Reputation
-
వాడని నెయ్యి.. తయారుకాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’ గోల
-
ప్రపంచంలో అయోధ్యకు పెరిగిన ఖ్యాతి.. ఏడాది చివరికి రూ.4 లక్షల కోట్లు..
అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. అయోధ్యలో పెరుగుతున్న రద్దీ చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దీంతో రానున్న రోజుల్లో దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని.. పర్యాటక రంగంలో ఉత్తరప్రదేశ్ అగ్రగామి అవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన విభాగం అంచనా వేసింది. ఈ ఏడాది అయోధ్యను సందర్శించే యాత్రికుల సంఖ్య పెరగడంతో ఉత్తరప్రదేశ్‌లో దేశీయ, విదేశీ పర్యాటకుల మొత్తం ఖర్చు ఈ ఏడాది చివరి నాటికి 4 లక్షల కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మునుపటి కంటే కూడా రూ. 20000 నుంచి రూ. 25000 కోట్లు ఎక్కువని అంచనా..! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలోని ఆధ్యాత్మిక పరిశ్రమను అభివృద్ధి చేయడంలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఆధ్యాత్మిక టూరిజంలో ఉత్తరప్రదేశ్ గణనీయ వృద్ధి సాధించనుంది. గంగా నది, వారణాసి, తాజ్ మహల్ వంటి పర్యాటక ప్రదేశాల జాబితాలో అయోధ్య రామాలయం కూడా చేరిపోయింది. 2022లో మాత్రమే 32 కోట్ల మంది దేశీయ పర్యాటకులు ఉత్తరప్రదేశ్ సందర్శించారు. ఇందులో కేవలం అయోధ్యను మాత్రమే సందర్శించిన వారు 2.21 కోట్లు. ఇది 2021తో పోలిస్తే ఏకంగా 200 శాతం ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ 'కాంతి ఘోష్' ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో దేశీయ పర్యాటకులు దాదాపు రూ. 2.2 లక్షల కోట్లు, విదేశీ పర్యాటకులు రూ.10,000 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే యూపీలో పర్యాటకుల ఖర్చు మొత్తం రూ.2.3 లక్షల కోట్లని తెలుస్తోంది. 2019లో అంతర్జాతీయ పర్యాటక వసూళ్లలో భారతదేశం వాటా 14వ ర్యాంక్‌తో 2.06 శాతం తక్కువగా ఉండేది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కూడా, ఇది ఆరవ ర్యాంక్‌తో కేవలం 7 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది. ఇది రాబోయే రోజుల్లో తప్పకుండా వృద్ధి చెందుతుందని ప్రస్తుత పరిస్థితుల ద్వారా అవగతమవుతోంది. జీడీపీలో ఉత్తరప్రదేశ్ వాటా.. 2028 ఆర్ధిక సంవత్సరం నాటికి భారతదేశం ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, ఇందులో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ ఏకంగా 500 బిలియన్ డాలర్లగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ వృద్ధి భారతదేశ జీడీపీ పెరుగుదలకు దోహదపడుతుంది. ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు 2027 - 2028లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం మూడవ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. అప్పటికి ఆర్ధిక వృద్ధిలో 500 బిలియన్ డాలర్ల మార్కుని అధిగమించే రెండు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటిగా ఉండనుంది. ఇది నార్వే, హంగేరీ మొదలైన యూరోపియన్ దేశాల కంటే ఎక్కువని తెలుస్తోంది. -
ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా: భారత్
ఢిల్లీ: కెనడా తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి అన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాదంపై కెనడా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే.. ప్రతిష్ట పొందుతోందని దుయ్యబట్టారు. ఇరు దేశాల మధ్య వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఉగ్రవాదుల కార్యకలాపాలను యధేచ్చగా జరగనిచ్చేలా అవకాశాన్ని కల్పించడం, ఉగ్రవాదులకు ఫండింగ్ సమకూర్చడం వంటి చర్యలకు కెనడా స్వర్గధామంగా మారింది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను పంచుకోవాలని కోరితే స్పందన లేదు. కేవలం రాజకీయ మనుగడ కోసమే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఉగ్రవాదులకు మద్దతునివ్వడం మానుకోవాలని కెనడాను కోరుత్నునాం.' అని అరింధమ్ బాగ్చి తెలిపారు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. భారత దౌత్య అధికారులను కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. కేనడా ప్రయాణాలపై పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశ వీసాలను కూడా రద్దు చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? -
'ప్రధాని మోదీకి కూడా వారిలాగే..' అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు..
