
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా నరసింగ పాడు గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలో వార్డు అభ్యర్థులిద్దరు గుర్తులు తారుమారయ్యాయని రగడ నెలకొంది. అధికారులు రంగంలోకి దిగి ఆరా తీయగా.. ఇద్దరు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్ని వారే పొరపాటు పడి ఒకరి గుర్తును మరొకరు ప్రచారం చేసుకున్నారు. వారికి అధికారికంగా కేటాయించిన అసలు గుర్తులేమిటో అధికారులు వివరించడంతో నాలుక్కరుచుకోవడం అభ్యర్థుల వంతయ్యింది. అభ్యర్థుల్లో ఒకరైన సకినాల ఏడుకొండలుకు గౌను, మరో అభ్యర్థి పొదిలి వెంకటేశ్వర్లుకు ప్రెషర్ కుక్కర్‌ను అధికారులు కేటాయించగా.. అభ్యర్థులు పొరబడి పోటీ అభ్యర్థి గుర్తును తమదిగా ప్రచారం చేసుకున్నారు.
(చదవండి: ఓటమిని జీర్ణించుకోలేక రోడ్డును తవ్వేశారు!)
ప్రజా తీర్పును వక్రీకరిస్తావా?
Comments
Please login to add a commentAdd a comment