాన్ని సూచించే ఆధారాలు తమకు లభించ లేదని ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు ప్యానెల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం? )
#WATCH | "...The report was a combination of targeted misinformation and discredited allegations. The majority of them dating from 2004 to 2015. They were all settled by authorities at that time. This report was a deliberate and malicious attempt aimed at damaging our… pic.twitter.com/yEH5r3Duff
— ANI (@ANI) July 18, 2023
Comments
Please login to add a commentAdd a comment