ముంబయి: ప్రధాని నరేంద్ర మోదీని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొనియాడారు. దేశ రాజకీయాల్లో ఇందిరా గాంధీకి ఉన్న క్లీన్ ఇమేజ్.. మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీకి ఉందని అన్నారు. లోకమాన్య తిలక్ అవార్డ్ అందుకోవడానికి ప్రధాని మోదీ మహారాష్ట్రకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన పవార్.. ప్రధాని మోదీని కొనియాడారు. దేశంలోనే గాక అంతర్జాతీయంగా ప్రధాని మోదీకి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీ దేశ ప్రజల కోసం ప్రతి రోజూ 18 గంటలపాటు పనిచేస్తున్నారు. దివాళీ సందర్భంగా దేశమంతా ఇంట్లో పండగ చేసుకుంటే ఆయన మాత్రం సరిహద్దుల్లో సైన్యంతో దివాళీ జరుపుకుంటారని అజిత్ పవార్ అన్నారు. గత తొమ్మిదేళ్లుగా చూస్తున్నాం.. ప్రధాని మోదీకి ఉన్న పేరు ప్రతిష్టలు ఇంకెవరికీ లేవు అంటూ అజిత్ పవార్ మోదీని కొనియాడారు. ఇందిరా గాంధీకి అప్పట్లో ఇదే విధమైన గౌరవం దక్కింది. మళ్లీ రాజీవ్ గాంధీకి మిస్టర్ క్లీన్ అనే పేరుంది. అదే విధమైన గౌరవాన్ని ప్రధాని మోదీ పొందుతున్నారని అజిత్ అన్నారు. ఇటీవలే ఎన్సీపీని చీల్చి అధికార బీజేపీ పార్టీలో చేరిన అజిత్ పవార్.. తాజాగా ఆ విషయాన్ని ప్రస్తావించారు. నిజాన్ని మాట్లాడటంలో ఇబ్బంది ఏం లేదని చెప్పారు. అభివృద్ధే ప్రధానమని తెలిపిన అయన.. ప్రతిపక్షంలో ఉంటే సాధించలేమని అన్నారు. అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉంటే ధర్నాలు, ఆందోళనలు మాత్రమే చేయగలం.. అభివృద్ధి కాదంటూ అజిత్ పవార్ మాట్లాడారు. 'మహారాష్ట్రకు వచ్చిన ప్రధాని మోదీకి ప్రజలందరూ స్వాగతం పలికారు. నేను, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆ కాన్వాయ్‌లోనే ఉన్నాం. ఎవరు కూడా నల్ల జెండాలను చూపించలేదు. రోడ్డుకు ఇరువైపులా నిలపడి మోదీకి స్వాగతం పలికారు. దేశంలో రక్షణ పరంగా మంచి వాతావరణం ఉండాలని ఏ ప్రధానియైనా కోరుకుంటారు. మణిపూర్ అంశాన్ని ఎవరు కూడా మద్దతివ్వరు. ప్రధాని ఆ సమస్యను తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా పరిశీలిస్తోంది. మణిపూర్ అంశాన్ని అందరం ఖండిస్తున్నాం.' అని అజిత్ పవార్ అన్నారు. ఇదీ చదవండి: గణేషుడి గుడిలో అలా ప్రధాని మోదీ.. బీఆర్ఎస్ నేతపై బీజేపీ శ్రేణుల మండిపాటు -
హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన అదానీ
అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదికపై అదానీ గ్రూపు చైర్మన్, బిలియనీర్ గౌతమ్ అదానీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు సమాచారంతో, తమను అపఖ్యాతి చేయాలన్న దురుద్దేశంతో చేసిన ఆరోపణలని పునరుద్ఘాటించారు. ఇప్పటికే అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండించింది. తాజాగా గ్రూప్ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో గౌతం అదానీ మంగళవారం మాట్లాడారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కావాలనే తమ పబ్లిక్ ఆఫర్‌కు ముందు విడుదల చేశారనీ, ఇది ఉద్దేశపూర్వకంగా కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించారు. అయినా ఎఫ్‌పీవో సక్సెస్ అయినప్పటికీ, పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అదానీ చెప్పారు. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) ఈ సందర్బంగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తప్పుడు ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన వాటాదారులకు స్థిరమైన వృద్ధి , విలువ సృష్టికి హామీ ఇచ్చారు. అలాగే ప్రపంచ స్థాయి ఆస్తులను నిర్మించేందుకు గ్రూప్ కట్టుబడి ఉందని బిలియనీర్ చెప్పారు. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!) కాగా అదానీ గ్రూప్‌లో అకౌంటింగ్ మోసం, స్టాక్ ప్రైస్ మానిప్యులేషన్ జరిగిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది అదానీ గ్రూప్ స్టాక్‌ల భారీ పతనానికి దారితీసింది. ఫలితంగా గ్రూపు మార్కెట్ విలువను భారీగా కోల్పోయింది. అలాగే హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగిన తర్వాత రెగ్యులేటరీ మెకానిజమ్‌ల వైఫల్యాన్ని సూచించే ఆధారాలు తమకు లభించ లేదని ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు ప్యానెల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం? ) #WATCH | "...The report was a combination of targeted misinformation and discredited allegations. The majority of them dating from 2004 to 2015. They were all settled by authorities at that time. This report was a deliberate and malicious attempt aimed at damaging our… pic.twitter.com/yEH5r3Duff — ANI (@ANI) July 18, 2023 -
బంగారం లోంచి సువాసనలు..!
కొంతమంది యోగ్యత కలిగినవారు ఉన్నత పదవులలోకి వెళ్ళిన కారణం చేత ఆ పదవి శోభిస్తుంది. వాళ్ళకీ కీర్తి వస్తుంది. పదవి, వ్యక్తి గుణాలు రెండూ సమున్నతంగా ఉంటే... బంగారానికి తావి అబ్బినట్లుంటుంది. ఎలా అంటే... అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుడిగా చేసిన హెర్బర్ట్ హూవర్ బాగా పేదరికం అనుభవించాడు. తల్లీతండ్రీ లేరు. మేనమామ చదివిస్తున్నాడు. 18వ ఏట స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉండగా..కళాశాల ఫీజు కట్టేంత డబ్బుసమకూరక చిక్కుల్లోపడ్డాడు. దీనినుంచి బయటపడడానికి ... స్నేహితుడితో కలిసి ఒక ఆలోచన చేసాడు. అప్పట్లో పోలండ్‌లో పియానో విద్వాంసుడిగా ఖ్యాతి వహించిన ఈగ్నాసీ యాన్ పద్రెస్కీ కచేరీ పెట్టి వచ్చిన వసూళ్ళలో ఖర్చులు పోగా మిగిలిన డబ్బును ఫీజుల కింద చెల్లించాలనుకున్నారు. ఆయనను సంప్రదించి రెండువేల డాలర్లకు ఒప్పందం చేసుకున్నారు. కానీ వసూళ్లు కేవలం 1600 డాలర్లే వచ్చాయి. పైగా కచేరీ నిర్వహణ ఖర్చులు కూడా చెల్లించాలి. ఏం చేయాలో తోచక నేరుగా పద్రెస్కీనే కలిసి వచ్చిన మొత్తం డబ్బు ఆయన చేతిలో పెట్టి మిగిలిన దానికి చెక్ ఇచ్చారు... మీరు కాలేజీ ఫీజులకోసం ఇది చేస్తున్నామని ముందుగా ఎందుకు చెప్పలేదంటూ పద్రెస్కీ ఆ చెక్ చించేసి డబ్బు తిరిగి వారి చేతులో పెట్టి... మీ ఫీజు, కచేరీ నిర్వహణ ఖర్చులు పోగా మిగిలితే ఇవ్వండి, లేకపోయినా ఫరవాలేదన్నారు. పద్రెస్కీ తదనంతర కాలంలో పోలండ్‌కు ప్రధానమంత్రి అయ్యారు. అది మొదటి ప్రపంచ యుద్ధకాలం. పోలండ్‌లో కరువు పరిస్థితి. తినడానికి కొన్ని లక్షలమందికి అన్నంలేని స్థితి. ప్రధానమంత్రిగా ఆయన అమెరికాలోఉన్న అంతర్జాతీయ ఆహార, సహాయ సంస్థకు ఒక విజ్ఞాపన పంపారు. ఆ సంస్థకు అధ్యక్షుడు హెర్బర్ట్ హోవర్. ఆ ఉత్తరాన్ని పరిశీలించి టన్నులకొద్దీ బట్టలు, ప్రతిరోజూ 2 లక్షలమందికి భోజనానికి సరిపడా సామాగ్రి పంపారు. ఈ ఉపకారానికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి పద్రెస్కీ అమెరికా వెళ్ళి హోవర్‌ను కలిసాడు. ‘‘మీరు కాదు కృతజ్ఞత లు.. నేను చెప్పాలి’’ అన్నాడు హోవర్. అదేమిటి అని పద్రెస్కీ ఆశ్చర్యపోతుండగా... గతంలో ఫీజుకట్టలేక మీ కచేరీ పెట్టి మిమ్మల్ని ఇద్దరు విద్యార్థులు కలిసారు, గుర్తుందా... అని అడిగాడు హోవర్. ఎప్పుడో జరిగిన వృత్తాంతం. అప్పటికి కొన్ని దశాబ్దాలు గడిచాయి. మీరు తీసుకోకుండా ఇచ్చిన డబ్బుతో కాలేజి ఫీజు చెల్లించి చదువు పూర్తి చేసుకోవడానికి మీరు సహకరించింది నాకే. మీరు చేసిన సాయంతోనే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను... అన్నాడు. ఆ తరువాత కాలంలో...అంటే అమెరికా అధ్యక్షపదవి స్వీకరించడానికి ముందు కూడా హోవర్ పోలండ్ వెళ్లాడు. మళ్ళీ అక్కడ పేద పిల్లల స్థితిగతులను చూసి చలించిపోయి భారీ ఎత్తున సహాయం పంపే ఏర్పాట్లు చేసాడు... మంచి గుణగణాలు.. వారికే కాదు, వారి పదవులకు కూడా గౌరవం తెచ్చిపెడతాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సోషల్ మీడియాలో ఆ వీడియో చూసి షాకైన శశి.. తరువాత ‘ఇదే నిజం’ అంటూ..
కాలేజీ కి బయల్దేరుతూ ఫోన్ తీసుకొని, కొత్తగా వచ్చిన నోటిఫికేషన్లు చూస్తోంది శశి (పేరు మార్చడమైనది). సోషల్ మీడియాలో ‘ఒకబ్బాయి కోసం కొట్టుకుంటున్న ఇద్దరమ్మాయిలు’ అని ట్యాగ్‌లైన్‌తో ఉన్న వీడియో చూసి షాకయ్యింది. ఆ వీడియోలో ఉన్నది తనే. ఆ వీడియోను ఇంట్లో అమ్మనాన్నలు చూశారు. వారికి అసలు విషయం తెలియజేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. క్రితం రోజు రాత్రి షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి బయల్దేరేసరికి పది దాటింది. హడావిడిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న శశికి రోడ్డు పక్కన ఓ అబ్బాయి అమ్మాయితో గొడవపడటం చూసింది. ముందు ‘నాకెందుకులే’ అనుకుంది. కానీ, అక్కడ అమ్మాయి సమస్య అనేసరికి ఉండలేక వారి దగ్గరకెళ్లింది. అబ్బాయి ఆ అమ్మాయిపై చేయి చేసుకోవడంతో శశి ఆ అబ్బాయిని కొట్టింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని కోప్పడి, తను ఇంటికి వచ్చేసింది. ఎవరు వీడియో తీశారో కానీ, అమ్మాయిలిద్దరూ గొడవపడుతున్న సన్నివేశం, పక్కన అబ్బాయి ఉండటంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోపైన రకరకాల కామెంట్లు. తట్టుకోలేకపోయింది శశి. అయితే, మధ్యాహ్నానికి ఈ అమ్మాయి పరువు తీస్తున్నారు ‘ఇదే నిజం’ అంటూ వచ్చిన మరో వీడియో చూసి ఊపిరి పీల్చుకుంది. శశి పరువు తీసేలా ప్రవర్తించిన వ్యక్తి పోస్ట్‌కి నెటిజన్లు ఘాటుగా కామెంట్లు పెట్టారు. సోషల్ మీడియాలో అంతా నిజం అనదగినవి ఏమీ లేవు. సోషల్ మీడియాలో ఉన్న రిపుటేషన్ బట్టి జీవితాలు మారిపోతున్న రోజులివి. ప్రెగ్నెన్సీ, బ్రేకప్స్, విడాకులు, న్యూ రిలేషన్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్.. అన్నీ సోషల్ మీడియాలో ఉంటున్నాయి. వీటికి మంచి, చెడు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. సెలబ్రిటీలకు సంబంధించినవైతే ఇక లెక్కే ఉండవు. కొన్ని వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేవి ఉంటే సంస్థల వైపు మరోవిధంగా ఉంటున్నాయి. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఏ వస్తువు కొనాలన్నా, ఏ రెస్టారెంట్‌కు వెళ్లాలన్నా.. వాటికి సంబంధించిన మంచి–చెడులను కామెంట్స్, రివ్యూల రూపంలో పెట్టేస్తున్నారు. పుకార్లు, అబద్దాలు, చెడు సమీక్షలు.. రకరకాల పోస్ట్‌ల్లో కనిపిస్తే.. ఏం జరుగుతుందో సోషల్ మీడియాలో ఉండేవారికి తప్పక తెలుసుండాలి. ప్రతిష్ట ఎలా దెబ్బతింటుంది? ►ఆన్లైన్లో వచ్చిన రకరకాల వార్తాకథనాలు సరైనవే అని నమ్ముతుంటారు. ఇవి, ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలకు, సంస్థలకు సంబంధించినవి ఉంటాయి. ►ఇతరులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆన్లైన్లో లీక్ చేయడం. బ్లాగుల్లో తప్పుడు సమాచారం ఇవ్వడం. ►కస్టమర్ల రివ్యూల ఆధారంగా వినియోగదారులకు మార్గదర్శకం చేసే రివ్యూ సైట్లు. ►గాసిప్లను వ్యాప్తి చేయడం, పబ్లిక్ వ్యక్తులను విమర్శించడం వంటివి. లిజనింగ్ టూల్స్ తప్పనిసరి.. మనకు సంబంధించిన మంచి చెడులను తీసుకొని, మనకు ఇన్ఫార్మ్ చేస్తుంటాయి లిజనింగ్టూల్స్. ప్రతి ఒక్కరూ తమ సోషల్ నెట్‌వర్క్‌లలో సానుకూల కామెంట్లు, రివ్యూలను ఆశించే పోస్ట్‌లు పెడుతుంటారు. దీనికి ప్రతికూల అభిప్రాయం వస్తే సోషల్ మీడియాలో మీ కీర్తి దెబ్బతింటుంది. సంస్థలు అయితే తమ వ్యాపారంలో నష్టాన్ని చూడాల్సి రావచ్చు. తమ బ్రాండ్ లేదా తమ వ్యక్తిత్వం చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సోషల్ లిజనింగ్, మానిటరింగ్ సాధనాలు వాడటం చాలా ముఖ్యం. కొన్ని ప్రముఖ సోషల్ మీడియా లిజనింగ్ టూల్స్ సైట్స్ ఇవి. ► https://www.falcon.io/ ► https://wwww.brand24.com/ ► https://www.digimind.com/ ► https://youscan.io/ ► https://brandmentions.com/ ► https://buzzsumo.com/ షెడ్యూలింగ్ టూల్స్ కంటెంట్ ముందుగా సిద్ధం చేసిపెట్టుకొని, సమయానుకూలంగా పోస్ట్ అవ్వాలని ఆప్షన్ పెట్టుకుంటే దానికి అనుగుణంగా పోస్ట్ చేస్తుంది ఈ యాప్. ఇవి మీ సోషల్ మీడియా ఖాతాల మొత్తం నిర్వహణలో సహాయపడతాయి. సరైన కంటెంట్‌ను సృష్టించడానికి, నిజమైన కనెక్షన్లను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. ► https://sproutsocial.com/ ► https://coschedule.com/ ► https://feedly.com/ ► https://www.airtable.com/ ► https://planable.io/ ► https://skedsocial.com/ ఆన్లైన్లో మంచి పేరు సంపాదించుకోవాలంటే సరైన కంటెంట్‌ను పోస్ట్ చేయాలి. లైక్‌లు, ఫాలోవర్లకు బదులు రివ్యూలపై దృష్టి పెట్టాలి. ప్రతికూలంగా వచ్చే ఫీడ్‌బ్యాక్‌లపై దృష్టిపెట్టాలి. మన ప్రతిష్టను ప్రభావితం చేసే సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సోషల్ మీడియా లిజనింగ్ టూల్స్, షెడ్యూలింగ్ టూల్స్ తప్పక ఉపయోగించాలి. ఆఫ్‌లైన్‌లో ఎలాంటి ప్రతిష్టను కోరుకుంటారో, ఆన్‌లైన్‌లోనూ అలాంటి రిప్యుటేషన్ ను పొందాలనుకోవడం ముఖ్యం. -
ఐసీఐసీఐపై ఫిచ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: వీడియోకాన్ గ్రూపు రుణ వివాదంతో ఇబ్బందుల్లో పడ్డ ఐసీఐసీఐ బ్యాంకు ప్రాభవం మరింత మసకబారుతోంది. తాజాగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంకుపై ఆరోపణలు సంస్థ రిపుటేషన్ను దెబ్బతీస్తుందని పేర్కొంది. సీబీఐ విచారణ పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతిందని తెలిపింది. అంతేకాదు ఐసీఐసీఐలో గవర్నెన్స్‌పై ప్రశ్నలు తలెత్తాయని ఫిచ్ రేటింగ్స్ సోమవారం వ్యాఖ్యానించింది. బ్యాంకుపై ఆరోపణలను దర్యాప్తు సంస్థ రుజువు అయితే..భారీ ఆర్థిక జరిమానా ప్రమాదంతోపాటు చట్టపరమైన చర్యలు కూడా తీవ్రంగానే ఉండనున్నాయని ఫిచ్ అంచనా వేసింది. వీడియోకాన్ గ్రూపునకు సంబంధించిన రుణ కేటాయింపు వివాదాన్ని పరిశీలిస్తున్నామని..దీనికనుగుణంగా తదుపరి రేటింగ్‌ను అంచనా వేస్తామని ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్యాంకు కీర్తి , ఆర్థిక ప్రొఫైల్‌కు నష్టాలు గణనీయంగా పెరగడం లాంటి ఇతర పరిణమాల నేపథ్యంలో తగిన రేటింగ్ తీసుకుంటామని తెలిపింది. అలాగే స్వతంత్ర దర్యాప్తునకు బ్యాంకు అయిష్టతను ప్రకటించడం కార్పొరేట్ పాలనా పద్ధతిపై బలమైన సందేహాలను కలగిస్తోందని ఫిచ్ అభిప్రాయపడింది.అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలీస్తే ఐసీఐసీఐలాంటి ప్రయివేటురంగ దిగ్గజ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెర్స్ పటిష్టంగా ఉంటుందనేది తమ విశ్వాసంగా ప్రకటించింది. మెరుగైన-అర్హత కలిగిన బోర్డు సభ్యులు, వృత్తిపరమైన నైపుణ్య నిర్వహణ అంశాల కారణంగా కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగ్గా వుంటుందని పేర్కొంది. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు డ్యామేజ్ కంట్రోల్లో పడింది. టాప్ పెట్టుబడిదారులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఇన్వెస్టర్లు మరిన్నివివరాలు కావాలంటూ డిమాండ్ చేశారు. అటు బ్యాంకు సీఈవో చందా కొచర్ భర్త దీపక్ సోదరుడు రాజీవ్ కొచర్‌ను వరుసగా అయిదవ రోజు కూడా సీబీఐ విచారిస్తోంది. అటు ఐసీఐసీఐలో 12.3 శాతం అధిక వాటా కలిగి వున్న ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ కూడా ఈ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. -
‘గొల్లభామ’కు ఖండాంతర ఖ్యాతి
సిద్దిపేటజోన్: సిద్దిపేట బ్రాండ్‌గా పేరుగాంచిన గొల్లభామ చీరకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుంది. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐ మహిళా విభాగం ఆధ్వర్యంలో గొల్లభామ చీరలు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షుడు బిందు చందుళ్ల మాట్లాడుతూ తెలంగాణ కళలను కాపాడుకునే బాధ్యతలో భాగంగా తమవంతు కృషి చేస్తున్నామన్నారు. అమెరికాలో గొల్లభామ చీరల ప్రదర్శన దృశ్యాలు -
'లక్ష ఓట్లతో ఓడిపోయావు.. నీకేం పరువుంది?'
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తనపై వేసిన పరువునష్టం దావాకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదునైన సమాధానమే ఇచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల్లో జైట్లీ లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారని, కాపాడుకునేందుకు ప్రజల్లో ఆయనకు గొప్ప పరువు, ప్రతిష్టలు ఏమీ లేవని కేజ్రీవాల్ పేర్కొన్నారు. జైటీ వేసిన పరువు నష్టం కేసులో ఈ మేరకు ఢిల్లీ కోర్టుకు కేజ్రీవాల్ మంగళవారం తన సమాధానాన్ని అందజేశారు. ప్రజల్లో తనకు గొప్ప వ్యక్తిత్వం, పరువు, ప్రతిష్టలు ఉన్నాయని జైట్లీ చెప్పుకొంటున్నదంతా అల్పమైన వాదనేనని కేజ్రీవాల్ కొట్టిపారేశారు. '2014 లోక్‌సభ ఎన్నికల్లో అమృత్సర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జైట్లీ పోటీచేశారు. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ భారీ విజయం సాధించినా, అమృతసర్ లో జైట్లీ మాత్రం లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రజల్లో తనకు గొప్ప వ్యక్తిత్వం ఉందని ఆయన చేసిన వాదనను భారత ప్రజాస్వామ్యం ఎన్నడూ అంగీకరించలేదు' అని ఢిల్లీ సీఎం తన సమాధానంలో పేర్కొన్నారు. జైటీ హయాంలో ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీఏ)లో అనేక అక్రమాలు జరిగాయని కేజ్రీవాల్, ఆయన పార్టీ ఆప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ తన పరువు తీశారని కేజ్రీవాల్, ఆప్‌పై జైట్లీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. -
చదువూ సంస్కారమూ...
మీరు విద్యార్థులు. విద్యను ఆర్జించేవారు. విద్యలో విద్ అంటే తెలుసుకొనుట. ఇది రెండు రకాలు. ఏది తెలుసుకోవడం వల్ల జీవితంలో సమస్త భోగాలు కలుగుతాయో, చాలా గొప్ప కీర్తి కలుగుతుందో, దేనివల్ల సమస్త సౌకర్యాలు జీవితంలో మనకు సమకూరుతాయో దానిని లౌకిక విద్య అంటారు. మరొకటి ఉంది. ఏది తెలుసుకొనడం వలన ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం ఉండదో దానిని బ్రహ్మవిద్య అంటారు. లౌకిక విద్యాభ్యాసం వల్ల మీరు బాగా వృద్ధిలోకి వస్తారు. వ్యక్తిగత జీవితంలో కానీ, ప్రభుత్వంలో కానీ, సమాజంలో కానీ సమున్నత స్థానం పొంది బాగా డబ్బు సంపాదించుకోగలుగుతారు,అలాగే కీర్తి ప్రతిష్ఠలు కూడా. కానీ రెండవది దాని కొరకు గాదు. అది దేని కొరకు అంటే... ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితి కొరకు. ఇప్పుడు మీరు లౌకిక విద్యయందున్నారు. ఈశ్వరానుగ్రహం కలిగితే ఇది బ్రహ్మవిద్యకు దారితీయవచ్చు. విద్ అంటే చదువుకొనుట, తెలుసుకొనుట అని చెప్పుకున్నాం కదా ! దీనికి పక్కన మరొక మాట ఉంటుంది-సంస్కారం. చదువూ సంస్కారం ఉండాలండీ అంటూంటారు కదా! ఇక్కడ చదువు అంటే తెలుసుకొనుట, అది కూడా నిరంతర ప్రయత్నంగా. విద్యార్థి దశలో ఏం చేయాలో శాస్త్రం కచ్చితంగా చెప్పింది. విద్యాసముపార్జన తప్ప వేరొక్కటి కూడదు అన్నది. విద్యార్థి దశ అంతా చదువుకొనుటకే, తెలుసుకొనుటకే తప్ప మరిదేనికీ కాదు, చివరకు సేవకు కూడా కాదు. తెలుసుకోవలసినవన్నీ బాగా తెలుసుకున్న నాడు, ఉద్యోగంలోకి వచ్చిన రోజున, అంతకుముందు విద్యార్థి దశలో సేవ ఎలా చేయాలని తెలుసుకున్నారో అప్పుడు అలా చేయాలి. విద్యార్థి దశలో మాత్రం విద్యాసముపార్జనం తప్ప మరే కార్యక్రమం చేపట్టినా అది దోషభూయిష్ఠమే, శరాఘాతమే. సనాతన ధర్మంలో గురువు లేని విద్య గుడ్డివిద్య అన్నారు. చదువు ప్రయోజనం నెరవేరడం కోసం, సంస్కారం ఏర్పడడం కోసం గురువుకీ శిష్యుడికీ మధ్య ఒక సంబంధం ఉంటుంది. శాస్త్రం గురువును వినీతుడు అంటుంది. అంటే వినయం నేర్పువాడు - అని. మరి శిష్యుడు... విధేయుడు. అంటే వినయం నేర్చుకొనువాడు. వినయం లేని ఏ చదువు మీరు చదివినా అది సమాజానికి భారమే. సంస్కారం దేని వలన ఏర్పడుతుంది? కేవలం వినడం వలన మాత్రమే ఏర్పడుతుంది. 84 లక్షల జీవరాశుల్లో కేవలం మనిషి మాత్రమే యోగ్యుడని పరమేశ్వరుడు ఆ శక్తి ఇచ్చాడు. ఇది దేనికి ? సంస్కారం ఏర్పరుచుకోవడానికి. వినడం అనేది సంస్కారమంతటికీ పునాది. నిద్రలేచింది మొదలు తిరిగి నిద్రపోయేంతవరకు మనం అనేక రకాల మాటలు వింటూంటాం. విద్యార్థి దశలో వినే మాటలన్నీ ఒకే కోవలోకి వస్తాయి. కానీ తర్వాత మీకు జీవితంలో నాలుగు రకాల మాటలు వినిపిస్తాయి. తస్మాత్ ! జాగ్రత్త. పరాకుగా ఉండకండి. ఈ నాలుగు రకాల్లో మొదటిది పొగడ్త. రెండవది తెగడ్త. మూడవది స్వత్కార్యసాధన కొరకు ప్రయత్నం, నాలుగవది అభ్యుదయ హేతువు. ఈ నాలుగు మాటల పట్ల ఎవడు పూర్తిగా అవగాహన కలిగి ఉంటాడో వాడు సంస్కారవంతుడిగా నిలబడగలడు. మొదటిది పొగడ్త. మిమ్మల్ని కొందరు అదేపనిగా పొగుడుతుంటారు. మీలో ఉన్న లోపాలు వారికి తెలియక కాదు. పొగడ్తలు వినడం, అన్నీ సబబేననుకోవడం ఎటువంటిదంటే... ఊబిలో దిగుతున్నవాడు ఎంత చక్కగా, ఎంత హాయిగా దిగుతున్నాను అనుకోవడం వంటిదే. అలా అనుకున్నవాడు ఏం చేస్తాడు... చివరికి ఊపిరి విడిచి పెట్టేస్తాడు. అలాగే అదేపనిగా పొగిడేవాడిని దగ్గరగా ఉంచుకోవడం మంచిది కాదు. ఎందుకంటే... బుద్ధి వినాశన హేతువు. అదేపనిగా వినడానికి అలవాటుపడితే మీ సంస్కారంలో దోషం వస్తుంది. అలా వారు పొగడనినాడు వారిని మీరు ఇష్టపడరు, అలా పొగిడినవారికే ఉపకారం చేస్తారు. అన్నం లేకుండా ఉండగలరు కానీ పొగడ్తలు వినకుండా గడపలేరు. అది ఒక వ్యసనంగా మారిపోతుంది. కేవలం పొగడ్తకు లొంగడం అనేది అత్యంత ప్రమాద హేతువు. అదేపనిగా పొగిడేవాడికి మీరు అంతేవాసిత్వం (శిష్యరికం) ఇచ్చారనుకోండి, అది తిరోగమనానికి దారితీస్తుంది, మీ స్వభావాన్ని పాడుచేసి వివేచనతో ఆలోచించగల మీ నైపుణ్యాన్ని ఇది భ్రష్టు పట్టిస్తుంది. అలాగని లోకంలో పొగడ్త వినకుండా ఉండడం కూడా సాధ్యం కాదు. మీరు ఒక మంచి పని చేస్తున్నప్పుడు మీరు చాలా మంచిపని చేస్తున్నారు అని ఎవరయినా అంటే వినొద్దని శాస్త్రం చెప్పలేదు. వినాలి, కానీ దాని మూలాన్ని విరిచేయాలి. కోటేశ్వరరావుగారు చెప్పే విషయాలు ప్రపంచవ్యాప్తంగా చాలామంది వింటూంటారని నిర్వాహకులు అంటారు. అది నిజమేనని నేను దానిని స్వీకరిస్తే అది నాకూ, వారికీ కూడా ఇబ్బందే. శంకరభగవత్పాదులవారి మాటలు నాకు ఒంటబట్టి చెప్పడంవల్ల నాకు ఈ కీర్తి కలుగుతున్నది, సమాజంలో నాకింత గౌరవం కలుగుతున్నది. ఈ కీర్తి ప్రతిష్ఠలు అన్నీ శంకరులవారికి దక్కాలి, నాకు కాదు. కాబట్టి నేను ఎప్పుడూ శంకరుని పాదాలు విడవకుందును గాక అని నేనన్నాననుకోండి. ఇప్పుడు పొగడ్త వల్ల నాకు ప్రమాదమేమీ ఉండదు. నీవు లోపల మానసికంగా ఎదిగి ఉంటే ఏ పొగడ్త కూడా నిన్ను ఏమీ చేయలేదు. తెలిసీ తెలియకుండా పనసపండు కోశారనుకోండి, ఆ మరకలు ఏం పెట్టి కడిగినా పోవు. అదే ముందుగా చేతికి నూనె రాసుకుని కోశారనుకోండి. ఎంత జిగురున్నా, మీకది ఒక్క పిసరంత కూడా అంటదు. విరుగుడు తెలిసి నిలబడితే మీకు సంస్కారబలం ఏర్పడుతుంది. సంస్కారబలానికి ప్రధానహేతువేది? అసలు వినకుండా ఉండడం కాదు, వినడం కూడా అవసరం. అందుకే పూర్వం రాజుల దగ్గర వంది, మాగధి అనే వారు ఉండేవారు. రాజు నిద్రలేచి వచ్చిన క్షణం నుంచీ పొగుడుతుంటారు. అలా పొగడడానికే రాజు జీతం ఇచ్చి మరీ వారిని పెట్టుకునేవాడు. వీరు ఏం చేస్తారంటే రాజుయొక్క పూర్వికులు చేసిన మంచి పనులను పొగుడుతూ, రాజు చేసే పొరబాట్లను స్తోత్ర రూపంలో చెపుతూ ఆయన్ని అప్రమత్తం చేస్తారు. ఎవడో పాడుబడిన బావిలో పడి చనిపోయాడని తెలిసి వెంటనే దానిని పూడ్చివేయమని రాజు ఆజ్ఞ జారీచేస్తాడు. వెంటనే వంది ‘‘ఓరాజా! ఈ నూతిని మీ తాతగారు తవ్వించారు. రాజ్యంలో ఉన్న క్షామం పోవాలని, కొన్ని లక్షలమంది బాగుపడాలని ఆయన ఈపని చేశారు, అంతేకానీ మనుషులు చచ్చిపోవడానికి ఈ ఏర్పాటు చేయలేదు’’ అంటుంటే, మాగధి అందుకుని ‘‘మహారాజా ! మీరు చేయబోయే ఈ పని ఇప్పుడు మంచిదిగా కనిపించినా మున్ముందు అలా ఉండకపోవచ్చు. మీరు ఇప్పటిదాకా చాలా మంచి పనులు చేసి కీర్తి గడించారు. ఇప్పుడు దానికి ప్రమాదం వాటిల్లుతుంది’’ అని స్తోత్రరూపకంగా చెపుతాడు. వెంటనే రాజు ‘‘ఔను, మా తాత మంచిపని చేశాడు’’ అని ఆ బావిని బాగుచేయించమని పురమాయిస్తాడు. ‘రాజా! ఆ నూతిని పూడ్చేయకండి’ అని మీరే నేరుగా అన్నారనుకోండి, మిమ్మల్ని పూడ్చేస్తారు. పొగడ్త హితవాక్కుగా ఉండడానికి రాజు ఈ ఏర్పాటు చేసుకుంటాడు. పొగడ్త ఎప్పుడూ ఎలా వినాలో తెలుసా ! వంశ ప్రతిష్ఠ వినాలి. మా తాత ఎటువంటివాడు, మా తండ్రి ఎటువంటివాడు, మా గురువు ఎటువంటివాడు, జగద్గురువులు ఎటువంటివారు, మన సనాతన ధర్మంలో వచ్చిన మహర్షులు ఎటువంటివారు, పీఠ వైభవం ఎటువంటిది.. ఇవి తెలుసుకున్ననాడు మీకు తెలియకుండానే ఒక వారసత్వ వైభవం మీకు తెలిసివస్తుంది, ఆ మర్యాదను నిలబెట్టవలసిన బాధ్యత గుర్తుకు వస్తుంది. పొగడ్త లేకుండా జీవితాన్ని గడపలేం. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. పాము కరిచిందనుకోండి. వ్యక్తి చనిపోతాడు. అదే పాములోని విషాన్ని వైద్యుడు సంస్కరించి ఓషధి రూపంలో ఇచ్చాడనుకోండి. అనారోగ్యం తగ్గిపోతుంది. అదీ... సంస్కరించుట. అక్కడ వచ్చింది చదువు పక్కన సంస్కారం అన్నమాట. చదువుకుంటూనే ఉండు, తెలుసుకుంటూనే ఉండు, ఎందుకు... నీ అంతట నీవు సమాజంలో నిలబడవలసిన రోజు వచ్చిన నాడు, ఏది ఎక్కడవరకు ఉంచాలో ఏది దగ్గరకు తీసుకోవాలో నీకు తెలిసి ఉండాలి. అన్నింటినీ కౌగిలించుకోవడం అలవాటయిపోతే ఒళ్లు కాలిపోతుంది. అదీ సంస్కారబలం అన్నమాటకు అర్థం. రెండవది తెగడ్త. అంటే నిరసించుట. అవతలివాడియందు ఆ లోపం ఉన్నదా, అలా విమర్శించడానికి అవకాశం ఉన్నదా... తెలిసి విమర్శించు. మీయందు దోషమున్నది, దానిని నేను విమర్శించాననుకోండి, తెగిడాననుకోండి, అది హితవాక్కవుతుంది. ఉదాహరణకు - మీకు అన్నం కూడా మానేసి చదువుకునే అలవాటు ఉన్నదనుకోండి. నేను మీ దగ్గరకు వచ్చి అది తప్పు. మీరెంత చదువుకున్నా, ఇలా చదువుకుంటే ఎందుకూ పనికిరారు. మీరు వేళపట్టున ఆహారం తీసుకోవడం, స్వల్ప వ్యాయామం చేయడం, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండడం కూడా అవసరం. అప్పుడు మీరు చదువుకున్న చదువు మీకు ఒంటపడుతుంది అని నేనన్నాననుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని తెగిడాను అనరు. మిమ్మల్ని సంస్కరించాను అంటారు. అసూయాజనితమయితే తెగడ్త అనే మాట వస్తుంది. సంస్కృతంలో నాకన్నా బాగా చదువుకున్న వ్యక్తి వచ్చి నాముందు నిలబడ్డాడనుకోండి. నేను వారి మాటలు విని ఆ తర్వాత పక్కకు వెళ్ళి ‘ప్చ్! ఆయనలా మాట్లాడేంటండీ, అన్నీ తప్పులండీ’ అన్నాననుకోండి. అది అసూయా జనితం. నాకు లోపల తెలుసు, ఆయన నా కన్నా మహాపండితుడు. కానీ నేనది అంగీకరించడానికి నా గర్వం నాకు అడ్డొస్తోంది. ఆయన మహా విద్వాంసుడండీ, అటువంటి వారి దర్శనం కలగడం ఈ వేళ నా అదృష్టం అని అనగలిగాననుకోండి. అప్పుడు నేను సంస్కారవంతుడనయి ఉన్నానంటారు. అందువల్ల చదువు ఒక్కటే చాలదు. దానికి సంస్కారం కూడినప్పుడే విలువనిస్తుంది. ఈ సంస్కారం ఇచ్చేది కూడా విద్యే. విద్య మనకిచ్చే గొప్ప విలువల్లో సంస్కారం ఒకటి. సంస్కారం అన్న మాటకు అర్థం ఎక్కడున్నదీ అంటే... ఎందుకంత కఠినంగా మాట్లాడారని ఆలోచించడం కాదు, వారు ఎలా మాట్లాడినా నా అభ్యున్నతి కోసమే అలా మాట్లాడారని అనుకోవడం నీ సంస్కారం. అలాకాక, పెద్దల వాక్కులో కాఠిన్యం చూడడం అలవాటయితే అది సంస్కార రాహిత్యం అవుతుంది. అలాగాక వారు ఎందుకోసం అలా మాట్లాడారా అని ఆలోచించి, దానిలోని మంచిని గ్రహించడం, ఆచరించడం మీ సంస్కారానికి నిదర్శనం. సంస్కారం... సంయత్ కరము అంటే బాగుగా చేయుట అని. మీరు ఏయే చదువులు చదువుకొని గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళ్లబోతున్నారో అది సమాజాన్ని పాడు చేసేదిగా ఉండకుండా జాగ్రత్తపడడం. ఒకడికి బలం ఉందనుకోండి. ఆ బలంతో బలహీనుడిని రక్షించవచ్చు, వాడిని హింసించి వాడికి నష్టం కలిగించనూ వచ్చు. ఒకడి దగ్గర చదువు ఉందనుకోండి. దానితో మరొకడిని వృద్ధిలోకి తీసుకురావచ్చు, అదే చదువుతో పదిమందిని మోసం కూడా చేయవచ్చు. కాబట్టి సంస్కారాన్ని చదువు పక్కన ఎందుకు ఉంచారంటే... నీకు దేనివల్ల ప్రకాశం కలుగుతుందో, దేనివల్ల లోకభాగ్యాలను పొందబోతున్నావో అది ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజంలోని అభ్యుదయానికి అడ్డంకి కాకుండా ఉండడానికి. దీనికి అవసరమయిన మర్యాదలను నేర్పడానికే సంస్కారమని పేరు. -
రూ. 100 కోట్లతో ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం